అన్వేషించండి

Chiranjeevi Telangana Elections: నేను మౌనవ్రతం అంటూ స్వయంగా చెప్పిన చిరంజీవి - మీమర్స్‌కు ఫుల్ మీల్స్

మెగాస్టార్ చిరంజీవి మౌనవ్రతంలో ఉన్నారు. ఈ విషయం స్వయంగా ఆయన చెప్పడం విశేషం. తెలంగాణ ఎన్నికల్లో ఈ సరదా సంఘటన చోటు చేసుకుంది.

Telangana Assembly Elections 2023 - Chiranjeevi fun moment: తెలంగాణ అసెంబ్లీ కోసం ఈ రోజు జరిగిన ఎన్నికలలో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. ఉదయమే ఓటు వేయడానికి వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Cast His Vote)తో ఎన్నికల సరళి, ఆయన అభిప్రాయం గురించి మాట్లాడించడానికి ఓ న్యూస్ ఛానల్ విలేకరి విఫల యత్నం చేశారు. సదరు మీడియా ప్రతినిధికి చిరు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.

మౌనవ్రతంలో ఉన్నాను - చిరు రిప్లై!
మెగాస్టార్ మౌనవ్రతంలో ఉన్నారు. ఈ విషయం ఎవరు చెప్పారు? అని ఎక్కువ ఆలోచించకండి! స్వయంగా చిరంజీవి చెప్పారు. సతీమణి సురేఖతో కలిసి ఓటు వేయడానికి క్యూ లైనులో నిలబడిన చిరంజీవి దగ్గరకు ఓ మీడియా ప్రతినిధి వెళ్లారు. ప్రశ్నలు వేయగా... 'మౌనవ్రతం' అని చిరంజీవి చెప్పారు. ఆ తర్వాత మరో ప్రశ్న వేయగా... గొంతు మీద చెయ్యి చూపిస్తూ విలేకరిని వెనక్కి పంపిచారు. 

Also Read: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Telugu Swaggers (@telugu_swaggers)

మౌనవ్రతం లీక్ చేసిన మెగాస్టార్!
మెగా లీక్స్ తరహాలో తాను మౌనవ్రతంలో ఉన్న విషయాన్ని కూడా చిరంజీవి లీక్ చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజనులు పోస్టులు చేస్తున్నారు. 'బాస్ మౌనవ్రతం అని బాసే చెప్పారు' అంటూ ట్వీట్ చేశాడో నెటిజన్! 

Also Readయానిమల్ వయలెన్స్... సలార్ యాక్షన్... డిసెంబర్‌లో ధూమ్ ధామ్ థియేటర్లలోకి భారీ అండ్ క్రేజీ సినిమాలు 

మధ్యాహ్నం ఓటు వేయనున్న రామ్ చరణ్!
మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురువారం మధ్యాహ్నం తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. చిరుతో పాటు ఆయన రెండో కుమార్తె శ్రీజ కొణిదెల సైతం ఉదయం ఓటు వేశారు. రామ్ చరణ్ మాత్రం కాస్త ఆలస్యంగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ తీస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూరులో జరుగుతోంది. ఓటు వేయడం కోసం ఆ షూటింగుకు చిన్న బ్రేక్ ఇచ్చిన చరణ్... బుధవారం సాయంత్రం హైదరాబాద్  చేరుకున్నారు. ఓటు వేసిన తర్వాత మళ్ళీ మైసూరు వెళతారని తెలిసింది.  

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళి, రానా దగ్గుబాటి, సుకుమార్, హీరోలు రవితేజ, గోపీచంద్, నితిన్, సాయి ధరమ్ తేజ్ తదితరులు సైతం ఉదయం తమ ఓటు వేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget