Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు
నితిన్, రష్మికా మందన్నా మరోసారి జంటగా నటించనున్నారు. 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుములతో మరో సినిమా చేస్తున్నారు. ఉగాది సందర్భంగా సినిమా అనౌన్స్ చేశారు. అదీ వెరైటీగా!

'భీష్మ' సినిమాలో నితిన్ (Hero Nithiin), రష్మికా మందన్నా (Rashmika Mandanna) జంటగా నటించారు. ఆ చిత్రానికి దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహించారు. 'భీష్మ' మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ కాంబో మరోసారి రిపీట్ కానుంది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల... ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఉగాది సందర్భంగా ఈ రోజు ఆ సినిమా ప్రకటించారు. అదీ వెరైటీగా! ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెటైర్లు గట్టిగా వేసుకున్నారు. అదీ స్పెషాలిటీ!
మళ్ళీ సేమ్ హీరోయిన్ - వెంకీపై నితిన్
'భీష్మ' కంటే ముందు 'ఛలో' సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా అది. కథానాయికగా తెలుగులో రష్మికకు కూడా అదే తొలి సినిమా. 'భీష్మ' ఇంటర్వ్యూల్లో వెంకీ కుడుముల స్క్రిప్ట్ రాయడం కంటే ముందు, ఓం కంటే ముందు కథానాయికగా రష్మిక పేరు రాస్తాడని నితిన్ సరదాగా కామెంట్ చేశారు. మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేశారు.
'ప్రభా... ఎవరూ ఇంకా రాలేదా?' అని నితిన్ అడుగుతారు. 'హీరోయిన్ ఉదయం 8 గంటలకు వచ్చారు' అని అసిస్టెంట్ నుంచి సమాధానం వస్తుంది. '8 గంటలకా సేమ్ హీరోయినా?' అంటూ నితిన్ అడుగుతారు. ఇంతలో రష్మిక వచ్చారు. 'సేమ్ హీరోయినే. డౌటా?' అని అడుగుతారు. 'అస్సలు లేదమ్మా! మన డైరెక్టర్ స్క్రిప్ట్ లో ఓం రాసే ముందు నీ పేరే రాస్తాడు. నాకు తెలుసుగా' అని నితిన్ ఆన్సర్ ఇచ్చారు.
రష్మిక కాంట్రవర్సీలు... నితిన్ ఫ్లాపులు!
ఇటీవల రష్మిక చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాలకు దారి తీశాయి. ఆ విషయాన్నీ దర్శకుడు వెంకీ కుడుముల కామెడీ చేసేశారు. 'ఎనిమిది గంటలకు వచ్చి ఏం చేస్తున్నావ్?' అని నితిన్ అడిగితే... 'ఢిల్లీ, బాంబే అభిమానులతో ఇప్పటి వరకు ఇంస్టాగ్రామ్ లైవ్ పెట్టుకున్నా. ఈ షూట్ అయిన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కొచ్చిన్....' అంటూ రష్మిక చెప్పుకుంటూ వెళితే నితిన్ బ్రేకులు వేస్తారు. నేషనల్ క్రష్ కాబట్టి ఆ మాత్రం ఉంటుందని చెబుతారు.
Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో తారకరత్న కుమార్తె ఎంట్రీ - ఫస్ట్ పోస్ట్ తండ్రి గురించే!
'లైవ్ యేనా? కాంట్రవర్సీలు ఏమైనా?' అని నితిన్ అడగబోతే... 'అక్కడికి వెళ్ళవద్దు. నేను ఒక్క మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్సీలు అవుతున్నాయి' అని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. 'అది చాలా బెటర్. నేను ఒక్క హిట్ ఇస్తే రెండు మూడు ఫ్లాపులు అవుతున్నాయ్' అని నితిన్ సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు.
జీవీ... నువ్వు హీరో కాదమ్మా?
నితిన్, రష్మిక, వెంకీ కుడుముల సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఆయన తమిళంలో హీరోగా కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు మేకప్ వేసుకోవడం లేదని, కేవలం మ్యూజిక్ ఇస్తే చాలంటూ అతడి మీద సెటైర్ వేశారు. 'భీష్మ' సినిమా విడుదలైన మూడేళ్లకు వెంకీ కుడుముల సినిమా పట్టాలు ఎక్కుతోంది. ఆ లేటు మీద కూడా సెటైర్ పడింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాము ఎవరి మనోభావాలు దెబ్బ తీయడం లేదని, తమ మనోభావాలు తామే దెబ్బ తీసుకుంటున్నామని వీడియో స్టార్టింగులో నితిన్, రష్మిక చెప్పడం విశేషం.
Also Read : సైంధవుడిగా మారుతున్న వెంకటేష్ - రెగ్యులర్ షూటింగుకు రెడీ, ఎప్పట్నించి అంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

