(Source: ECI/ABP News/ABP Majha)
Kangana Ranaut: కంగనాపై కాంగ్రెస్ నేత అసభ్యకర వ్యాఖ్యలు, వేశ్యల ప్రస్తావన వద్దంటూ మండిపడ్డ నటి
Kangana Ranaut: కంగనా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఒక కాంగ్రెస్ లీడర్ కూడా అలాంటి పోస్ట్ చేసి తర్వాత తన అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ కొత్త కథ మొదలుపెట్టారు.
Kangana Ranaut: బాలీవుడ్ కాంట్రవర్షియల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్.. ఇప్పుడు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతోంది. బీజేపీ తరపున హిమాచల్ ప్రదేశ్‌లోని ఎంపీగా పోటీకి దిగనుంది. జాతీయ ఎన్నికలకు ఇంకా కొన్నిరోజులు ఉంది అనగానే రాజకీయాల్లో ఒక కొత్త కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. కాంగ్రెస్ ప్రతినిధి అయిన సుప్రియా శ్రీనతే.. కంగనాపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ఇందులో కంగనా మోడర్న్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఇది చూసిన కంగనా.. వెంటనే తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. అయితే ఇదంతా తాను చేయలేదని సుప్రియా వివరణ ఇవ్వడానికి ముందుకొచ్చారు.
గౌరవం దక్కాలి..
సుప్రియ శ్రీనతే ఇన్‌స్టాగ్రామ్‌లో తన గురించి అసభ్యకర పోస్ట్ చూడగానే కంగనా వెంటనే రియాక్ట్ అయ్యింది. ‘‘సుప్రియ గారు. నేను ఆర్టిస్ట్‌గా నా 20 ఏళ్ల కెరీర్‌లో అన్ని రకాల పాత్రలు పోషించాను. క్వీన్‌లో అమాయకమైన అమ్మాయి దగ్గర నుంచి ధాకడ్‌లో గూఢచారి వరకు, మణికర్ణికలో దేవత దగ్గర నుంచి చంద్రముఖిలో దెయ్యం వరకు, రజ్జోలో వేశ్య దగ్గర నుంచి తలైవిలో నాయకురాలి వరకు.. ఇలాంటి ఎన్నో పాత్రలు చేశాను. ఆడవారు అంటే కేవలం శరీర అవయవాలు మాత్రమే కాదు అనేలా మన కూతుళ్లను మనం పెంచాలి. ముఖ్యంగా వేశ్యల భారమైన జీవితాలను, వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారి ప్రస్తావనతో తిట్టడం మానేయాలి. ప్రతీ మహిళకు గౌరవం దక్కాలి’’ అని కంగనా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా సుప్రియా శ్రీనతే చేసిన కామెంట్స్ వల్ల యాక్షన్ తీసుకోవాలని నేషనల్ కమీషన్ ఆఫ్ ఉమెన్ డిమాండ్ చేసింది.
నేను అలా చేయను..
ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ సుప్రియా శ్రీనతే ఒక వీడియోను విడుదల చేశారు. ‘‘చాలామంది నా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యాక్సెస్ ఉంది. అందులో నుంచి ఎవరో ఒకరు చాలా అభ్యంతరకరమైన పోస్ట్ చేశారు. ఆ విషయం నాకు తెలియగానే నేను వెంటనే డిలీట్ చేశాను. నా గురించి బాగా తెలిసిన వారికి నేను ఒక మహిళపై అలాంటి వ్యాఖ్యలు చేయనని కూడా బాగా తెలుసు. నా పేరుతో వేరే అకౌంట్ కూడా ఉంది. ఎవరో ఆ పోస్ట్‌ను అక్కడ నుంచి కాపీ చేశారు. యాక్సెస్ ఉన్నవారిలో ఎవరు అలా చేశారో నేను కనుక్కుంటున్నాను. ట్విటర్‌కు ఇప్పటికే రిపోర్ట్ చేశాను. కేవలం సుప్రియ శ్రీనతే మాత్రమే కాదు.. కంగనా రాజకీయాల్లోకి వస్తున్న విషయంపై చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
मेरे फेसबुक और इंस्टा के अकाउंट पर कई लोगों का एक्सेस है. इसमें से किसी व्यक्ति ने आज एक बेहद घृणित और आपत्तिजनक पोस्ट किया था.
— Supriya Shrinate (@SupriyaShrinate) March 25, 2024
मुझे जैसे ही इसकी जानकारी हुई मैंने वह पोस्ट हटा दिया. जो भी मुझे जानते हैं, वह यह अच्छी तरह से जानते हैं कि मैं किसी भी महिला के लिए व्यक्तिगत भोंडी… pic.twitter.com/CFDNXuxmo2
అమ్మాయి విషయంలోనే అలా..
సుప్రియ శ్రీనతేతో పాటు మరో కాంగ్రెస్ లీడర్ కూడా ఈ విషయంపై నెగిటివ్ కామెంట్స్ చేయగా.. దానిపై కూడా కంగనా స్పందించింది. ఒక అబ్బాయి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చినా తనను ఎవరు ఏమనరని, ఒక అమ్మాయి వస్తే మాత్రం తనను మానసికంగా అసభ్యకర వ్యాఖ్యలతో అటాక్ చేస్తారని ఫైర్ అయ్యింది. నేషనల్ కమీషన్ ఆఫ్ ఉమెన్ కూడా ఈ విషయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. సుప్రియా శ్రీనతే పోస్ట్‌ను ఖండించింది. అయితే సుప్రియా కావాలనే ముందు అసభ్యకరంగా పోస్ట్ చేసి తర్వాత తనకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారని కంగనా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
Also Read: ఏపీ రాజకీయాలు, సీఎం జగన్‌పై '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు