Ginna First Look: విష్ణు మంచు రెడీ - 'జిన్నా' ఫస్ట్ లుక్ చూడటానికి మీరు రెడీనా?
విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'జిన్నా'. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.
విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గాలి నాగేశ్వరరావు పాత్రలో విష్ణు నటిస్తున్నారు. త్వరలో గాలి నాగేశ్వరరావు ఎలా ఉంటాడు? లుక్ ఎలా ఉంటుంది? అనేది చూపించనున్నారు. ఈ నెల 11న... అనగా సోమవారం ఫస్ట్ లుక్ (Ginna Movie First Look) విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు.
'జిన్నా'లో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని పాటలకు ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రచారం కూడా అందుకు తగ్గట్టు ప్లాన్ చేశారట.
Also Read : 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ: బోరింగ్ బర్త్ డే పార్టీనా? అంతా హ్యాపీనా?
కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు (Mohan Babu Manchu) ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.
Also Read : హాస్పిటల్‌లో చేరిన విక్రమ్, అకస్మాత్తుగా ఏమైంది? ఆందోళనలో ఫ్యాన్స్!
View this post on Instagram