Bihar Youth: ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
Bihar News: బిహార్‌లో రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేగంగా వస్తోన్న రైలును వీరు గమనించకపోవడంతో పై నుంచి దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందారు.
Bihar Teen Playing Pubg On Railway Track Died After Train Runs Over Them: ముగ్గురు యువకులు రైలు పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతుండగా రైలు ఢీకొని మృతి చెందిన ఘటన బీహార్‌లో (Bihar) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నాలోని పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్ - ముజఫర్‌పుర్ రైల్వే మార్గంలో పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతుండగా అదే మార్గంలో వచ్చిన రైలు వారిపైకి దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యువకులు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండడం వల్లే తమ వైపు వస్తోన్న రైలును గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు.
మృతులు ఫర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కొందరు యువకులు బహిరంగ ప్రదేశాల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండడంతో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకర ప్రదేశాల్లో పరధ్యానంగా ప్రవర్తించడం వల్ల వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు సైతం ముప్పు కలిగిస్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఇలాంటి వాటి పట్ల పిల్లలకు అవగాహన కల్పిస్తే.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయని వెల్లడించారు.
Also Read: Go Goa Gone: టూరిస్టులు లేక బోసిపోతున్న గోవా - బోర్ కొట్టేసిందా ? కొట్టి చంపుతూంటే ఎవరైనా వెళ్తారా?