News
News
X

Happy Birthday Movie Review - 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ: బోరింగ్ బర్త్ డే పార్టీనా? అంతా హ్యాపీనా?

Happy Birthday Telugu Movie Review: 'మత్తు వదలరా'తో టాలీవుడ్ ప్రముఖులు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు రితేష్ రానా. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'హ్యాపీ బర్త్ డే'.

FOLLOW US: 

సినిమా రివ్యూ: హ్యాపీ బర్త్ డే
రేటింగ్: 1.75/5
నటీనటులు: లావణ్యా త్రిపాఠీ, నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గెటప్ శ్రీను తదితరులు 
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
సంగీతం: కాల భైరవ
సమర్పణ: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రితేష్ రానా
విడుదల తేదీ: జూలై 8, 2022

'అందాల రాక్షసి' నుంచి 'చావు కబురు చల్లగా' వరకూ... లావణ్యా త్రిపాఠీ (Lavanya Tripathi) ఎమోషనల్ క్యారెక్టర్లే ఎక్కువ చేశారు. ఫర్ ఏ ఛేంజ్‌... 'హ్యాపీ బర్త్ డే' (Telugu Movie Happy Birthday) సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేశారు. 'మత్తు వదలరా'తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకులను నవ్వించిన రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సర్రియల్ కామెడీ అంటూ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. మరి, సినిమా ఎలా ఉంది? (Telugu Movie Happy Birthday Review)

కథ (Happy Birthday Movie Story): హ్యాపీ... పసుపులేటి హ్యాపీ త్రిపాఠీ (లావణ్యా త్రిపాఠీ) పుట్టినరోజు. ఫ్రెండ్ స‌ర్‌ప్రైజ్‌ బర్త్ డే పార్టీ ప్లాన్ చేశానంటే రిట్జ్ గ్రాండ్ హోటల్‌కు వెళుతుంది. పార్టీ బోరింగ్‌గా ఉండటంతో సేమ్ హోటల్‌లో ఉన్న పోష్ పబ్‌కు వెళుతుంది. ఆమె ఆర్డర్ చేసిన డ్రింక్‌లో మత్తు మందు కలుపుతారు. ఒక బేరర్ కిడ్నాప్ చేస్తాడు. మత్తు నుంచి కోలుకున్నాక... మళ్ళీ సేమ్ హోటల్‌కు హ్యాపీ వస్తుంది. ఎందుకు? గన్ లైసెన్స్‌లు లీగలైజ్ చేసిన రక్షణ శాఖ మంత్రి రిత్విక్ సోది (వెన్నెల కిషోర్) కూడా ఆ హోటల్‌కు వస్తాడు. ఎందుకు? మాక్స్ పెయిన్ ('స్వామి రారా' సత్య), లక్కీ (నరేష్ అగస్త్య) ఎవరు? అసలు, ఈ నలుగురికీ సంబంధం ఏంటి? ఒకరికొకరు పరిచయం లేని ఈ నలుగురూ ఎలా కలిశారు? ఈ నలుగురినీ ఒక్క చోటకు చేర్చిన కారణం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Happy Birthday Review) : సర్రియల్ కామెడీ... ఈ జానర్ మన తెలుగు ప్రేక్షకులకు కొత్త. అయితే... వాళ్ళకు సినిమా కొత్త కాదు. కామెడీకి ఏ పేరు పెట్టినా నవ్విస్తే చాలు సినిమాను ఆదరిస్తారు. వాళ్ళను నవ్వించే సీన్లు 'హ్యాపీ'లో ఎన్ని ఉన్నాయి? అంటే... వేళ్ళ మీద లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి. 

'మత్తు వదలరా' సినిమాతో రితేష్ రానా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టు సినిమా ప్రారంభం ఉంది. స్క్రీన్ ప్లే పరంగానూ మరోసారి ఆకట్టుకుంటారు. అయితే... నవ్వించడంలో చాలా వెనుకబడ్డారు. ఆల్రెడీ మీమ్ పేజీల్లో చూసిన పంచ్ డైలాగులు, పేరడీలు, సెటైర్లు చాలా సన్నివేశాల్లో వర్కవుట్ అవ్వలేదు. సినిమాకు అదే మేజర్ మైనస్. అందువల్ల, నవ్వుల సంగతి పక్కన పెడితే... బోరింగ్ మూమెంట్స్ ఎక్కువ అయ్యాయి. మాంచి ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేసిన దర్శకుడు... మాంచి సీన్స్ రాసుకోలేకపోయారు. ఫస్టాఫ్ సోసోగా వెళ్ళినా... సెకండాఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందని ఎదురు చూసేలా చేశారు.    

కామెడీ కోసమో... మరొకటో... 'నిర్మాతల కోరిక మేరకు చిత్రీకటించబడింది' అని హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్‌లో డిస్‌క్లైమ‌ర్‌ వేశారు. ఆ పాటలో నిర్మాతలు పెట్టిన ఖర్చు కనిపించింది. కానీ, దర్శకుడు మాత్రం ఏమాత్రం శ్రద్ధ పెట్టినట్టు అనిపించలేదు. కాల భైరవతో మంచి సాంగ్స్ చేయించుకోలేదు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఓకే. దర్శకుడి ఊహకు తగ్గట్టు విజువలైజ్ చేశారు. నిర్మాణ విలువలు బావున్నాయి. 

నటీనటులు ఎలా చేశారు?: 'హ్యాపీ'లో కొత్త లావణ్యా త్రిపాఠీ కనిపిస్తారు. అందులో మరో సందేహం లేదు. ప్రేమ పాటలు, భావోద్వేగ సన్నివేశాలు లేని పాత్ర కావడం... రెగ్యులర్ హీరోయిన్‌గా కాకుండా కొంచెం కొత్తగా చేసే క్యారెక్టర్ కావడంతో హుషారుగా చేశారు. కొన్ని సీన్స్‌లో లావణ్య కామెడీ టైమింగ్ స‌ర్‌ప్రైజ్ చేస్తుంది. కొంత యాక్షన్ కూడా చేశారు. లుక్స్ పరంగా వేరియేషన్ చూపించారు. 'హ్యాపీ'లో ప్రేక్షకులు లావణ్యా త్రిపాఠీ సొంత గొంతు వినొచ్చు. 'వెన్నెల' కిషోర్, 'స్వామి రారా' సత్య, గుండు సుదర్శన్, రాహుల్ రామకృష్ణ టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు. మాంచి కంటెంట్ ఉన్న సన్నివేశాలు పడినప్పుడు చెలరేగిపోయారు. వీక్ సీన్స్ వచ్చినప్పుడు ట్రై చేశారు కానీ... వర్కవుట్ అవ్వలేదు. నరేష్ అగస్త్యకు చాలా సన్నివేశాల్లో మాటలతో కాకుండా సైగలతో నటించే పాత్ర లభించింది. గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ ట్రాక్ విసిగించింది. 'మత్తు వదలరా' సినిమాలో రోహిణి ట్రాక్ వర్కవుట్ అయినట్టు... ఈ సినిమాలో రోహిణి ట్రాక్ వర్కవుట్ కాలేదు.

Also Read : 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? సత్యరాజ్ కుమారుడు శిబి నటించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే?: 'జబర్దస్త్ జడ్జ్‌లా సంబంధం లేకుండా నవ్వుతున్నావ్' అని సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ప్రేక్షకుల మీద దర్శకుడు వేసిన సెటైర్ ఏమో అది!? లేదంటే సినిమాలో జోక్స్ తక్కువ ఉన్నా ప్రేక్షకులు ఎక్కువ నవ్వుతారని ఆయన అనుకున్నారో!? కంటెంట్‌తో సంబంధం లేకుండా చిన్న జోక్ వచ్చినా సరే... న‌వ్వుకునే కెపాసిటీ, సినిమా చూసే ధైర్యం మీకు ఉంటే థియేట‌ర్ల‌కు వెళ్ళ‌వ‌చ్చు. లేదంటే హ్యాపీగా ఇంట్లో  కామెడీ రియాలిటీ షోలు చూసుకోవచ్చు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... సినిమా స్టార్టింగులో 'వెన్నెల' కిషోర్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత 'వెన్నెల' కిషోర్, 'స్వామి రా రా' సత్య మధ్య ట్రాన్స్‌లేష‌న్‌ సీన్... 'వెన్నెల' కిషోర్, గుండు సుదర్శన్ మధ్య సీన్ బావున్నాయి. 

Also Read : థోర్ లవ్ అండ్ థండర్ రివ్యూ: ఉరుముల దొర ఆకట్టుకున్నాడా?

Published at : 08 Jul 2022 12:17 PM (IST) Tags: ABPDesamReview Happy Birthday Review In Telugu Happy Birthday Telugu Review  Happy Birthday Rating  Vennela Kishore's Happy Birthday Review Lavanya Tripathi's Happy Birthday Review

సంబంధిత కథనాలు

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'

Janaki Kalaganaledu August 9th Update: బెడిసికొట్టిన ప్లాన్, జ్ఞానంబ కాళ్ళ మీద పడ్డ మల్లిక- జానకికి జ్ఞానంబ క్షమాపణలు

Janaki Kalaganaledu August 9th Update: బెడిసికొట్టిన ప్లాన్, జ్ఞానంబ కాళ్ళ మీద పడ్డ మల్లిక- జానకికి జ్ఞానంబ క్షమాపణలు

Ravi Teja Nephew As Hero : రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు

Ravi Teja Nephew As Hero : రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు

Karthika Deepam Serial ఆగస్టు 9:శోభతో పెళ్లికి సిద్ధమైన నిరుపమ్, స్వప్నకి షాకివ్వబోతున్న శౌర్య

Karthika Deepam Serial ఆగస్టు 9:శోభతో పెళ్లికి సిద్ధమైన నిరుపమ్, స్వప్నకి షాకివ్వబోతున్న శౌర్య

టాప్ స్టోరీస్

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Hyderabad Traffic Today: వాహనదారులకు అలర్ట్! నేడు ఈ రూట్స్‌లోకి నో ఎంట్రీ, భారీ ట్రాఫిక్ జామ్‌! వేరే మార్గాలివీ

Hyderabad Traffic Today: వాహనదారులకు అలర్ట్! నేడు ఈ రూట్స్‌లోకి నో ఎంట్రీ, భారీ ట్రాఫిక్ జామ్‌! వేరే మార్గాలివీ