CMR College Bathroom Videos Issue: సొంగ కార్చుకుంటూ చూడాలంటూ ప్రీతి రెడ్డి బూతులు- బాత్రూమ్ లో వీడియోలపై విచారణ: ఏబీపీతో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ లోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజి లేడిస్ హాస్టల్ బాత్ రూమ్ లో వీడియోలు తీసారంటూ విద్యార్దినిలు ఆందోళన చేస్తుంటే, వీడియోలు బయటకు రాలేదని పోలీసు చెబుతున్నారు.
ఏబీపీ దేశం: సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజి లేడిస్ హస్టల్ బాత్రూమ్ లో వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు చేసిన ఆరోపణలు, ఫిర్యాదులో వాస్తవాలేంటి? విచారణ ఎలా జరుగుతుంది?
మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి: సీఎంఆర్ కాలేజీ లేడిస్ హాస్టల్ బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారనేది అవాస్తవం. స్నానం చేస్తుండగా బాత్రమ్ లోకి తొంగి చూస్తూ, వీడియోలు తీశారనే ఫిర్యాదు విద్యార్థినుల నుంచి వచ్చింది. ఫిర్యాదుపై విచారణ చేపట్టాము. ఘటనా స్దలంలో పరిశీలిస్తే అక్కడ పనిచేసేవారెవరైనా బాత్ రూమ్‌లోకి తొంగిచూసే అవకాశం ఉంది. బాత్రూమ్ లోని వెంటిలేటర్ వద్ద రెండు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అవి ఎవరివి అనేది విచారణ చేస్తున్నాం. హాస్టల్ మెస్ లో పనిచేసే వారిని అందుపులోకి తీసుకుని, వారి వద్ద సెల్ ఫోన్లు పరిశీలించాము. ఫోన్లలో ఇప్పటి వరకూ ఎటువంటి వీడియోలు మాకు దొరకలేదు. ఒకవేళ వీడియోలు డిలీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా డిలీట్ చేసిన వీడియోలు రికవరీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాము.
ఏబీపీ దేశం: హాస్టల్ విద్యార్థినులు, విద్యార్థి సంఘాలు ఇంకా హాస్టల్ వార్డెన్ ముందు ఆందొోళనలు కొనసాగిస్తున్నారు. పోలీసు విచారణ కొససాగుతున్నా ఎందకు నిరసనలు వీడిటంలేదు..
ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి: వాళ్లకు ఏం న్యాయం కావాలే క్లారిటీగా చెప్పడంలేదు. మూడు నెలల నుండి వీడియోలు తీసారని చెబుతున్నారు. మరి మూడు నెలల నుండి ఎందుకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అప్పుడే మా ద్రుష్టికి తీసుకురాలేదు. కాలేజి యాజమాన్యంతో కూడా మాట్లడుతున్నాము.
ఏబీపీ దేశం: ఎవరిపై అనుమానాలున్నాయని విద్యార్దినిలు చెబుతున్నారు. వీడియోలు తీసిన వారి పేర్లను చెప్పారా..
ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి: ఈ ఘటనలలో ప్రత్యేకంగా ఎవరిపేరూ చెప్పలేదు. బాత్ రూమ్ లకు సమీపంలోనే మెస్ ఉంది. బాత్ రూమ్ లోకి తొంగి చూసే అవకాశం ఒక్క మెస్ నుండి మాత్రమే ఉంది. అందుకే మెస్ సిబ్బందిని విచారిస్తున్నాం. సైంటిఫిక్ అవిడెన్స్ వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
ఏబీపీ దేశం: హాస్టల్ ఇన్ ఛార్జ్ ప్రీతి రెడ్డికి తెలిసే మా విడియోలు రికార్డ్ చేయించారని విద్యార్దినులు చేసే ఆరోపణలలో వాస్తవం ఉందా?
ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి: అమ్మాయిలను కాస్త కంట్రోల్్ లోె పెట్టడం కోసం వార్డెన్ కఠినంగా ఉంటారు. ప్రీతి రెడ్డిపై చేసిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాం. ఆమెను అదుపులోకి తీసుకున్నాం.అన్ని కోణాళ్లో విచారణ చేపట్టాం.
ఏబీపీ దేశం: గతంలో ఈ కాలేజిలో ఇలాంటి ఘటనలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయా...?
ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి: గతంలో సిఎంఆర్ కాలేజిపై ఇలాంటి విమర్శలు, ఫిర్యాదులు వచ్చాయి. సైబర్ క్రైమ్ మీటంగ్ పెట్టడం ద్వారా విద్యార్దినులలో ఇటువంటి ఘనలపై అవగాహన కల్పిస్తాం. మీకు ఎటువంటి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించండి. గర్ల్స్ హాస్టల్ లో విద్యార్దినిలు తండ్రులు ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఇప్పటి వరకూ ఎటువంటి వీడియోలు లభించలేదు. తీసారనే ఆరోపణలు తప్ప ఆధాలు లేవు.
ఏబీపీ దేశం: హాస్టల్ వార్డెన్ ప్రమేయం ఉందా.. ఈ ఘటనపై పోలీసులేమంటున్నారు..
ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి: వార్డెన్ అసభ్యంగా బూతులు తిట్టేవారని విద్యార్దినులు ఆరోపిస్తున్నారు. కానీ ఆమె వీడియోలు తీయించింది, తీసింది అని ఎవరూ అనలేదు. 11 సెల్ ఫోన్ లు ల్యాంబ్ కు పంపాము. ఫలితాలు వచ్చాక, వీడియోల వ్యవహారంలో వాస్తవాలు బయటకొస్తాయి.