అన్వేషించండి

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం

PM KISAN: కేంద్రం త్వరలోనే పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేయనుంది. ఇప్పటికీ ఇంకా దరఖాస్తు చేసుకోని వారు వెంటనే అప్లయ్‌ చేసుకోండి.

PM Kissan Yojana: ప్రధానమంత్రి కిసాన్ యోజన సమ్మాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో నేరుగా నగదు  జమ అయ్యే అవకాశం ఉంది.

ఆర్థికసాయం
రైతులకు ఆర్థిక చేయూత అందించడమేగాక...పెట్టుబడి సొమ్ము అందించేందుకు కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ యోచన సమ్మన్ పథకం కింద రూ.6వేల సాయం అందిస్తోంది. మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేస్తున్నారు. ఇప్పటికే  18 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున జమ కాగా....ఇప్పుడు  19వ విడత విడుదలకానున్నాయి. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. గతేడాది అక్టోబర్‌లో నిధులు విడుదలయ్యాయి. కాబట్టి ఈ విడత సొమ్ము ఫిబ్రవరిలో జమ చేసేఅవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు.

మీ పేరు ఉందో లేదో చూసుకోండి
రెండు హెక్టార్లలోపు సాగు భూమి ఉందా..? అయితే మీరు పీఎం కిసాన్ యోజన పథకానికి అర్హులే. ఇప్పటి వరకు మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేదా..? అయితే వెంటనే త్వరపడండి. ఒకవేళ ఇప్పటికే మీరు ధరఖాస్తు చేసుకున్నారా..? అయినప్పటికీ  మీ ఖాతాలో నగదు జమ కావడం లేదా..? అయితే  ఒకసారి జాబితాలో మీరు పేరు ఉందో లేదో సరిచూసుకోండి. 

పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకోండి ఇలా...
ముందుగా www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
New Farmer Registration ను  తెరవండి
అందులో ఆధార్‌ సహా వివరాలన్నింటినీ నమోదు చేయండి
అంతే మీరు పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లే

జాబితాలో పేరు ఉందో లేదో సరిచూసుకోండి
ముందుగా www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
Beneficiary List ఓపెన్ చేయండి
చిరునామా వివరాలు ఎంటర్‌ చేసి Get Report పై క్లిక్ చేశారా క్షణాల్లో జాబితా మీముందు ఉంటుంది.

కేంద్రం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కొంత నిధులు జోడించి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.20వేలు రైతుల ఖాతాల్లోకి వేస్తామని తెలపగా....ఏపీ ప్రభుత్వం సైతం రైతులకు ఎన్టీఆర్ రైతు భరోసా నిధులు అందించనుంది. పంటలు వేసే సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థికసాయం అందిస్తున్నాయి. మూడు విడతల్లో రైతుల  అవసరాలకు  అనుగుణంగా  ఎప్పటికప్పుడు  వారి ఖాతాల్లో నగదు జమచేస్తున్నాయి. వేడినీళ్లకు చన్నీళ్లు తోడులాగా రైతులకు ఈసొమ్ము  ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది.

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది రైతులకు  ప్రయోజనం అందుతోంది.అయితే  ఈ-కేవైసీ చేయించుకోని రైతులకు ఈ ప్రయోజనాలు అందవు. కాబట్టి వీలైనంత త్వరగా రైతులంతా ఈ-కేవైసీ చేయించుకోవాలని  అధికారులు సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో  e-kyc, ఆధార్‌ మరియు ఎన్‌పీసీఐలను అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల ఇంటింటికి  వెళ్లి వివరాలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అర్హులైనవారందరికీ ఈ అవకాశం అందించాలని  రైతులు కోరుతున్నారు. ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి సమస్యలు  తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొందరి పేర్లు తొలగించారని వారందరికీ ఇప్పుడు న్యాయం చేయాలంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
Sajjala Ramakrishna Reddy: సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్‌ 
సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్‌ 
Kushboo Sundar: షూటింగ్ సెట్‌లో కూడా వదలకుండా వేధింపులు- తండ్రిపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
షూటింగ్ సెట్‌లో కూడా వదలకుండా వేధింపులు- తండ్రిపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
Sajjala Ramakrishna Reddy: సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్‌ 
సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్‌ 
Kushboo Sundar: షూటింగ్ సెట్‌లో కూడా వదలకుండా వేధింపులు- తండ్రిపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
షూటింగ్ సెట్‌లో కూడా వదలకుండా వేధింపులు- తండ్రిపై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. సత్తాచాటిన బోలాండ్
Today Movies on OTT: ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Pushpa 2 Gangamma Jatara Song: థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన
థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన Pushpa 2 "గంగమ్మ తల్లి జాతర" వీడియో సాంగ్ వచ్చేసిందోచ్
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Embed widget