Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో నాగార్జున ఫ్యాషన్ సెన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా జరిగిన సండే ఎపిసోడ్‌లో ఆయన ధరించిన యెల్లో డియోర్ స్వెటర్ ధర తెలిసి ప్రేక్షకులు షాకవుతున్నారు.
Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో నాగార్జున డ్రెస్సింగ్ చూసి ప్రేక్షకులంతా ఫిదా అయిపోతున్నారు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్, కాస్ట్‌లీ షర్ట్స్‌తో, ప్రతీవారం ఒక కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు నాగ్. పైగా ఆయన ధరించే బట్టల ఖరీదు చూస్తుంటే కూడా ప్రేక్షకులు ఆశ్యర్యపోక తప్పడం లేదు. ఇప్పటికే నాగార్జున ధరించిన ఎన్నో కాస్ట్‌లీ షర్ట్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోగా.. తాజాగా ఆయన వేసుకున్న డియోర్ స్వెటర్ ధర కూడా ఒక రేంజ్‌లో ఉందని తెలుసుకున్నారు. ఇటీవల బిగ్ బాస్‌లో జరిగిన సండే ఎపిసోడ్‌లో యెల్లో స్వెటర్‌తో కనిపించారు నాగ్. ఆ స్వెటర్ కావాలని అమర్ అడగడంతో అసలు దీని ధర ఎంత ఉంటుంది అని నెటిజన్లు కనుక్కోవడం మొదలుపెట్టారు.
అమర్ కోరిన షర్ట్..
డియోర్ బ్రాండ్‌కు చెందిన స్వెటర్‌ను ధరించి బిగ్ బాస్ సండే ఎపిసోడ్‌కు వచ్చారు నాగార్జున. ఆ స్వెటర్ చూసి ఆశపడ్డాడు అమర్. తనకొక కోరిక ఉందని, ఆ స్వెటర్ కావాలని కోరాడు. దీంతో ఏం మాట్లాడాలో తెలియని నాగార్జున.. సైలెంట్‌గా కూర్చోమన్నారు. ఇక శివాజీ మధ్యలో జోక్యం చేసుకొని ఆశకు హద్దుండాలి, ఆ బ్రాండ్ చూశావా, ఆ స్వెటర్ వేసుకుంటే నీకు కాళ్ల వరకు వస్తుంది అని బెదిరించాడు. బ్రాండ్ గురించి మాట్లాడడంతో అసలు ఈ స్వెటర్ ధర ఎంత ఉంటుంది అని నెటిజన్లు కనుక్కున్నారు. సింపుల్‌గా కనిపించిన ఈ యెల్లో డియోర్ స్వెటర్ ధర రూ. 2,11,489 అని బయటపడింది. దీంతో శివాజీ.. అమర్‌ను తిట్టడంలో తప్పే లేదు అనుకుంటున్నారు ప్రేక్షకులు.
ఆ ఒక్క షర్ట్ మాత్రమే..
ఇప్పటికే బిగ్ బాస్ షోలో రూ.2 లక్షలు విలువజేసే షర్ట్స్‌ను నాగార్జున ఎన్నో ధరించారు. అందులో ఇప్పుడు ఈ యెల్లో డియోర్ స్వెటర్ కూడా యాడ్ అయ్యింది. దాదాపుగా అన్ని కాస్ట్‌లీ షర్ట్స్ వేసుకున్న నాగ్.. రెండు వారాల క్రితం ఒక ప్యాచ్ షర్ట్ వేసుకొని కనిపించారు. ఇప్పటివరకు బిగ్ బాస్‌లో నాగార్జున వేసుకున్న అన్ని షర్ట్స్‌లో ఆ ప్యాచ్ షర్ట్ మాత్రమే అతి తక్కువ ధర అని తెలుస్తోంది. ఆ షర్ట్ విలువ కేవలం రూ.8 వేలు మాత్రమే. నాగార్జున షర్ట్స్ చూస్తుంటే ప్రతీ వారం ఆయన ఎలాంటి బట్టలు వేసుకుంటారా అనే ఆసక్తి ఫ్యాషన్‌పై ఆసక్తి ఉన్నవారిలో పెరిగిపోతోంది.
రెమ్యునరేషన్‌కు తగిన షర్ట్స్..
నాగార్జున వేసుకునేవి ఎక్కువశాతం కస్టమైజ్ డ్రెస్సులు కాబట్టి అవి ఆయనకే బాగుంటాయని, అవే బట్టలు బయట వేసుకుంటే వింతగా చూస్తారని ఇప్పటికే పలు మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆయన వేసుకున్న రూ.2 లక్షల షర్ట్ గురించి కూడా ప్రేక్షకుల్లో పెద్ద చర్చే నడిచింది. ఇక తన సినిమాలతో పాటు బిగ్ బాస్‌ను కూడా మ్యానేజ్ చేయడానికి నాగార్జున.. భారీ రెమ్యునరేషనే తీసుకుంటారని సమాచారం. సీజన్ 7 కోసం ఆయన ఎంత ఛార్జ్ చేశారనే వివరాలు బయటికి రాకపోయినా.. సీజన్ 6 కోసం మాత్రం ఎపిసోడ్‌కు రూ.15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకునేవారని తెలుస్తోంది. అంటే సీజన్ మొత్తానికి కలిసి రూ.15 కోట్లు నుంచి 20 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకునేవారు నాగ్.
Also Read: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ