అన్వేషించండి

Women Financial Independence : ఉద్యోగం చేసే మహిళలు ఆర్థికంగా స్ట్రాంగ్​గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి 

Women's Day 2025 : ఎంత జాబ్ చేసినా.. ఆర్థికంగా నిలదక్కుకోలేకపోతే మీరు జాబ్ చేసి వేస్ట్. ముఖ్యంగా మహిళలు జాబ్ చేస్తున్నప్పుడు తమ ఖర్చులపై కచ్చితంగా అవగాహన పెంచుకోవాలి.

Tips for Working Women to Manage Finances : ఉద్యోగం చేసే మహిళలు తమ ఆర్థిక భవిష్యత్తు గురించి కచ్చితంగా ఆలోచించాలి అంటున్నారు నిపుణులు. కానీ కొందరు ఉద్యోగం, కుటుంబాన్ని రెండూ కలిపి.. తమకు కావాల్సిన ఆర్థిక భరోసాని పక్కకి పెట్టేస్తారు. ఇతరుల డిమాండ్లను నెరవేర్చడంపై చూపించే కృషి తమపై పెట్టుకోరు. పరిస్థితులు తలకిందులుగా మారితే.. మీరంటూ ఆర్థికంగా స్ట్రాంగ్​గా ఉండాలని గుర్తించుకోవాలి. కాబట్టి ఇకనుంచైనా కొన్ని టిప్స్ ఫాలో అయితే మంచిది. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఆర్థికంగా బాగుంటారో ఇప్పుడు చూసేద్దాం. 

ఆర్థిక స్వేచ్ఛతో పాటు ఆర్థిక భద్రత అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమే. లింగబేధం లేకుండా పురుషులతో పాటు.. మహిళలు కూడా ఆర్థిక జీవితాలను మెరుగుపరచుకునేందుకు కొన్ని ఫాలో అవ్వాలి. ముఖ్యంగా జాబ్ చేసే మహిళలు.. మొత్తం శాలరీని ఇంటికి ఖర్చులకు లేదా భర్త లేదా తల్లిదండ్రులకు ఇవ్వడం కాకుండా.. ఇంటిని మీరు ఎలా మెయింటైన్ చేయగలరో తెలుసుకుంటే ఆర్థికంగా ఏది ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుస్తుంది. దానికోసం ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.

ఆర్థిక ప్రణాళిక.. 

ఆర్థికంగా స్ట్రాంగ్​గా ఉండాలంటే ముదు చేయాల్సింది ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకోవడంలో ఇది హెల్ప్ చేస్తుంది. మీరు సంపాదించే డబ్బు ఏది ఎక్కడ ఖర్చు చేస్తున్నారో.. ఎమర్జెన్సీ ఫండ్​ కోసం డబ్బు ఎంత పక్కన పెట్టగలరనేది దీని ద్వారా తెలుస్తుంది. 

ఎమర్జెన్సీ ఫండ్ 

లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో తెలీదు. కాబట్టి కచ్చితంగా మీ శాలరీ నుంచి ఎమర్జెన్సీ ఫండ్​ సేవింగ్స్​ని మొదలుపెట్టండి. నెలవారీ ఖర్చులతో పాటు.. ఎమర్జెన్సీ ఫండ్​ కింద కొంత మొత్తాన్ని పక్కనపెట్టండి. దీనివల్ల మీకు ఆర్థిక భద్రత లభిస్తుంది. అత్యవసరమైన సమయాల్లో మూడు నుంచి ఆరు నెలల ఎమర్జెన్సీ ఫండ్ మీకు నెలవారీ ఖర్చులను తీర్చేలా ప్లాన్ చేసుకోండి. దీనివల్ల క్రెడిట్​ కార్డులు వాడాల్సిన, అప్పులు చేయాల్సిన అవసరం రాదు. 

స్థిర ఆస్తుల 

స్థిర ఆస్తులపై చాలామంది ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తారు. ఇది మంచిదే అయినప్పటికీ.. అవి మీ డబ్బును పూర్తిగా పోయేలా చేయవచ్చు. లేదా స్థిరమైన ధరను మాత్రమే మీకు ఇవ్వొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా స్థిరమైన ఆస్తులు తీసుకోవాలనుకున్నప్పుడు.. ఆర్థిక లక్ష్యాలను అంచనా వేసుకోవాలి. మీ పొదుపులన్నింటినీ ఓ ఆస్తిలో పెడుతుంటే.. ఇది మీ మొత్తం ఆర్థిక భవిష్యత్తును ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. 

ఇతర ఆదాయం.. 

ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పుడూ ఒకటే ఇన్​కమ్​పై ఆధారపడకూడదు. దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవాలంటే ఇది చాలా కీలకం. మ్యూచువల్​ ఫండ్ల నుంచి అద్దెలు, ఇతర ఆస్తుల నుంచి మీకు డబ్బులు వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా జాబ్ చేస్తూ.. పార్ట్ టైమ్​కోసం ఇతర సోషల్ మీడియా ప్లాట్​ఫారమ్​లా ద్వారా ఇన్​కమ్​ని జెనరేట్ చేసుకోవచ్చు. ఇవి మొదట్లో కష్టంగా ఉన్నా.. తర్వాత ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తాయి. 

భవిష్యత్తు కోసం.. 

పెట్టుబడులు అనేది కాలక్రమేణా మీ సంపదను పెంచుకోవడంలో హెల్ప్ చేస్తాయి. మహిళా ఉద్యోగులు ముందుగానే పెట్టుబడులు ప్రారంభిస్తే మంచిది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటివాటిలో డబ్బులు పెడితే.. దీర్ఘకాలిక రాబడిని పొందవచ్చు. రిస్క్​లు ఏముంటాయో ముందు తెలుసుకుని.. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే పెట్టుబడిని పెట్టవచ్చు. 

ఇవన్నీ ఫాలో అయితే మీరు మీ ఆర్థిక భవిష్యత్తును బాగా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ ప్లాన్​ని ఎక్కడ ప్రారంభించాలో తెలియకపోతే.. మీకు వచ్చే శాలరీని, మీ లైఫ్​స్టైల్​, మీరు కట్టే అప్పుల వివరాలు చెప్తే.. ఆర్థిక నిపుణులు మీకు మంచి సలహాలు ఇస్తారు. ఇది మీ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్​లో గేమ్ ఛేంజర్ అవుతుంది. ఆర్థిక సలహాదారు మీ లక్ష్యాలు తెలుసుకుని.. రిస్క్ తక్కువగా ఉండే ప్రణాళికను రూపొందించి మీకు హెల్ప్ చేస్తారు. ఈ ఉమెన్స్ డేకి అయినా మీరు ఈ టిప్స్​ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. 

Also Read : మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలు.. భద్రతా, టీకాలు అందించడంతోపాటు కోట్లల్లో రుణాలు, ఉమెన్స్ డే 2025 స్పెషల్

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget