అన్వేషించండి

Consumer Forum Fine: ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు.. హోటల్‌కు రూ.27 లక్షలు ఫైన్

Kakinada News | హైదరాబాద్ లో ఓ హాటల్ సిబ్బంది వాటర్ బాటిల్స్ ను నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు విక్రయించారు. దీనిపై బాధితుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా.. నోటీసులకు స్పందించకపోవడంతో జరిమానా విధించారు.

Hyderabad News | కాకినాడ: ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరిస్తుంటారు అధికారులు. ఈ క్రమంలో అధిక ధరలకు వాటర్ బాటిల్స్ విక్రయించిన హోటల్ యాజమాన్యానికి ఏకంగా రూ.27 లక్షల జరిమానా విధించారు. నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు ఉత్పత్తులు విక్రయించడం నేరమేనని, వినియోగదారులు తమ హక్కులు తెలుసుకుని న్యాయం కోసం ప్రశ్నించాలని అధికారులు సూచించారు.

అసలేం జరిగిందంటే..
కుసుమ కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్ ట్యూలిప్స్ గ్రాండ్ హోటల్ లో ఇటీవల 3 వాటర్ బాటిల్స్ కొన్నారు. వాస్తవానికి ఒక్కో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 కాగా, మూడు వాటర్ బాటిల్స్ ధర రూ.60 అవుతుంది. కానీ హోటల్ సిబ్బంది కస్టమర్ నుంచి అధికంగా వసూలు చేశారు. ఎమ్మార్పీ కంటే 27 రూపాయలు అదనంగా వసూలు చేశారు. 
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు వాటర్ బాటిల్స్ విక్రయించడంపై కస్టమర కుసుమ కళ్యాణ్ కాకినాడలో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. హోటల్ హైదరాబాదులో ఉన్న వినియోగదారుడు తన ప్రాంతం కాకినాడ కనుక, ఎక్కడైనా కేసులు వేయవచ్చు అని కాకినాడ వినియోగదారుల ఫోరం కమిషన్ సభ్యురాలు సుశి తెలిపారు. ఒక్కో వాటర్ బాటిల్ నిర్ణీత రుసుము రూ.20 కాగా, కస్టమర్ నుంచి 29 రూపాయలు .. మొత్తం మూడు బాటిల్స్ కు రూ.87 తీసుకున్నారు హాటల్ సిబ్బంది. రూ.27 అదనగా తీసుకున్నారని.. ఇది అన్యాయమని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.  

బాధితుడి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని హాటల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదని అధికారిణి సుశి తెలిపారు. దాంతో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న హాటల్ మేనేజ్ మెంట్‌కు రూ.27 లక్షల 27 వేల రూపాయలు జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. 25 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, వినియోగదారుడికి 25000, హోటల్ యజమాన్యం కోర్టుకి 2000 చెల్లించాలని కాకినాడ వినియోగదారుల ఫోరం కమిషన్ అధ్యక్షులు రఘుపతి, మెంబర్ సుశి ఆదేశించారు. 

ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు

‘హైదరాబాద్‌లో జరిగినా వినియోగదారుడు కాకినాడకు చెందిన వ్యక్తి కనుక ఇక్కడ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో అయినా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రశ్నించేతత్వం లేకపోతే నష్టం జరుగుతుంది. ఇలాంటి జడ్జిమెంట్ ద్వారా ఎమ్మార్పీ ధరలకు విక్రయాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఏది విక్రయించినా నేరమే అవుతుంది. అందుకే మేం నోటీసులు జారీ చేశాం. మీడియా ద్వారా విషయం చెబితే అందరికీ తమకు జరుగుతున్న అన్యాయం గురించి అవగాహనా వస్తుంది. వేగంగా మూడు నెలల్లో వినియోగదారుల సమస్య పరిష్కరించాలని కన్జూమర్ ఫోరమ్ యాక్ట్ లో ఉంటుంది. మేం జడ్జిలం కాదు. కానీ మాకు ఉన్న అధికారంతో వినియోగదారుల సమస్యను పరిష్కరిస్తాం.’ అని ఫోరమ్ అధికారిణి సుశి తెలిపారు.

Also Read: LRS In Telangana: ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తున్నారా, వారికి మాత్రమే 25 శాతం రాయితీ- ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి 

కుసుమ కళ్యాణ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హైదరాబాద్ లో హాటల్ ట్యులిప్ గ్రాండ్ లో ఫ్రెండ్స్ తో కలిసి భోజనం చేశాడు. అధిక ధరలకు విక్రయంచడాన్ని ప్రశ్నిస్తే యాజమాన్యం పట్టించుకోలేదని కాకినాడ వినియోగదారుల ఫోరం కమిషన్ అధ్యక్షులు రఘుపతి తెలిపారు. గతంలో పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయని, ఒక్క రూపాయి కంటే అధికంగా వసూలు చేసినా.. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget