అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 : గంగవ్వను పంపించిన బిగ్ బాస్, హరితేజను సాగనంపిన ఆడియెన్స్! టేస్టీ తేజకు ఇది అన్యాయమే

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పదోవారం టాస్కులు, గొడవలు ఇవన్నీ పక్కన పెడితే.. వీకెండ్ లో ఆరోగ్య కారణాలతో గంగవ్వ ను ఇంటి నుంచి బయటకు పంపాడు బిగ్ బాస్.

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ ఇంట్లో పదోవారం టాస్కులు, గొడవలు ఇవన్నీ పక్కన పెడితే.. వీకెండ్ పెద్ద షాక్ తగిలింది. గంగవ్వకు హెల్త్ సహకరించకపోవడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపాడు బిగ్ బాస్. ఇక ఆడియెన్స్ ఈ వారం హరితేజను బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది. ఆదివారం నాడు ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అప్పుడు ఈ ఎలిమినేషన్ మీద ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక ఈ శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజకు పెద్ద షాక్ తగిలింది. అది కాస్త అన్యాయమే అనిపిస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. 

సీతాఫలం తిన్నాడని గౌతమ్‌తో ప్రేరణ వాగ్వాదానికి దిగింది. అలా ఎలా నవ్వుతున్నావ్.. సిగ్గు లేకుండా అని దారుణంగా మాట్లాడేసింది. ఆ తరువాత మళ్లీ విష్ణు ప్రియ వచ్చి ప్రేరణతో వాగ్వాదానికి దిగింది. నా బెస్ట్ ఇస్తున్నా అనిపిస్తోంది.. నేనేమీ ఊరికే కూర్చుని ఆర్డర్ వేయడం లేదు.. తనలో తాను అనుకున్న ప్రేరణ కాస్త బాధపడినట్టుగా ఉంది..  చీఫ్ అయిన తరువాత ఎక్స్ ట్రాలు చేస్తోందని అనుకుంటున్నారా? అని తనలో తాను అనుకుంది. ఆ తరువాత కారెట్ హల్వాను నబిల్ తిన్నాడు. అది స్వీట్ కాదని, తాను తినొచ్చు అంటూ కొత్త లాజిక్ పట్టుకున్నాడు.

ఆ తరువాత కంట్రీ డిలైట్ టాస్కులో అవినాష్, రోహిణి, తేజ, నబిల్ బాగా చేశారు. కానీ సంచాలక్ యష్మీ మాత్రం నిఖిల్ టీం విన్ అని చెప్పింది. దీంతో తేజ, రోహిణి హర్ట్ అయ్యారు. అలా ఎలా చేస్తారు అని అడిగింది. దీనికే ఇలా ఎందుకు చేస్తున్నారు.. ఫన్ టాస్క్.. ఫన్‌గా తీసుకోండి అని హరితేజ సుద్దులు చెప్పింది. దీన్నే నామినేషన్‌లో చెబుతాం అని తేజ అంటే.. దీన్ని కూడానా? అని హరితేజ కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. అలా చేస్తే మీ న్యారో థింకింగ్‌కి నేను నామినేట్ చేస్తా అని కాస్త అతి చేసింది.

ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో తేజ రూల్స్ అతిక్రమించినందుకు పనిష్మెంట్ ఇచ్చాడు నాగ్. వచ్చే వారం కంటెండర్ రేసు నుంచి తప్పించేశాడు. చివరకు మిగిలిన రోహిణి, నిఖిల్, నబిల్‌కు ఓటింగ్ పెట్టాడు నాగ్. కానీ ముగ్గురికీ మూడు ఓట్ల చొప్పున వచ్చాయి. దీంతో మెగా చీఫ్ నిర్ణయంతో నబిల్‌కు ఎవిక్షన్ షీల్డ్ దక్కింది. ఈ క్షణం నుంచి ఎప్పుడైనా వాడుకో అని కాస్త తెలివిగా వాడుకో అని అన్నాడు. ఆ తరువాత ఒక్కో కంటెస్టెంట్‌ను కన్‌ఫెషన్ రూంలోకి పిలిచి వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పమని అడిగాడు నాగ్.

Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!

విష్ణు ప్రియ వరెస్ట్ ప్లేయర్ అని, ఒకరిద్దరితోనే ఉంటుందని నబిల్ అన్నాడు. రోహిణి వరెస్ట్ అని.. ఓ గ్రూపుతోనే ఉంటోందని, ఆటలు సరిగ్గా ఆడటం లేదని హరితేజ చెప్పింది. పృథ్వీ వరెస్ట్ అని వేరే వాళ్ల నిర్ణయానికి గౌరవం ఇవ్వడు.. యష్మీ, విష్ణులను మ్యానిపులేట్ చేస్తుంటాడు.. ఫిజికల్ అవుతుంటాడు.. అని గౌతమ్ చెప్పాడు. టేస్టీ తేజ వరెస్ట్ అని నిఖిల్, టాస్కుల్లో తక్కువ.. అని రోహిణిని వరెస్ట్‌గా చెప్పింది యష్మీ. ఎవిక్షన్ షీల్డ్ టాస్కుల్లో సరైన కారణాలు చెప్పలేదు.. ఆటలు కూడా సరిగ్గా ఆడలేదు అందుకే హరితేజ వరెస్ట్ అని అవినాష్ అన్నాడు.

టేస్టీ తేజ ఇంకా బాగా ఆడొచ్చని, స్ట్రాటజీతో వచ్చాడనిపిస్తుందని, సహజమైన ఆటలా కనిపించడం లేదని విష్ణు చెప్పింది. యష్మీ మాటల్లో ఎక్కువ.. ఆటల్లో తక్కువ అని రోహిణి చెప్పింది. విష్ణు జెన్యూన్ కాదనిపిస్తుంది.. ర్యాష్‌, రూడ్.. బిహేవియర్ నచ్చదు.. ఆటలు ఆడదు.. అసలు గెలవాలని కూడా ఉండదు.. ఆమే వరెస్ట్ అని ప్రేరణ చెబుతుంది. పృథ్వీకి తన మీద తనకు కంట్రోల్ ఉండదని టేస్టీ తేజ చెబుతాడు. తేజ బిహేవియర్ నాకు నచ్చదు, టాస్కులు ఆడడు అని పృథ్వీ అంటాడు. యష్మీ వరెస్ట్ అని గంగవ్వ అంటుంది. 

అలా మెజార్టీ ఓట్లతో టేస్టీ తేజ వరెస్ట్ ప్లేయర్ అని నాగ్ చెబుతాడు. ఫ్యామిలీ వీక్ ఎప్పుడు జరిగినా కూడా ఈ వరెస్ట్ ప్లేయర్ అనే ట్యాగ్ వచ్చిన వాళ్ల ఫ్యామిలీ మెంబర్లు ఇంట్లోకి రాలేరని చెబుతాడు నాగ్. దీంతో తేజ కంట తడి పెట్టేస్తాడు. తాను ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కోసం ఇక్కడకు వచ్చానని అంటాడు. ఇక గంగవ్వ హెల్త్ బాగా లేదని చెప్పడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేసే నిర్ణయం బిగ్ బాస్ తీసుకున్నాడు అంటూ నాగ్ చెబుతాడు. ఇంటి సభ్యులందరి దగ్గర వీడ్కోలు తీసుకుని గంగవ్వ బయటకు వచ్చేసింది. గంగవ్వ వెళ్తుంటే.. రోహిణి, టేస్టీ తేజలు కన్నీరు పెట్టుకున్నారు.

Also Read: హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget