Vizag old Light house Tower | ఎన్నో సినిమాల్లో లొకేషన్..వైజాగ్ పాత లైట్ హౌస్ ఇక కనిపించదు | ABP
విశాఖపట్నం లైట్ హౌస్ ని కూల్చివేస్తారు అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ఇది నిజమే అనిపిస్తుంది ప్రస్తుతానికి అక్కడున్న విశాఖ ప్రజలకు.1950. సంవత్సరంలో నిర్మాణం చేపట్టిన ఈ లైట్ హౌస్ ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకుంది ప్రస్తుతానికి ఈ లైట్ హౌస్ అయితే మాత్రం పనిచేయటం లేదు ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్లకు ప్రాధాన్యతగా ఉండేది. ఇప్పుడు ఈ లైట్ ఓ చుట్టూ గ్రిల్ వేసి అటువైపు ఎవరిని కూడా వెళ్లే పరిస్థితి లేకుండా ఉంది అయితే ఇది ఏ క్షణానైనా కూలిపోయే అవకాశం ఉండడంతో కూల్చివేస్తారు అంటూ ప్రచారం కొనసాగుతుంది విశాఖపట్నం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. శిథిలావస్థకు చేరుకున్న విశాఖపట్నం పాత లైట్ హౌస్ ను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 1950లో నిర్మించిన ఈ లైట్ హౌస్ 75ఏళ్లుగా పర్యాటకులను, స్థానికులను ఆకర్షించటంతో పాటు సముద్రంలో మత్స్యకారులకు దిక్సూచిలా సేవలందించింది. ఎన్నో సినిమాల్లో లొకేషన్ పాయింట్ గా కనిపించిన లైట్ హౌస్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుని చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధమౌతోంది.





















