అన్వేషించండి

Sanju VS Dhoni: సూర్య‌వంశీపై ప్ర‌శంస‌లు కురిపించిన శాంస‌న్.. ధోనీతో అనుబంధ ప్ర‌త్యేకమని వ్యాఖ్య

జోస్ బట్లర్ త‌నకు అత్యంత సన్నిహితుడైన ఆటగాడని, ఏడు సంవత్సరాలు అత‌నితో కలిసి ఆడాన‌ని సంజూ గుర్తు చేసుకున్నాడు.. తాను కెప్టెన్ అయినప్పుడు, అతను  వైస్-కెప్టెన్‌గా  అద్భుతమైన మద్దతు ఇచ్చాడని తెలిపాడు.

IPL 2025 News: ఐపీఎల్ టీమ్ రాజ‌స్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తాజాగా త‌న మ‌న‌సులోని మాట పంచుకున్నాడు. ఐపీఎల్ స్ట్రీమింగ్ పార్ట్న‌ర్  JioHotstarలోని SuperStar సిరీస్‌లో ప్రత్యేకంగా మాట్లాడిన సంజు , 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. యువ ఆటగాళ్లకు సలహా ఇవ్వడంపై తన విధానాన్ని వివరిస్తూ,
 "ఇప్పటి యువ ఆటగాళ్లకు ధైర్యం, స్వీయవిశ్వాసం మెండుగా ఉన్నాయి. వాళ్లు స్థానిక‌ క్రికెట్ పరిస్థితులు, ప్రస్తుత ట్రెండ్స్‌ను బాగా అర్థం చేసుకుంటున్నారు. నిజానికి, వారికి సలహా ఇవ్వడం కంటే, ముందు వాళ్ల ఆటతీరు, ఆలోచనా విధానం, వాళ్లకు అవసరమైన మద్దతు ఏంటో గమనించడమే నాకు ఇష్టం. దాని ప్రకారమే నేను సహాయం చేస్తాను. వైభవ్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. అకాడమీలో అతను చాలా పెద్ద‌ సిక్సర్లు కొడుతున్నాడు. అతని పవర్-హిట్టింగ్ గురించి చాలా మంది ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఇంత‌కంటే ఏం కావాలి? అతని బలాలను అర్థం చేసుకోవడం, సహాయంగా ఉండడం, పెద్దన్నలా తోడుగా నిలవడం ముఖ్యం " అని వ్యాఖ్యానించాడు. 

ఐపీఎల్ కు సిద్ధం..
సూర్య‌వంశీ ఇప్పటికి ఐపీఎల్‌కు సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తున్నాడని, ముఖ్యంగా, అతనికి సరైన ఫిట్‌నెస్, మానసిక స్థైర్యం, అనుకూలమైన వాతావరణం కల్పించడం చాలా అవసరమ‌ని సంజూ పేర్కొన్నాడు. త‌మ టీమ్ ఎల్లప్పుడూ ఒక సానుకూలమైన డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని కల్పించే జట్టని, తాము  ఆటగాళ్లను పూర్తిగా విశ్వసిస్తామ‌ని తెలిపాడు. అతని ఆటతీరు చూస్తే, అతను ఐపీఎల్‌కు రెడీ అని స్పష్టంగా తెలుస్తోందని, అతను మైదానంలో కొన్ని శక్తివంతమైన ఇన్నింగ్స్ ఆడతాడనడం అతిశయోక్తి లేద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు.  ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మైయర్ వంటి కీలక ఆటగాళ్లతో జట్టులో స‌మ‌తూకం ఏర్ప‌డింద‌ని తెలిపాడు. 

బ‌ట్ల‌ర్ తో సాన్నిహిత్యం..
జోస్ బట్లర్ త‌నకు అత్యంత సన్నిహితుడైన ఆటగాడని, ఏడు సంవత్సరాలు అత‌నితో కలిసి ఆడాన‌ని సంజూ గుర్తు చేసుకున్నాడు.. తాను కెప్టెన్ అయినప్పుడు, అతను  వైస్-కెప్టెన్‌గా  అద్భుతమైన మద్దతు ఇచ్చాడని, రిటెన్ష‌న్ పాల‌సీ వ‌ల్ల అత‌డు జ‌ట్టు నుంచి దూరం కావ‌డం బాధ‌క‌ర‌మ‌ని పేర్కొన్నాడు. త‌నను క‌లిసిన‌ప్పుడు ఈ విష‌యంపై చ‌ర్చించాన‌ని, త‌న‌ను జ‌ట్టు నుంచి కోల్పోవ‌డం జీర్ణించుకోలేక పోయాన‌ని తెలిపాడు. రిటెన్ష‌న్, రిలీజ్ విష‌యాల‌ను త‌న ప‌రిధిలో ఉంటే మార్చేందుకు ప్ర‌యత్నించేవాడిన‌ని పేర్కొన్నాడు. కానీ అది త‌న చేతుల్లో లేద‌ని నిర్వేదం ప్ర‌క‌టించాడు. 
ఇక భార‌త మాజీకెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడుతూ.. ప్రతి యువ భారత క్రికెటర్‌లా, తానూ ధోనీని ఎప్పటి నుంచో అభిమానించేవాణ్న‌ని,  CSKతో ప్రతి మ్యాచ్ ఆడినప్పుడు, అతని దగ్గర కూర్చొని మాట్లాడాలని, అతను ఎలా పనులను మేనేజ్ చేస్తాడో తెలుసుకోవాలని అనుకునేవాణ్ని చెప్పాడు. ఒకసారి షార్జాలో CSKతో జరిగిన మ్యాచ్‌లో మాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాన‌ని, అప్పటి నుంచి త‌మ మ‌ధ్య‌ అనుబంధం బలపడిందని చెప్పాడు. ఈనెల 22 నుంచి ప్రారంభ‌మ‌య్యే ఐపీఎల్లో తొలి మ్యాచ్ లో భాగంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ను రాజ‌స్థాన్ ఢీకొనుంది. ఈ మ్యాచ్ ఈనెల 23న హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget