Macherla politics : మాచర్ల పోలింగ్ దాడులు లెక్కలేనన్ని - వరుసగా రిలీజ్ చేస్తున్న టీడీపీ, వైసీపీ !
Andhra News : మాచర్లలో పలు చోట్ల జరిగిన ఘర్షణల వీడియోలను టీడీపీ, వైసీపీ రిలీజ్ చేస్తున్నాయి. వీడియోల్లో ఏ పార్టీ వారు దాడులు చేస్తున్నారో తెలియడం లేదు కానీ.. పరస్పర ఆరోపణలు మాత్రం చేసుకుంటున్నారు.
Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అక్కడ పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలు.. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు అల్లర్లు చెలరేగడం.. అదే సమయంలో ఆలస్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి రావడంతో మాచర్ల పరిస్థితి హైవోల్టేజ్ కు చేరుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రెండు పార్టీల నేతలు వీడియోలు విడుదల చేస్తున్నారు. మీరు రిగ్గింగ్ చేశారంటే.. మీరు రిగ్గింగ్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు.
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ చేసి మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ రిగ్గింగ్ చేసిందని దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024
తమృకోట గ్రామంలోనూ రిగ్గింగ్ జరిగిందని కొన్ని ఘర్షణల వీడియోలను వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Telugu Desam Party leaders Pulipati Nageswara Rao and Telugu Desam Party booth agent Boina Narasimha Rao are destroying EVMs in Tummuru Kota village of Macharla constituency.#TDPGoons#TDPRigging#AndhraPradesh pic.twitter.com/kQv8fOtzNL
— ᴍᴀʟʟɪ ɴᴜᴠᴠᴇ ᴋᴀᴠᴀʟɪ ᴊᴀɢᴀɴᴀɴɴᴀ (@Malli_Nuvve) May 23, 2024
అదే ఘటనను కొంత మంది టీడీపీ సానూభూతి పరులు వైసీపీ నేతలు చేశారని ఆరోపిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం తుమ్మూరు కోట గ్రామంలో EVMలను ధ్వంసం చేస్తున్న వైసీపీ నాయకులు.
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@Shiva4TDP) May 23, 2024
పోలింగ్ బూత్ నెంబర్ 204లో ఈ సంఘటన జరిగింది.
pic.twitter.com/kD5rxTujhW
మాచర్ల పాల్వాయి గేటు ఘటనలో, ఈవీయం పగులుగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిని, అడ్డుకున్నారని, పిన్నెల్లి, అతని అనుచరులు, టిడిపి ఏజెంట్ గా ఉన్న నంబూరి శేషగిరిరావు పై దాడి చేసిన విజువల్స్ ఇవి.
— Telugu Desam Party (@JaiTDP) May 23, 2024
పిన్నెల్లి సైకో గ్యాంగ్ దాడి చేసే సమయంలో, గ్రామస్తులు తిరగబడడంతో అక్కడి నుంచి పారిపోయిన… pic.twitter.com/P8RaP9hTNa
ఇలా మాచర్ల నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన ఘర్షణల వీడియోలను పోటాపోటీగా రెండు పార్టీలు రిలీజ్ చేసుకుంటున్నాయి. అయితే ఈ ఘటనలన్నింటిపై పోలీసులు ఇప్పటికే కేసులు పెట్టారని.. రిగ్గింగ్ లాంటివేమీ జరిగినట్లుగా రిపోర్టులు రాలేదని ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
మాచర్లలో వైసీపీ నేతలు రిగ్గింగ్
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@Shiva4TDP) May 22, 2024
మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది వైసీపీ నేతలే
ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలు
pic.twitter.com/cRZ4ya8zVX