అన్వేషించండి

TS Polycet: రేపే తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష, నిమిషం ఆల‌స్యమైనా 'నో' ఎంట్రీ!

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ డిప్లొమా కళాశాలల్లో ప్రవేశాలకు మే 17న‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.

తెలంగాణలోని పాలిటెక్నిక్‌ డిప్లొమా కళాశాలల్లో ప్రవేశాలకు మే 17న‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. మే 17న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 

ఈ ఏడాది పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,05,656 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 47,188 మంది అమ్మాయిలు; 58,468 మంది అబ్బాయిలు ఉన్నారు. విద్యార్థులు ఓఎంఆర్‌లోని రెండు వైపుల వివరాలను పూర్తిచేసి సంతకం చేయాలి. హాల్‌టికెట్‌పై ఫొటో ప్రింట్‌ కాకుంటే ఒక పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, గుర్తింపు కార్డు(ఆధార్‌) తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

ఈ ప్రవేశ ప‌రీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. ఇంజినీరింగ్‌ డిప్లొమా చేయాలనుకునే వారికి గణితం 60, భౌతిక, రసాయనశాస్త్రాలకు 30 మార్కుల చొప్పున... అంటే 120 మార్కుల పరీక్షరాయాలి. దానికి 83,210 మంది దరఖాస్తు చేశారు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ డిప్లొమా చేయాలనుకునే వారు పైవాటికి అదనంగా జీవశాస్త్రంలో మరో 30మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనికి 22,446 మంది దరఖాస్తు చేశారు.

నిమిషం ఆల‌స్యమైనా అనుమ‌తించ‌రు..
పాలిసెట్ ప్రవేశపరీక్షకు హాజ‌ర‌య్యే విద్యార్థులు ఒక గంట ముందుగానే ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని అధికారులు సూచించారు. నిమిషం ఆల‌స్యమైనా ప‌రీక్షా కేంద్రంలోకి అనుమ‌తించే ప్రస‌క్తే లేద‌ని స్పష్టం చేశారు. విద్యార్థులు త‌మ వెంట హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకోని రావాల‌ని సూచించారు. హాల్‌టికెట్ మీద ఫోటో ప్రింట్ కాని వారు ఒక పాస్‌పోర్టు సైజు ఫోటోను వెంట తెచ్చుకోవాల‌ని సూచించారు. ప‌రీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్, ఇత‌ర ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని స్పష్టం చేశారు.

పరీక్ష విధానం..
➥ మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో 150 ప్రశ్నలుంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో లేదు.

➥ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వీటి అనుబంధ సంస్థల్లో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

వేర్వేరు ర్యాంకులు..
➥ పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు. 

పాలిటెక్నిక్‌ (టెక్నికల్‌): 
ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారి మార్కులు విధానం 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30,కెమిస్ట్రీ–30 గా ఉంటాయి.

అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ: 
అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మార్కుల విధానం కూడా 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్‌–(60/2=30)–30, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీలో 30 మార్కులుగా ఉంటాయి.

అర్హత మార్కులు..
➥ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు,

➥ వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు త‌ప్పనిసరిగా స్కోర్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16.01.2023.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 24.04.2023.

➥ రూ.100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 25.04.2023.

➥ పాలిసెట్ పరీక్ష తేది: 17.05.2023.

➥ ఫలితాల వెల్లడి: పరీక్ష తర్వాత 10 రోజుల్లో ఫలితాల వెల్లడి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Embed widget