Stocks Watch Today, 21 April 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఇవాళ బిగ్ బాస్ Reliance రిజల్ట్స్
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.

Stock Market Today, 21 April 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 22 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్ కలర్‌లో 17,687 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ జింక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, తేజస్ నెట్‌వర్క్స్. వీటిపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్
మార్కెట్ విలువ ప్రాతిపదికన దేశంలోనే అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇవాళ నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ స్టాక్ ఇండెక్స్ హెవీ వెయిట్ కాబట్టి షేర్లు మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి. మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ టాప్‌లైన్ & బాటమ్‌లైన్ వృద్ధి నామమాత్రంగా ఉండే అవకాశం ఉంది.
HCL టెక్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో HCL టెక్ రూ. 3,983 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 3,593 కోట్లతో పోలిస్తే ఇది 11% పెరుగుదల. డీల్స్ పైప్‌లైన్ బలంగా ఉంది, దీర్ఘకాలిక వృద్ధిని ప్రతిబింబిస్తోంది.
ICICI ప్రుడెన్షియల్ లైఫ్: 2023 జనవరి-మార్చి కాలానికి ICICI ప్రు లైఫ్ ఏకీకృత నికర లాభం 26% పెరిగి రూ. 235 కోట్లకు చేరుకుంది. ఇది గతేడాది ఇదే కాలంలో రూ. 186 కోట్ల లాభాన్ని ప్రకటించింది.
సైయెంట్: మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం రూ. 163 కోట్లు, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 154 కోట్లతో పోలిస్తే 6% అధికం.
నెస్లే ఇండియా: ఈ కంపెనీ ప్రకటించిన రూ. 27 డివిడెండ్‌కు సంబంధించి, నెస్లే ఇండియా షేర్లు ఇవాళ ఎక్స్-డివిడెండ్‌తో ట్రేడ్ అవుతాయి. ప్రకటించిన డివిడెండ్ మేర షేర్ ధర తగ్గుతుంది.
లక్ష్మి ఆర్గానిక్: ఈక్విటీ సేల్ లేదా రుణాలు లేదా ఈ రెండు మార్గాలను కలిపి రూ. 2,000 కోట్ల వరకు నిధులను సేకరించే ప్రతిపాదనను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.
ఫినోలెక్స్ కేబుల్స్: ఆప్టికల్ ఫైబర్ ప్రిఫార్మ్‌లను (Optical Fibre Preforms) ఉత్పత్తి చేయడానికి, ఫైబర్ కేబుల్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పుణెలోని ఉర్సే ఫెసిలిటీలో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది.
వొడాఫోన్ ఐడియా: కుమార మంగళం బిర్లాను అదనపు డైరెక్టర్‌గా ఈ కంపెనీ నియమించింది, ఈ నియామకం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది.
స్టెర్లింగ్ & విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ: మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 417 కోట్ల నికర నష్టాన్ని నివేదించగా, కార్యకలాపాల ద్వారా రూ. 88 కోట్ల ఆదాయం వచ్చింది.
ఓరియంటల్ హోటల్స్: FY23 నాలుగో త్రైమాసికంలో 69% వృద్ధితో రూ. 115.56 కోట్ల ఆదాయాన్ని ఓరియంటల్ హోటల్స్ ఆర్జించింది. నికర లాభం రూపంలో రూ. 17.79 కోట్లు మిగుల్చుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

