అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Duplicact Finger Prints: నెల్లూరులో కొత్త తరహా మోసం, వేలిముద్రలతో అరకోటి మాయం చేసిన కేటుగాళ్లు

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో వేసే వేలి ముద్రలను దొంగిచించి వాటి ద్వారా వేలిముద్రల కాపీలు తయారు చేసి బ్యాంకుల్లో డబ్బులు కొట్టేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో సరికొత్త మోసం వెలుగు చూసింది. అకౌంట్లలోనుంచి డబ్బులు మాయమైపోతోందంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. చివరకు పరిశోధించి విషయం తేల్చారు. వేలిముద్రల ద్వారా డబ్బులు మాయం అవుతున్నట్టు గుర్తించారు. మరి బాధితులు వేలిముద్రలు వేయకుండానే ఇదంతా ఎలా జరుగుతోంది, ఆ డబ్బు ఎక్కడికెళ్తోంది, అసలా నిందితుల ప్లాన్ ఏంటి..?

ఇదో సరికొత్త మోసం, మనకు తెలియకుండానే మన వేలిముద్రలు దొంగిలించి, మన ఆధార్ కార్డ్ ద్వారా మనకు సంబంధం లేకుండానే మన అకౌంట్లనుంచి డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఈ మోసం జరుగుతోంది. ప్రస్తుతం పల్లెటూల్లలో బ్యాంకింగ్ కియోస్క్ లు ఏర్పాటు చేసి, ఆధార్ నెంబర్ చెప్పి, వేలిముద్ర వేస్తే డబ్బులు విత్ డ్రా చేసి ఇస్తారు, కొంత కమీషన్ తీసుకుంటారు. అయితే దీన్ని అడ్డు పెట్టుకుని, అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా డబ్బులు కాజేస్తున్నారు కొంతమంది. ఇలాంటి ఓ ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో వేసే వేలి ముద్రలను దొంగిచించి వాటి ద్వారా వేలిముద్రల కాపీలు తయారు చేసి బ్యాంకుల్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఆధార్ నెంబర్లు కూడా రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనుంచే దొంగిలించారు. ఈ ముఠా ఇప్పటి వరకూ 51 లక్షల 25వేల రూపాయలు ఇలా దొంగిలించినట్టు గుర్తించారు. బాధితుల బ్యాంక్ అకౌంట్లనుంచి తమ వ్యాలెట్ లోకి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్న నిందితులు, వెంటనే దాన్ని విత్ డ్రా చేసుకుంటున్నారు. దీంతో రికవరీ కష్టసాధ్యంగా మారింది. 

ఎలా దొంగిలిస్తారంటే..?
కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ కి సంబంధించి డాక్యుమెంట్ రైటర్ గా పనిచేసే ఓ వ్యక్తి ఇందులో కీలక నిందితుడు. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ పనులకోసం వచ్చేవారు, సాక్షులుగా సంతకాలు చేసేవారు వేలిముద్రలు వేయడం, తమ ఆధార్ కాపీలు ఇవ్వడం పరిపాటి. దీని ద్వారా ఈ కేటుగాళ్లు వేలిముద్రలు, దానికి సంబంధించిన ఆధార్ కాపీలు స్కాన్ చేసేవారు. అలా స్కాన్ చేసిన వేలిముద్రలతో బ్యాంకింగ్ కియోస్క్ టెక్నాలజీతో డబ్బులు కాజేసేవారు. 

బాధితులకు తెలియదా..?
బాధితుల్లో ఎక్కువమంది నిరక్షరాశ్యులు, పల్లెటూరివారే ఉన్నారు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ లో బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్ లు చూడటం వారికి అలవాటు లేదు. అందుకే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు ట్రాన్స్ ఫర్ అయినా కూడా వారికి తెలియదు. దీంతో ఈ కేటుగాళ్ల పని సులభమైంది. తీరా ఓ బాధితుడి ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు తీగలాగి, డొంక కదిలించారు. ఇక్కడ నెల్లూరు జిల్లావారు బాధితులే అయినా, 10మంది నిందితులు జిల్లా బయటి వ్యక్తులు కావడం విశేషం. ఇతర జిల్లాల్లో వీరు పనులు చక్కబెట్టారు. ఆన్ లైన్ నుంచి కూడా కొంత డేటా సేకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాలెట్ లో ఉన్న సొమ్ముని బ్లాక్ చేశామని, మిగతా సొమ్ము నిందితులనుంచి రికవరీ చేస్తామని చెబుతున్నారు పోలీసులు. ఇలాంటి మోసాలను నివారించాలంటే ఆధార్ తో అనుసంధానంగా ఉన్న ఫింగర్ ప్రింట్ ని డిజేబుల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలా చేస్తే మన వేలిముద్ర ఎవరికీ కనపడదని, వేలిముద్రలతో మన ఆధార్ ని ఎవరూ ఉపయోగించలేరని చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget