Breaking News: ప్యాలెస్ నిధులు ప్రజల ఖర్చు పెట్టాల్సింది: పవన్
Latest Telugu breaking News: ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. దీంతో మరిన్ని ఏపీ, తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
LIVE

Background
పంచాయతీ శాఖ నిధులు ఊడ్చేశారు- జీతం తీసుకోకూడదనుకున్నాను: పవన్
పిఠాపురంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీతం తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి చూస్తే ఆందోళన కలిగిందన్నారు. తన ఛాంబర్‌లో మార్పులు అడిగితే వద్దని చెప్పానని వెల్లడించారు. ఫర్నీచర్ కూడా తానే తెచ్చుకుంటానని జీతం కూడా ఇస్తే వద్దని చెప్పినట్టు పేర్కొన్నారు.
T20 world Cup 2024: తుపానులో చిక్కుకున్న టీమిండియా- రోహిత్ సేన రాక మరింత ఆలస్యం
Team India: టీ20 ప్రపంచకప్ గెలుపు ఆనందంలో ఎప్పుడెప్పుడు భారత్ వెళ్దామని చూస్తున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్. విండీస్‌లో వచ్చిన తుపాను కారణంగా వారి రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తుపాను కారణంగా బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేశారు. రోహిత్ సేన అనుమతి వచ్చే వరకు విండీస్‌లోనే ఉండాల్సి ఉంటుంది.
Pawan Kalyan: రుషికొండ ప్యాలెస్ నిధులు ప్రజల ఖర్చు పెట్టాల్సింది: పవన్
Pawan Kalyan: కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ప్రజలకు మంచి చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు ఎటు వెళ్లాయో కూడా తెలియదని అన్నారు. కేవలం రుషి కొండ ప్యాలెస్ కోసమే ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. అవే నిధులు పల్లెల్లో వినియోగించుంటే మంచి జరిగేదన్నారు.
గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి
మరికాసేపట్లో రాజ్ భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. గవర్నర్‌తో భేటీ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కానున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై చర్చ జరగనుంది. వాటిని ఆర్డినెన్సు రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా తొలిసారి పిఠాపురం వస్తున్న పవన్ కల్యాణ్
2024ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి పిఠాపురం రానున్నారు. ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు పిఠాపురం ప్రజలు పార్టీ శ్రేణులు పవన్ అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ఈ ఉదయం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పిఠాపురం నియోజక వర్గానికి బయలుదేరారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

