Viral Video : క్యూరియాసిటీతో పెదవలకు పెవిక్విక్ రాసుకున్నాడు - ఆ తరవాతే అసలు కథ - జాలి కూడా చూపలేం ! వీడియో
Feviquick as lipstick: ఏ వస్తువును దానికే వాడాలి. వేరే దానికి వాడితే రియాక్షన్ వేరే ఉంటుంది. దానికి పెవిక్విక్ ను లిప్ స్టిక్ గా వాడిన ఈ కుర్రాడే సాక్ష్యం.

Man applied Feviquick on his lips: లిప్ స్టిక్ అనేది పెదాలకు మాత్రమే వేసుకోవాలి..ఇంకెక్కడా వేసుకోకూడదు అని తెలిసి వచ్చేలా మన్మధుడు సినిమాలో నాగార్జున ఎక్స్ పెరిమెంట్ చేస్తాడు. యాడ్ ఏజెన్సీ మేనేజర్ అయిన నాగార్జునకు.. లిప్ స్టిక్ కంపెనీ క్లయింట్ కు యాడ్ కాన్సెప్ట్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇతరులతో పోటీ ఉండటం వల్ల కొత్తగా ఆలోచించాలనుకుంటాడు. ఇంటికి వెళ్లి.. లిప్ స్టిక్ ను కళ్లకు ఎందుకు వేసుకోకూడదని ఆలోచిస్తాడు. అలాగే వేసుకుంటాడు.. లిప్ స్టిక్ పెదాలకే కాదు..కళ్లకూ వేసుకోవచ్చు.. .మీ ప్రపంచాన్ని ఎర్రగా మారుస్తుందని క్యాప్షన్ కూడా అనుకుంటాడు. కానీ వెంటనే కళ్లు మండిపోవడంతో హడావుడిగా కడుక్కుని..లిప్ స్టిక్ ను పెదాలకే రాసుకోవాలని ఇంకెక్కడా రాసుకోకూడదని తెలిసిందని సర్ది చెప్పుకుంటాడు.
ఆ సినిమాలో నాగార్జున లిప్ స్టిక్ ను తుడిచేసుకోవడంతోనే..కాసేపు మంటపుట్టినా తరవాత సర్దుకున్నాడు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం లిప్ స్టిక్ ను మాత్రమే పెదాలకు ఎందుకు రాసుకోవాలి.. ఫెవి క్విక్ ను ఎందుకు రాసుకోకూడదు అని ఆలోచించాడు. ఆలోచించడమే కాదు.. వెంటనే నాగార్జునా ఎక్స్ పెరిమెంట్ చేసేశాడు. పెదాలకు రాసుకుని లిప్ స్టిక్‌ను చప్పరించినట్లుగా ఎఫెక్ట్ ఇచ్చచేందుకు రెండు పెదాలు కలిపాడు. అంతే కథ ముగిసిపోయింది. రెండు పెదాలు అతుక్కుపోయాయి. తీద్దామంటే నొప్పి చర్మం వలిచి వచ్చేస్తుందని బాధ. లేకపోతే పూర్తిగా అతుక్కుపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ऐसा कौन सा चुन्ना काट रहा था इसको🤣 pic.twitter.com/pC90odHoNA
— Arun (@ArunPrayagi1) April 25, 2025
ఇప్పుడా వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే ఏడుపు ఆపుకోలేకపోతున్నాడు. పెదవులపై అతిగా ప్రవర్తిస్తే, అది ఎంత బాధను కలిగిస్తుందంటే కనీసం గట్టిగా ఏడవలేని దుస్థితి. ఈ వీడియోను @ArunPrayagi1 అనే ఖాతా నుండి షేర్ చేశారు. ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు, చాలా మంది ఈ వీడియోను లైక్ కూడా చేశారు. పలువురు నెటిజన్లు ఆ వ్యక్తిపై జోకులేస్తున్నారు.
Ye sab viral hone ke nuskhe hain ..
— BINDESHWARI PRASAD PANDEY (@Bpbpandey0) April 27, 2025
Wo logon ko bewkuf bna rha tha, hairani ki bat ki log bn gye...
Usne feviquick ni balki kuch aur lgaya hai dhyan se dekho, fir muh band hone ki acting kar rha hai jisme ek bar uske lips slip bhi huye hain dhyan se dekho...
🤔😅
इसे कहते हैं ना सुलेमानी कीडा, जब वह फड़फड़ाता है तो ऐसे कुछ काम करवाता है
— Shivani Singh (@simpalshivani) April 25, 2025
ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ.. ఇలాంటి ప్రయోగాలు చేస్తే... ఒంటికి చేటు అని కొంత మంది నెటిజన్లు సలహాలిస్తున్నారు.





















