
Breaking News Live Updates: మంత్రి మల్లారెడ్డి వాహనంపై రాళ్ల దాడి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
మంత్రి మల్లారెడ్డి వాహనంపై రాళ్ల దాడి
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్ల గర్జనలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతున్నప్పుడు కొందరు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వాహన శ్రేణిపై రాళ్లు , కుర్చీలు విసిరారు కొందరు.
ప్రత్తిపాడు మండలంలో పెద్దపులి సంచారం, పశువులపై దాడి
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. పోతులూరు వద్ద స్థానిక సర్పంచ్ లతో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. రాత్రిపూట పశువులపై దాడి చేస్తున్నట్టు గుర్తించారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చీఫ్ అటవీ అధికారి శరవనన్ ఆధ్వర్యంలో అటవీ అధికారుల నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. పులిని బంధించేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ఒమ్మంగి, పోతులూరు, పొదురుపాక, శరభవరం, ధర్మవరం గ్రామాల్లో పెద్దపులి గేదెలపై దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
BJP Rajyasabha : రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ
బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్ , మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ కు స్థానం కల్పించింది. అలాగే ఉత్తరాఖండ్ నుంచి కల్పనా సైనీకి చోటు లభించింది. మొత్తం 16 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.
Punjab Singer Murder : పంజాబీ సింగర్ సిద్ధూ దారుణ హత్య
Punjab Singer Murder : పంజాబ్ లో దారుణ ఘటన జరిగింది. పంజాబీ సింగర్ , కాంగ్రెస్ నేత సిద్ధూ హత్యకు గురయ్యారు. జీపులో వెళ్తుండగా సింగర్ సిద్ధూపై దుండగులు కాల్పులు జరిపారు. సిద్ధూపై 20 రౌండ్ల కాల్పులు జరిపారు. పంజాబ్ మాన్సా జిల్లాలో ఘటన జరిగింది.
MP TG Venkatesh: ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్
* ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఎంపీ టీజీ వెంకటేశ్ కు క్లిన్ చిట్
* ఏ 5 నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేరును FIR నుండి తొలగించిన
బంజారాహిల్స్ పోలీసులు
* బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏపీ జెమ్స్ జ్యువెలర్స్ కు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించారని కేసు
* ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
* ఈ కేసులో టీజీ వెంకటేష్ ప్రమేయంపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో FIR నుండి తొలగింపు
* తనపై హత్యాయత్నం చేశారని సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ నిందితుడిగా ఎఫ్.ఐ.ఆర్.లో నమోదు
* బంజారాహిల్స్ పోలీసులు టీజీ వెంకటేష్ కు ఈ కేసుతో సంబంధం లేదంటూ స్పష్టం
* ఏ-1 టీజీ విశ్వప్రసాద్ కు సీఆర్పే 41సీ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
