
Shreyas Iyer Sunglasses: సన్ గ్లాసెస్‌తో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ - ట్రోల్స్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్
Duleep Trophy :అసలే ఫామ్‌లో లేడు. ఆపై విచిత్రమైన పద్దతిలో బ్యాటింగ్ చేశాడు. అంతే ప్రత్యర్థులు దీనిపైనే ట్రోల్స్ మొదలు పెట్టారు. శ్రేయస్ అయ్యర్‌ను సోషల్ మీడియా రోస్ట్ చేస్తోంది.

Shreyas Iyer batting: అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లలో శ్రేయస్ అయ్యర్ ఆట తీరుపై విమర్సలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు శుక్రవారం అతను బ్యాటింగ్‌కు దిగిన తీరుపై క్రికెట్ లవర్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇండియా డీ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ ఇండియా ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. కేవలం 7 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. మహమ్మద్ ఖలీల్ వేసిన బాల్‌ను ఫుల్ షర్ట్ ఆడేందుకు ప్రయత్నించి మిడ్ ఆఫ్‌లో ఉన్న ప్లేయర్ చేతికి చిక్కాడు. దీంతో ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు.
శుక్రవారం అనంతపురంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో శ్రేయస్ అయ్యర్ సన్ గ్లాసెస్‌తో బ్యాటింగ్ ఆడేందుకు మైదానంలోకి అడుగు పెట్టాడు. సన్ గ్లాసెస్‌తో సాధారణంగా ఎవరు బ్యాటింగ్‌కి రారు అలా వచ్చిన చాలా అరుదుగా ఇలా శ్రేయస్‌లాగా వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఖాతా తడవకుండానే డకౌట్ అవడంతో శ్రేయస్ అయ్యర్ సన్ గ్లాసెస్‌తో బ్యాటింగ్ చేయడాన్ని గమనించిన అభిమానులు టోల్స్ చేస్తూ ఉన్నారు.
భారత టెస్ట్ జట్టులో చోటు కోసం ప్రయత్నాలు :
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అనంతరం శ్రేయస్ అయ్యర్ భారత టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయాడు. అప్పటి నుంచి భారత టెస్ట్ జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నందుకు అనుగుణంగా తన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. టెస్ట్ జట్టులో స్థానం కోసం రెడ్ బాల్ మ్యాచ్ లను ఎంచుకున్న శ్రేయాస్ ఈ మ్యాచ్ లలో కూడా నిలకడగా పరుగులు సాధించడంలో వరుసగా విఫలమవుతున్నాడు. టెస్ట్ మ్యాచ్‌లకు సెలెక్ట్ కావడానికి ఎంతమంది ప్లేయర్లకు దులీప్ ట్రోఫీని ఒక ఆయుధంగా మలుచుకుంటారు. ఇలాంటి మ్యాచ్‌లో కూడా సెలక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించు లేకపోతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దులీప్ ట్రోఫీలో కేవలం ఒక ఇన్నింగ్స్‌లో మాత్రమే 55 పరుగులు చేసిన శ్రేయస్ మిగతా ఇన్నింగ్స్ లో 16 బంతుల్లో 9, 44 బంతుల్లో 55, 7బంతుల్లో 0 పరుగులు చేశాడు. ఇది కేవలం ప్రస్తుతం జరుగుతున్న దులీప్ గణాంకాలు మాత్రమే. శ్రీలంక వన్డే టూర్ లో కూడా సింగిల్ డిజిట్ నెంబర్ కె పరిమితం అయ్యాడు. అంతకు మునుపు జరిగిన ఐపిఎల్ లో కూడా పెద్దగా రాణించలేదు.
Also Read: :ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఇండియా ఏ, బీ టీమ్స్- రసవత్తరంగా దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

