Duleep Trophy Highlights:ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఇండియా ఏ, బీ టీమ్స్- రసవత్తరంగా దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు
Duleep Trophy At Anantapur: దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు జట్లు కూడా దీటుగా తలపడుతున్నాయి. కీలకమైన ప్లేయర్లు విఫలమవుతున్నా మిగతా వాళ్లు రాణిస్తున్నారు.
![Duleep Trophy Highlights:ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఇండియా ఏ, బీ టీమ్స్- రసవత్తరంగా దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు India A and India B Teams upper hand in Duleep Trophy 2nd Round Matches Duleep Trophy Highlights:ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఇండియా ఏ, బీ టీమ్స్- రసవత్తరంగా దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/14/ebea2226139fb8d81c1131307b8ebd9f1726282567413215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Duleep Trophy highlights 2nd Round Day 2: అనంతపురం జిల్లాలోని అనంతపురం స్పోర్ట్స్ విలేజ్‌లో జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఆసక్తిగా సాగుతున్నాయి. ఇండియా ఏ, బీ జట్లు ధాటిగా అడుతూ ప్రత్యర్థులను పరుగులు పెట్టిస్తున్నాయి.
ఇండియా ఏ బౌలర్ల ధాటికి ఇండియా డీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 183 పరుగులకు కుప్పకూలింది. ఇండియా ఏ జట్టుకు 107 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా ఏ జట్టు బ్యాచ్స్‌మెట్లు ప్రతమ్ సింగ్, మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీలు చేశారు.
రాణించిన అఖీబ్, ఖలీల్:
ఇండియా ఏ జట్టు బౌలర్లు ఖలీల్ అహ్మద్, అఖీబ్ ఖాన్∙చెరో మూడు వికెట్లు తీసుకుని ఇండియా డీ జట్టును స్వల్పస్కోర్‌కు పరిమితం చేశారు. మిగతా బౌలర్లు ప్రసిద్ద్ కృష్ణ, తనుష్, సామ్స్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇండియా డీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 52.1 ఓవర్లలో 183 పరుగులు చేసింది. జట్టులో దేవదత్ పడిక్కిల్ 92(15 ఫోర్లు), హర్షిత్ రాణా రెండు భారీ సిక్సర్లతో 31, రికీ బుయీ 23 పరుగులు చేయగా, మిగతా వారు పెద్దగా రాణించలేదు. దీంతో ఇండియా ఏ జట్టుకు 107 పరుగుల ఆధిక్యత లభించింది.
Also Read: భూమి మీదున్న జనాభాలో 8వ వంతు క్రిస్టియానో రొనాల్డో ఫాలోవర్సే- సోషల్ మీడియాలో కొత్త చరిత్ర
మయాంక్, ప్రతమ్ సింగ్ అర్ధసెంచరీలు:
అనంతరం ఇండియా ఏ జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్లు ప్రతమ్ సింగ్ 82 బంతుల్లో 6 బౌండరీలతో 59, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 87 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 56 పరుగులు చేశారు.
ఇండియా బీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా సీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదటిరోజు ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సెంచరీతో ఇండియా సి టీం భారీ స్కోరు సాధించగలిగింది. జట్టులో ఆల్‌రౌండర్ మవన్ సుతార్ 156 బంతుల్లో 11 బౌండరీలు 3 సిక్సర్ల సహాయంతో 82 పరుగులు చేశాడు. అన్షుల్ కాంబోజ్ 38, మయాంక్ మాక్కండే 17 పరుగులు చేశారు. ఇండియా బీ జట్టు బౌలర్లలో ముకేష్ కుమార్ 4, రాహుల్ చాహర్ 4, నవదీప్‌శైనీ, నితీష్‌కుమార్ రెడ్డి చెరో వికెట్ తీసుకున్నారు.
వికెట్ నష్టపోకుండా ఆడుతున్న ఇండియా బీ టీం :
ఇండియా బీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో దీటుగా ఇండియా సి టీంకు జవాబిచ్చింది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ అభిమన్యు మిథున్, నారాయణ్ జగదీష్ అర్థ సెంచరీలతో మైదానం నలుమూలల బౌండరీలు సాధిస్తూ మొదటి ఇన్నింగ్స్‌లో గౌరవమైన స్కోరు సాధించింది. అభిమన్యు మిథున్ 91 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 51, నారాయణ్ జగదీశన్ 126 బంతుల్లో 8 ఫోర్లతో 67 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేశారు.
Also Read: దులీప్ ట్రోఫీలో విఫలమైన సంజు శాంసన్- వరుస వైఫల్యాలపై విమర్శలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)