Christiano Ronaldo : భూమి మీదున్న జనాభాలో 8వ వంతు క్రిస్టియానో రొనాల్డో ఫాలోవర్సే- సోషల్ మీడియాలో కొత్త చరిత్ర
Portugal: క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించాడు. అన్ని సామాజిక మాధ్యమాల ఫాలోవర్లతో కలిపి వంద కోట్ల మార్కును అధిగమించి సోషల్ మీడియా కింగ్‌గా మారాడు.
Cristiano Ronaldo: క్రిష్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించాడు. ఏ ఒక్క ఇండివిడ్యువల్‌కు ఇప్పటి వరకూ సాధ్యం కాని రికార్డును తన పేర లిఖించుకున్నాడు. అన్ని సామాజిక మాధ్యమాల ఫాలోవర్లతో కలిపి వంద కోట్ల మార్కును అధిగమంచాడు. ఈ దెబ్బకు పాత రికార్డులు అన్నీ బద్దలుకొట్టి సోషల్ మీడియా కింగ్‌గా మారాడు.
We’ve made history — 1 BILLION followers! This is more than just a number - it’s a testament to our shared passion, drive, and love for the game and beyond.
— Cristiano Ronaldo (@Cristiano) September 12, 2024
From the streets of Madeira to the biggest stages in the world, I’ve always played for my family and for you, and now 1… pic.twitter.com/kZKo803rJo
వంద కోట్ల మంది ఫాలోవర్లు:
పోర్చుగల్ స్టార్ ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో పేరు తెలియని క్రీడాభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ప్రపంచ క్రీడా యవనికపై తన ముద్రవేశాడు. రొనాల్డోకు రికార్డులు సృష్టింటడం వాటిని బద్దలు కొట్టడం కొత్త కాదు. మడైరో రోడ్ల మీద నుంచి ఫుట్ బాల్ గ్రౌండ్‌లో అడుగు పెట్టిన నాటి నుంచే మైదానంలోనూ బయటా రికార్డులు సృష్టిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు అదే విధంగా సామాజిక మాధ్యమాల్లో వంద కోట్ల మంది ఫాలోవర్లతో ఏ ఒక్క ఇండివిడ్యువల్‌కు సాధ్యం కాని ఘనతను తన సొంతం చేసుకున్నాడు.
ఇన్‌స్టామ్‌గ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ఉన్న క్రిస్టియానో రొనాల్డో ఇటీవలే.. "యువర్ క్రిస్టియానో" పేరుతో యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించగా.. 90 నిమిషాల వ్యవధిలోనే ఇది ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ను సాధించింది. వారంలోనే 5 కోట్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకొని రికార్డు సృష్టించారు. ప్రస్తుతం 60 మిలియన్ యూట్యూబ్ ఫాలోవర్లు ఉన్నారు.
Also Read: రొనాల్డోకు మరడోనా అవార్డు, అయిదోసారి ప్రతిష్టాత్మక పురస్కారం
ప్రస్తుతం AI Nsaar క్లబ్‌కు ఆడుతున్న ఈ స్టార్ ఫుట్‌బాలర్.. వంద కోట్ల మంది ఫాలోవర్లకు తన సామాజిక మాధ్యమాలు చేరడంపై ట్వీట్టర్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఒక బిలియన్ ఫాలోవర్లతో మనం రికార్డు సృష్టించామన్న రొనాల్డో.. ఇది కేవలం నెంబర్ కాదని, కోట్లాది మంది ప్రేమకు దొరికిన బహుమతిగా పేర్కొన్నాడు.
మడైరా రోడ్ల మీద ఫుట్‌బాల్ ఆడే స్థాయి నుంచి పెద్ద పెద్ద స్టేజీల మీద ఆడగలిగాను. ఇదంతా నా కుటుంబం కోసం ఇంకా మీకోసం అని అన్నాడు. ఇప్పుడు మనం వంద కోట్ల మందికి ఒకటిగా నిలబడిగలిగామన్న రొనాల్డో.. అభిమానుల ఆదరాభిమానాలతోనే ఇదంతా సాధ్యమైందన్నాడు. నా ప్రతి విజయంలో ప్రోత్సహించారు, నా పరాజయంలో వెన్ను తట్టి నిలబడ్డారు. ఈ ప్రయాణమంతా మీతోనే సాధ్యమైందంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మనం ఏదైనా సాధించాలని అనుకుంటే దానికి ఏ విధమైన లిమిట్స్ ఉండబోవని అందరం కలిసి నిరూపించామన్నాడు.
Also Read: గూగుల్ చరిత్రలోనే ఎక్కువగా సెర్చ్ చేసింది ఈ ఆటగాళ్ల గురించే!
ఈ వంద కోట్ల ఫాలోవర్ల రికార్డుతో పాటే రొనాల్డో ఫుట్ బాల్ చరిత్రలో మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఇప్పటి వరకూ కెరీర్‌లో 900 గోల్స్ కొట్టిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం రొనాల్డో ఖాతాలో 901 గోల్స్ ఉన్నాయి. ఈ తరం ఫుట్‌బాలర్లలో లియోనల్ మెస్సీతో సమానంగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన 39 ఏళ్ల రొనాల్డో కెరీర్‌లో పోర్చుగల్ ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేకపోవడం లోటే.
ఫేస్‌బుక్‌లో రొనాల్డోకు 17కోట్లకు పైగా ఫాలోవర్లు ఉండగా.. కోటీ 13 లక్షల మంది Xలో ఫాలో అవుతున్నారు. రెండు చైనీస్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో కూడా రొనాల్డోకు అకౌంట్లు ఉండగా వాటిలో ఒక్కో దానిలో 10 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా.. 64 కోట్ల మంది వరకూ ఫాలోవర్లు ఉండగా.. ఇది భూమి మీద ఉన్న జనాభాలో 8వ వంతుతో సమానం. రొనాల్డో తర్వాత అతడి ఫెలో ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీకి 50కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Also Read: ఒక్కరోజులో 20 మిలియన్ సబ్‌స్క్రైబర్లు - యూట్యూబ్ రికార్డులు కొడుతున్న రొనాల్డో!