Hyderabad Metro Timings: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Hyderabad Metro Timing changed from November 3 | హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణవేళల్లో మార్పులు జరిగాయి. ఇక నుంచి రాత్రి 11 గంటలకే మెట్రో చివరి రైలు బయలుదేరుతుంది.

హైదరాబాద్: హైదరాబాద్ లాంటి నగరాలలో ట్రాఫిక్ రద్దీని తప్పించుకునేందుకు ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారు. హైదరాబాద్ లోనూ మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు నడిచే టైమింగ్స్ మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. సోమవారం (నవంబర్ 3) నుంచి హైదరాబాద్ లో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందించనుంది.
ఆదివారంతో ముగియనున్న పాత టైమింగ్స్
హైదరాబాద్ మెట్రో రైలు నగరంలో పలు ప్రాంతాలకు సజావుగా కనెక్టివిటీని అందిస్తుంది. మెట్రో సంస్థ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ లాంటిదే. ఎందుంటే.. ప్రస్తుతం సోమవారం నుండి శుక్రవారం వరకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి మొదటి రైలు ఉదయం 6:00 గంటలకు, చివరి రైలు రాత్రి 11:45 గంటలకు ఉంది. శనివారం మొదటి రైలు ఉదయం 6:00 గంటలకు, చివరి రైలు రాత్రి 11:00 గంటలకు ఉంది. ఆదివారం అయితే మొదటి రైలు ఉదయం 7 గంటలకు, చివరి రైలు రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. కానీ సోమవారం నుంచి రాత్రి 11 తరువాత ప్రయాణం చేసేవారికి రైలు సర్వీసులు లేకపోవడంతో బస్సుల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఆఫీసు ఆలస్యంగా ముగిసేవారికి ఇది కొంత ఇబ్బంది కలిగించే విషయం.

హైదరాబాద్ మెట్రో 3 ఇంటర్‌చేంజ్ స్టేషన్‌లతో నగరవాసులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
రెడ్ లైన్ - మియాపూర్ నుంచి ఎల్‌బి నగర్ వరకు వయా ఎంజి బస్ స్టేషన్, నాంపల్లి & అమీర్‌పేట
గ్రీన్ లైన్ - జెబిఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంజి బస్ స్టేషన్ వరకు వయా సికింద్రాబాద్
బ్లూ లైన్ - నాగోల్ నుంచి రాయదుర్గం వరకు వయా సికింద్రాబాద్ & అమీర్‌పేట
రెండు వేర్వేరు లైన్లను అనుసంధానించే ఇంటర్‌చేంజ్ స్టేషన్లు
ఎంజి బస్ స్టేషన్ రెడ్ లైన్, గ్రీన్ లైన్‌ను కలుపుతుంది
జెబిఎస్ పరేడ్ గ్రౌండ్ గ్రీన్ లైన్, బ్లూ లైన్‌ను కలుపుతుంది
అమీర్‌పేట స్టేషన్ రెడ్ లైన్, బ్లూ లైన్‌ను కలుపుతుంది






















