అన్వేషించండి

Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు

Maruti First Electric e Vitara వచ్చే నెలలో విడుదల కానుంది. ఇది కంపెనీ అత్యంత ఖరీదైన ఉత్పత్తిగా మారనుంది. గ్రాండ్ విటారా, విక్టోరిస్ కంటే పైన స్థానం పొందుతుంది.

మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా (Maruti e Vitara) కోసం ఎదురుచూపులు ముగియనున్నాయి. మారుతి సుజుకీ కంపెనీ చాలాకాలం నుండచి ఎదురుచూపుల తర్వాత తమ మొదటి ఎలక్ట్రిక్ కారు e-Vitara ను విడుదల చేయడానికి సన్నద్ధమైంది. మారుతి కంపెనీ ఈ మోడల్‌ను మొదటిసారిగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. తాజాగా ఈ కారు డిసెంబర్ 2025 లో మార్కెట్లోకి రానుందని నిర్ణయించారు. కంపెనీ దీనిని ఒక ప్రత్యేక ప్రయోజనమైన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేసింది. ఇది మొదటి నుంచి ఎలక్ట్రిక్ కారు రూపంలోనే డిజైన్ చేశారు. ఇది పెట్రోల్ మోడల్ కు చెందిన ఎలక్ట్రిక్ మార్పిడి కారు మాత్రం కాదు.

మారుతి e-Vitara ఎలా ఉంది?

మారుతి e-Vitara ఆకారం దీనిని సమతుల్యమైన, ఆచరణాత్మకమైన SUV గా మార్చుతుంది. ఈ విటారా పొడవు 4275 మిమీ, వెడల్పు 1800 మి.మీ, వీల్‌బేస్ 2700 మి.మీ. దీని డిజైన్ సాంప్రదాయ మారుతి SUV శైలితో ఆధునిక, ఫ్యూచర్ డిజైన్ అందిస్తుంది. ఈ కారు ఉత్పత్తి గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ప్రారంభించారు. ఇక్కడ నుంచి మారుతి అనేక గ్లోబల్ మోడళ్లను ఎగుమతి చేస్తుంది. కంపెనీ e-Vitara కోసం పెద్ద ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే దీనిని 100 దేశాలకు పైగా ఎగుమతి చేస్తున్నారు. 

మారుతి e-Vitara బ్యాటరీ, రేంజ్

మారుతి e-Vitara భారతదేశంలో 2 బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో 49 kWh, 61 kWh తో రానుంది. టాప్ వేరియంట్ రేంజ్ సుమారు 500 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు, ఇది ఈ విభాగంలో అత్యధిక రేంజ్ ను అందించే ఎలక్ట్రిక్ SUV లలో ఒకటి అని చెప్పవచ్చు. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు. దీనివల్ల బ్యాటరీని తక్కువ సమయంలో 80% వరకు ఛార్జింగ్ అవుతుంది. e-Vitara సిటీ రోడ్లతో పాటు రహదారి ప్రయాణం రెండుంటికీ అద్భుతమైన పనితీరును అందించగలదని కంపెనీ తెలిపింది.

మారుతి e-Vitara ఇప్పటివరకు అత్యధిక ఫీచర్లతో కూడిన SUV గా మారనుంది. ఇందులో అనేక అధునాతన ఫీచర్లు ఉంటాయి. 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS స్థాయి 2 డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ తో సహా), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. అదనంగా ఇందులో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వాయిస్ కమాండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 

మారుతి e-Vitara ధర ఎంత?

మారుతి సుజుకి e-Vitara కంపెనీ ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఉత్పత్తిగా మారనుంది. SUV Grand Vitara కారు, Victoris కంటే ఎక్కువ స్థానంలో నిలుస్తుంది. కానీ ధర గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ దీని ప్రారంభ ధర 25 లక్షల నుండి రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ధరకు e-Vitara హ్యుందాయ్ Creta EV కారు, Tata Curvv EV కారు, Mahindra XUV400 Pro కారు, MG ZS EV వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ SUV లతో పోటీపడుతుంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget