భారత మహిళల టీమ్ తలరాత మార్చిన ద్రోణాచార్యుడు
హ్యాట్రిక్ ఓటముల నుంచి కోలుకుని.. మోస్ట్ టఫెస్ట్ టీమ్స్ అయిన కివీస్, ఆసీస్ మీద డబుల్ ధమాకా విక్టరీలతో దూసుకుపోతున్న టీమిండియా మహిళల జట్టు ఇంత అద్భుతంగా ఆడుతోందంటే దాని వెనక ఓ పర్సన్ ఉన్నాడు. అతడే టీమిండియా మహిళల జట్టు కోచ్ అమోల్ మొజుందార్. ఒకప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలకి ఏ మాత్రం తగ్గని అద్భుతమైన బ్యాటర్. సచిన్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నాడు. 1993-94 రంజీ సీజన్‌లో ముంబై తరపున ఆడి.. హర్యానాతో 260 పరుగుల వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. మొత్తం 171 ఫస్ల్ క్లాస్ మ్యాచ్‌ల్లో 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలతో 11,167 పరుగులు చేసి.. జూనియర్ సచిన్ అనిపించుకన్నాడు. కానీ ఇంత ట్యాలెంట్ ఉన్నా.. సచిన్‌కి దక్కినట్లు అమోల్‌కి టీమిండియాలో ఆడే ఛాన్స్ మాత్రం రాలేదు. కనీసం ఒక్కసారైనా టీమిండియా జెర్సీ ధరించాలనుకున్నాడు. ఆ ఛాన్స్ కూడా రాలేదు. ఆ బాధతో కుమిలిపోతున్న మజుందార్‌కి.. డెస్టినీ కొత్త రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. టీమిండియా మహిళల జట్టు హెడ్ కోచ్‌గా అతడిని బీసీసీఐ నియమించిన టైంలో బహుశా ఎవ్వరూ అనుకోని ఉండరు.. మజుందార్ కోచింగ్‌లో టీమిండియా ఇంత బలమైన జట్టుగా మారుతుందని. కానీ మజుందార్ మాత్రం ద్రోణాచార్యుడు తన విద్యలన్నీ అర్జునుడికి ఇచ్చినట్లు.. తన స్కిల్స్ అన్నింటినీ హర్మన్ సేనకి నేర్పించి.. ఒక్కొక్కరినీ బుల్లెట్లలా తీర్చిదిద్దాడు. ఈ విషయాన్ని హర్మన్ స్వయంగా ఒప్పుకుంది. ముఖ్యంగా సెమీఫైనల్‌లో గెలిచిన తర్వాత మ్యాచ్ గెలిచిన క్రెడిట్‌ని కంప్లీట్‌గా మజుందార్‌కే ఇచ్చింది హర్మన్. అందుకే అంటారు లైఫ్ ఎప్పుడూ రెండో ఛాన్స్ ఇస్తుంది. అమోల్ మజుందార్ లైఫ్‌లో కూడా అదే జరిగింది.





















