Top 5 Most Affordable Cars: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
Best Mileage Cars | మొదటి ఉద్యోగంలో చేరిన తర్వాత కారు కొనాలనుకుంటే, తక్కువ బడ్జెట్లో రూ. 3.69 లక్షల నుండి ప్రారంభమయ్యే, 34 KM మైలేజ్ ఇచ్చే కార్లు ఉన్నాయి.

మీరు ఉద్యోగం చేయడం ప్రారంభించాక.. కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. కానీ బడ్జెట్ కొంచెం తక్కువగా ఉంటే, ఈ వార్త మీకు హెల్ప్ అవుతుంది. మార్కెట్‌లో తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్. తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన పలు కార్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఉద్యోగం చేసే యువతకు సరిపోయే భారత మార్కెట్లోని 5 చవకైన కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Maruti Suzuki (మారుతి సుజుకి) ఆల్టో K10
మారుతి సుజుకి ఆల్టో K10 భారతదేశంలో అత్యంత చవకైన, కస్టమర్ల నుంచి ఆదరణ పొందిన కార్లలో ఒకటి. దీని ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ. 3.69 లక్షలకు ప్రారంభమవుతుంది. ఈ కారు 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు 24.39 నుండి 24.90 km/l (పెట్రోల్), 33.85 km/kg (CNG) వరకు మైలేజ్ ఇస్తుంది. దీని కాంపాక్ట్ సైజు, తేలికపాటి స్టీరింగ్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి సులభం అవుతుంది. 1.0L డ్యూయల్‌జెట్ ఇంజిన్ పవర్ ఫుల్ మాత్రమే కాదు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. పార్కింగ్ సులభంగా చేయవచ్చు. నిర్వహణ కూడా చౌకగా ఉంటుంది.
రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ క్విడ్ SUV లాంటి లుక్, ఫీచర్-ప్యాక్డ్ క్యాబిన్‌కు ఫేమస్ అయింది. దీని 999cc ఇంజిన్ సాఫీగా నడుస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, Android ఆటో, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి లక్షణాలు దీనిని ప్రత్యేకంగా మారుస్తాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది దాదాపు 22 km/l మైలేజ్ అందిస్తుంది. రెనాల్డ్ క్విడ్ డిజైన్ యువతను ఆకర్షిస్తుంది.
టాటా టియాగో
సేఫ్టీ, స్మార్ట్ లుక్‌తో పాటు మైలేజ్ కోరుకునే వారి కోసం టాటా మోటార్స్ టియాగో. దీని ధర రూ. 4.57 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు 20 km/l (పెట్రోల్), 27.28 km/kg (CNG) వరకు మైలేజ్ ఇస్తుంది. టియాగో క్యాబిన్ సౌకర్యవంతంగా ఉంటుంది. అధునాతన భద్రతా లక్షణాల కలిగి ఉంది. మొదటిసారి కారు కొనుగోలు చేసేవారికి ఇది మంచి ఛాయిస్.
మారుతి సుజుకి వాగన్ ఆర్
మారుతి వాగన్ ఆర్ (Wagon R) చాలా కాలం భారత కస్టమర్‌లకు ఫస్ట్ ఛాయిస్‌గా ఉంది. కారు టాల్ బాయ్ డిజైన్ ఎక్కువ స్పేస్, సౌకర్యాన్ని అందిస్తుంది. వాగన్ ఆర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వాగన్ ఆర్ మైలేజ్ దాదాపు 34 km/kg (CNG) వరకు ఉంటుంది. ఇది స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. రోజువారీ ఆఫీసుకు వెళ్లడానికి కారు కోసం చూస్తున్నట్లయితే, వాగన్ ఆర్ ఒక మంచి కారు.
మారుతి సెలెరియో
మారుతి సెలెరియో భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటి. ఇది పెట్రోల్‌లో 26 km/l, CNG వేరియంట్లో 34 km/kg వరకు మైలేజ్ ఇస్తుంది. మారుతి సెలెరియో కారు ధర రూ. 4.69 లక్షలకు ప్రారంభమవుతుంది. ఇది ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్, స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సహా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది.






















