Sanju Samson : దులీప్ ట్రోఫీలో విఫలమైన సంజు శాంసన్- వరుస వైఫల్యాలపై విమర్శలు
Sanju Samson Failed In Duleep Trophy: దులీప్ ట్రోఫీలో విఫలమైన సంజూ మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం లేదనే విషాయన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు.

Duleep Trophy Highlights: సంజు శాంసన్ ఈ 29 ఏళ్ల మలయాళ క్రికెటర్ భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వచ్చిన అవకాశాల్ని అందుపుచ్చుకోవడంలో వరుసగా విఫలమవుతూ ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న డొమెస్టిక్ మ్యాచ్ దులీప్ ట్రోఫీలో కూడా విఫలం అవటంతో నెక్స్ట్ మ్యాచ్లో కూడా తనకు అవకాశం దక్కుతుందో లేదో అన్న సందిగ్ధంలో పడ్డాడు.
ఈనెల ఐదు నుంచి ప్రారంభమైన దులీప్ ట్రోఫీ ఇండియా డి జట్టు తరఫున సంజు శాంసన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌కు అవకాశం లభించకపోయినప్పటికీ రెండో మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌ను పక్కనపెట్టి సంజు శాంసన్ కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అవకాశం కల్పించాడు. దీంతో రెండో మ్యాచ్‌లో అందరి దృష్టి సంజు శాంసన్ మీద పడింది.
ఇండియా ఏ - ఇండియా డి జట్టు రెండో మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇండియా డి జట్టు తరఫున వికెట్ కీపర్‌గా సంజుశాంసన్‌కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో ఇండియా ఏ జట్టును 290 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా డీ జట్టులో ఐదో స్థానంలో సంజు శాంసన్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో హార్దిక్ మాజీ భార్య చక్కర్లు , విడిపోవడానికి అతడే కారణమట!
సంజుశాంసన్ గ్రౌండ్లోకి బ్యాట్ పట్టుకుని అడుగు పెట్టగానే క్రౌడ్ మొత్తం సంజు సంజు అంటూ అరిచారు. దీన్ని బట్టి చూస్తేనే సంజుపై ఫ్యాన్స్ ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నారో అర్థమవుతుంది. కానీ వారి అంచనాలను అన్నిటిని తలకిందులు చేశాడు. కేవలం ఐదు పరుగులు చేసి అనవసర షాట్‌తో తన వికెట్ సమర్పించుకున్నాడు.
గత కొంతకాలంగా సంజుశాంసన్ నిలకడ లేని ఆటతో ఇబ్బంది పడుతున్నారు. విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ సంజుకి అనేక అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడని విమర్శ కూడా ఎక్కువగానే వినిపిస్తోంది. సంజుశాంసన్ లాస్ట్ 10 ఇన్నింగ్స్ స్కోర్ ను పరిశీలిస్తే.. 5,0,0,58,12,1,0,8,57,24. ఈ ఘనంగాలు చూస్తుంటేనే సంజుశాంసన్ పెర్ఫార్మెన్స్ ఏంటో అర్థమవుతుంది. సంజుశాంసన్ వరుస వైఫల్యాలను అధిగమించి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read:భూమి మీదున్న జనాభాలో 8వ వంతు క్రిస్టియానో రొనాల్డో ఫాలోవర్సే- సోషల్ మీడియాలో కొత్త చరిత్ర
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

