Tesla: టెస్లాకు భారీ ఆఫర్లు ఇస్తున్న ఏపీ - ఎలాన్ మస్క్ ప్లాంట్ పెట్టేస్తారా ?
Andhra Pradesh: ఇండియాలో పెట్టబోతున్న టెస్లా ఫ్యాక్టరీ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎక్కడ కావాలంటే అక్కడ భూమితో పాటు పోర్టు లింకేజీ కల్పించేందుకు సిద్ధమయ్యారు.

Tesla search for a factory location: అమెరికన్ ఈవీ దిగ్గజం టెస్లా ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకుంది. ఇంకా ఎక్కడ పెట్టాలని డిసైడ్ చేయలేదు. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఈవీ లగ్జరీ కార్ల దిగుమతలపై కాస్త పన్నులు తగ్గించడంతో ఇంపోర్టెడ్ అమ్మబోతోంది. జర్మనీ ప్లాంట్ నుంచి ఇండియాకు తీసుకు వచ్చి అమ్ముతారు. అయితే వీలైనంత త్వరగా ప్లాంట్ పెట్టాలని ఎలాన్ మస్క్ నిర్ణయించారు. అందుకే టెస్లాకు చెందిన బృందం ఇప్పుడు ఫ్యాక్టరీ లొకేషన్ వేటలో ఉంది.
ఇండియాలో ప్లాంట్ పెట్టేందుకు ప్లేస్ వెదుకుతున్న టెస్లా
ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్లాంట్ పెడితే పన్నుల పరంగా చాలా ప్రయోజనాలు కలసి వస్తాయి. అందుకే మస్క్ సిద్ధంగా ఉన్నారు. ఎలాన్ మస్క్ ఇండియాలో ప్లాంట్ పెట్టడం ట్రంప్ కు కూడా ఇష్టం లేదు. కానీ మస్క్ వ్యాపారం మస్క్ ది. అందుకే ఆయన ఇండియాలో ప్లాంట్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఆ ప్లాంట్ తమ రాష్ట్రానికి రావాలంటే.. తమ రాష్ట్రానికే రావాలని ప్రయత్నిస్తున్నారు. టెస్లా ప్రధానంగా పహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తోందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తిరస్కరించలేనంత ఆఫర్లు ఇచ్చి అయినా ప్లాంట్ ను తెప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.
రేసులో తెలుగురాష్ట్రాలు - భారీ ఆఫర్లు ఇస్తున్న ఏపీ
తెలంగాణకు ప్రత్యేకంగా అడ్వాంటేజ్ ఉంది. ఆకర్షణీయమైన ఈవీ పాలసీని ప్రకటించారు. పారిశ్రామికంగా అనుకూలంగా ఉండే ప్రాంతం అయితే పోర్టు లేకపోవడం మైనస్. ఏపీ పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. కియా లాంటి భారీ కార్ల తయారీ ఫ్యాక్టరీ ఎలాంటి సమస్యలు లేకుండా రన్ అవుతోంది. అలాగే పోర్టులు అడ్వాంటేజ్. కావాల్సినంత భూమి తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించి అయినా టెస్లాను ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అడిగిన చోట భూమిని ఇవ్వడంతో పాటు పోర్టు లింకేజీ కల్పించేందుకు సిద్దమని ఏపీ ప్రభుత్వం నుంచి సంకేతాలు వెళ్లినట్లుగాచెబుతున్నారు.
గట్టి ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్
ఏపీ ప్రభుత్వ పెద్దలు మొదటి నుంచి టెస్లాలో ఉన్నత స్థానాల్లో ఉన్న తెలుగువారి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. అసలు ప్రయత్నించకుండా.. ఉండటం కన్నా .. ప్రయత్నిస్తే వచ్చే వస్తుంది కదా అన్నట్లుగా ఓ ప్రయత్నం చేస్తున్నారు. పారిశ్రామిక రాయితీలు ఇచ్చి.. ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా చేస్తే దీర్ఘకాలంలో ఏపీ ఆటోమోబైల్ హబ్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కియా కార్లు దేశవ్యాప్తంగా తిరుగుతున్నాయి. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. అయితే టెస్లాను తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని ఇలా మంది సీఎంలు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. మరి ఆ రేసులో ఎంత ముందుకు వెళ్తుందన్నది కీలకంగా మారింది.
Also Read: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్ పటేల్, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు





















