Indian Head Coach Post: టీమిండియా హెడ్ కోచ్ పదవికి మోదీ, అమిత్‌షా, ధోనీ, సచిన్ దరఖాస్తు
Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం మోదీ, అమిత్‌షా, సచిన్, ధోనీ దరఖాస్తు చేస్తున్నారట. ఇలా 3000పైగా అప్లికేషన్లు బీసీసీకి చేరాయి.
BCCI Receives Over 3000 Applications For Head Coach Post: టీమిండియా హెడ్ కోచ్ పోస్టుకు దరఖాస్తు గడవు సోమవారంతో ముగిసింది. దాదాపు మూడు వేలకుపైగా అప్లేకిషన్లు బీసీసీఐకి వచ్చాయి. ఇప్పుడు వాటిని స్క్రూట్నీ చేస్తున్న సిబ్బందికి చాలా విచిత్రమైన పేర్లు కనిపిస్తున్నాయి. మూడు వేల అప్లికేషన్స్‌లో సీరియస్‌గా ఉన్నవి చాలా తక్కువని చాలా వరకు ఫేక్ పేర్లతో వచ్చినవే.
ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టేది ఎవరు? టీ 20 వరల్డ్‌కప్ టైంలో కూడా అందర్నీ తొలిచి వేస్తున్న ప్రశ్న. ఇప్పటికే ఈ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించిన బీసీసీఐ... వాటిని స్క్రూట్నీ చేసే పనిలో ఉంది. దరఖాస్తు గడువు కూడా సోమవారంతో ముగిసింది. అయితే దీనికి ఎవరెవరు దరఖాస్తు చేసారో అన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ ప్రముఖుల పేర్లతో కొంతమంది ఫేక్ దరఖాస్తులు పంపినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ 2024లో కేకేఆర్ టీంకు మెంటర్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ఈసారి ద్రవిడ్ నుంచి బాధ్యతలు తీసుకుంటారని పెద్దగా చర్చనడిచింది. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీంను నడిపించిన విధానం, ఆ జట్టు ట్రోఫీ గెలుచుకోవడంతో సడెన్‌గా గంభీర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో అటు బీసీసీఐ, ఇటు గంభీర్ రెండు వర్గాల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇద్దరూ సైలెంట్‌గానే ఉన్నారు.
ఇప్పటి వరకు బీసీసీకి చేరిన మూడు వేలకుపైగా దరఖాస్తుల్లో చాలా వరకు వివిధ క్రికెటర్లు, పొలిటికల్ లీడర్ల పేరుతో వచ్చిన అప్లికేషన్లే ఎక్కువగా ఉన్నాయట. సచిన్ , ధోనీ, హర్భజన్ సింగ్, వీరందర్ సెహ్వాగ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా పేర్లతో కొందరు ఆకతాయిలు దరఖాస్తులు పంపించారు.
ఇలా ఫేక్ పేర్లతో అప్లికేషన్లు రావడం బీసీసీఐకు ఇదేం కొత్తకాదు. 2022లో కూడా దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు 5000 వరకు ఫేక్ అప్లికేషన్లు వచ్చాయి. గతంలో మెయిల్ ద్వారానే దరఖాస్తులు స్వీకరించే బీసీసీఐ ఈసారి గూగల్ ఫామ్ ద్వారా మాత్రమే అప్లికేషన్లు స్వీకరించింది.