BCCI Rules: చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్లేయర్లకు ఝలక్.. వాళ్లకు నో ఎంట్రీ..!
గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ వైట్ వాష్, విదేశాల్లో ఆసీస్ చేతిలో టెస్టు సిరీస్ ఓటమితో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బోర్డు నిబంధనలు కఠినతరం చేసింది.

ICC Champions Trophy News: బీసీసీఐ నిర్దేశించిన టెన్ పాయింట్ ఫార్మూలాలోని ఒకరూల్ తొలిసారిగా అమల్లోకి వస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఈనెల 15న భారత్.. దుబాయ్ కు బయల్దేరి వెళ్లనుంది. అయితే వారితోపాటు వాళ్ల భార్యలు, భాగస్వాములు వెంట వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. బీసీసీఐ తాజా నియమాల ప్రకారం 45 రోజుల కంటే తక్కువగా ఉండే విదేశీ టూర్లకు ప్లేయర్ల భార్యలు, భాగస్వాములకు అనుమతి లేదు. మెగాటోర్నీ కేవలం మూడు వారాలే జరుగుతుండటంతో ఈ రూల్ అమల్లోకి వచ్చింది. ఇక ఇప్పటికే బీసీసీఐ నిర్దేశించిన చాలా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఆటగాళ్లంతా ఒకే బస్సులో వెళ్లడంతోపాటు ప్రైవేట్ వెహికల్స్ వాడకుండా బీసీసీఐ కట్టడి చేసింది. అలాగే అంతర్జాతీయ సిరీస్ లు లేనప్పుడు దేశవాళీల్లో ఆడాలనే రూల్ ను ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లంతా దాదాపుగా పాటించారు. ఇక ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది యొక్క భద్రతా సిబ్బందిని బోర్డు తీసివేయించింది.
🚨 As per New BCCI Rule, Families of Indian cricketers will not travel during the Champions Trophy 2025. [Kushan Sarkar From PTI]#TeamIndia #Cricket #ChampionsTrophy #ChampionsLeague #ChampionsTrophy2025 #ViratKohli𓃵 #BCCI #IPL2025 pic.twitter.com/Xf0NaQyann
— KevellSportz (@KevellSportz) February 13, 2025
ఆసీస్ టూర్ తర్వాత అమల్లోకి..
గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ వైట్ వాష్, విదేశాల్లో ఆసీస్ చేతిలో టెస్టు సిరీస్ ఓటమితో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బోర్డు నిబంధనలు కఠినతరం చేసింది. అప్పటివరకు నిబంధనల విషయంలో చూసి చూడనట్లుగా ఉన్న బోర్డు కన్నెర్ర చేసింది. పది సూత్రాలతో మార్గదర్శకాలను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. తాజా ఘటనతో దాదాపు అన్ని నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్లయ్యింది. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా మినహాయింపులు కావాలనకుంటే కోచ్, కెప్టెన్, బోర్డు జీఎం దగ్గరి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఒకవేళ తమ పార్ట్ నర్ కు అనుమతి దొరికినా వాళ్ల ఖర్చును బోర్డు భరించదు.
ఇంగ్లాండ్ టూర్లో అవకాశం..
వచ్చే జూన్ లో ఇంగ్లాండ్ గడ్డపై జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ లో మాత్రం తమతో పాటు పార్ట్ నర్స్ ను ఆటగాళ్లు తీసుకెళ్లవచ్చు. ఈ టూర్ సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి, రెండు వారాల వరకు తమతోపాటు పార్ట్నర్స్ ను తీసుకెళ్లవచ్చని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రెండు వారాల తర్వాత భాగస్వాములు స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇక చాంపియన్స్ టోర్నీ ఈనెల 19 నుంచి పాక్ లో ప్రారంభమవుతుండగా, భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ లో ఈనెల 20 నుంచి జరుగుతాయి. ఈనెల 20 న బంగ్లాదేశ్ తో, 23న చిరకాల ప్రత్యర్థి పాక్ తో, మార్చి 2న న్యూజిలాండ్ తో భారత్ తలపడుతుంది. ఒకవేళ నాకౌట్ కు భారత్ చేరితే ఆ మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే జరుగుతాయి.
Read Also: WPL 2025: రేపటి నుంచే డబ్ల్యూపీఎల్ షురూ.. బరిలో ఐదు జట్లు.. ఈసారి 4 వేదికల్లో మ్యాచ్ లు.. డిఫెండింగ్ చాంప్ గా బెంగళూరు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

