News
News
X

Horoscope Today 15th June 2022: ఈ రాశి షుగర్, బీపీ పేషెంట్లు మందులు నిర్లక్ష్యం చేయకండి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 15th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

FOLLOW US: 
Share:

2022 జూన్ 15 బుధవారం రాశిఫలాలు

మేషం
వ్యాపార పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ ఆసక్తికి అనుగుణంగా పని చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరినీ విమర్శించకండి.ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులపై పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.

వృషభం
కార్యాలయంలో కొన్ని అవసరమైన మార్పులు చేయవలసి రావచ్చు. న్యాయపరమైన విషయాల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. రోజంతా సానుకూలంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఉద్యోగులు తమ గౌరవాన్ని కోల్పోకుండా చూసుకోండి. ఆస్తి వివాదాలకు దూరంగా ఉండండి. 

మిథునం
ఆఫీసు, ఇంటి బాధ్యతలను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటారు. కార్యాలయంలో పనులు సులువుగా పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు డబ్బు ఖర్చు అవుతుంది. విద్యార్థులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. 

కర్కాటకం
తలపట్టిన పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందగలరు. మీ దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది. మీరు చేసే పనులకు జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. సబార్డినేట్ ఉద్యోగుల నుంచి మీకు సహకారం లభిస్తుంది.

Also Read:  ఈ వారం ఈ రాశులవారు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

సింహం
దంపతుల మధ్య కొంత మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లల చదువు విషయంలో కొంత ఆందోళన ఉంటుంది.ప్రజలు మీ సలహాకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. 

కన్యా
విమర్శలను పట్టించుకోవద్దు. ఆదాయం కొంత తగ్గుతుంది. ప్రయాణాల్లో ఆంటకాలు ఉండొచ్చు. మీ పని తీరులో మార్పు వస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో విబేధాల వాతావరణం ఉండొచ్చు. అధిక పని అలసట కలిగిస్తుంది

తుల
ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు తమ లక్ష్యాలను సమయానికి ముందే పూర్తి చేస్తారు. వివాహ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. విద్యార్థులు విజయం సాధించగలరు. వాహనం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. షుగర్, బీపీ పేషెంట్లు మందులు వేసుకోవడంలో అశ్రద్ధ చేయకండి. 

వృశ్చికం
ఆఫీసులో పరస్పర సామరస్యం లోపిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సమయపాలన లేకపోవడం పనులు ఆగిపోతాయి. మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

ధనుస్సు 
నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. గత పెట్టుబడుల నుంచి లాభాలుంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  మహిళా సహోద్యోగుల మద్దతు పొందుతారు. ఈ రోజు చాలా బిజీగా ఉంటారు.అనుకోకుండా డబ్బు చేతికందే అవకాశం ఉంది. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి.

Also Read: ఈ వారం ఈ రాశులవారికి ధనలాభం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

మకరం
స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. తెలియని వ్యక్తులు మీ పనికి ఆటంకం కలిగిస్తారు. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. ఎక్కువగా ఆలోచించకండి. ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ వ్యవహారాలలో అపనమ్మకం ఉండవచ్చు. పిల్లలు చెప్పేది ప్రశాంతంగా వినండి. 

కుంభం
ప్రేమికులకు మంచి రోజు . స్నేహితుడిని కలుస్తారు. టెన్షన్ తగ్గుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సమాజంలో మీ హోదా పెరుగుతుంది.

మీనం
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు రోజు చాలా మంచిది. మీరు పెండింగ్‌లో ఉన్న చెల్లింపును తిరిగి పొందవచ్చు. ఈరోజు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. పెద్దల సలహాలు పాటించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Published at : 15 Jun 2022 05:17 AM (IST) Tags: Horoscope Today 2022 Aaj Ka Rashifal Rasi Phalalu Today 15th June 2022

సంబంధిత కథనాలు

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు