అన్వేషించండి

Weekly Horoscope Predictions June 13th to 19th: ఈ వారం ఈ రాశులవారు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Weekly Horoscope :ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

వార ఫలాలు (Weekly Horoscope Predictions June 13th to 19th)

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం)
మేష రాశివారికి ఈ వారం శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. తలపెట్టిన పనులు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తిచేస్తారు. స్నేహితులు,సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. అపోహలకు తావివ్వకండి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో ఊహించని వివాదాలు ఉండొచ్చు. నిరుద్యోగులు అవకాశాల కోసం చాలా కష్టపడాలి. 

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాలు)
వృషభ రాశివారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. చేసే పనిలో నైపుణ్యత ఉండేలా చూసుకోండి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి.  అవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.  స్నేహితులను కలుస్తారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేసేవారుంటారు జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు శుభసమయం. 

Also Read:  జూన్ 15 నుంచి రాశిమారనున్న సూర్యుడు, ఈ రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలే

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)
మిథున రాశివారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. చేపట్టిన పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎలాగైనా పూర్తిచేయగల సామర్థ్యం మీ సొంతం. ఇంట్లో వాతావరణం మాత్రం కాస్త గందరగోళంగా ఉంటుంది. పొట్టకు సంబంధించిన ఇబ్బదులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వివాదాలకు అస్సలు అవకాశం ఇవ్వకండి.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ వారం మీకు అదృష్టం కలిసొస్తుంది. అవసరానికి ధనం చేతికందుతుంది. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగిపోతాయి. నూతన వాహనం, ఇల్లు కొనుగోలు చేసే యోగం ఉంది. విద్యార్థులు, వ్యాపారులకు శుభసమయం. మీ మాటకున్న విలువను కాపాడుకోండి. పెద్దల సలహాలు పాటించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Also Read: శని తిరోగమనం ఈ రాశులవారికి సంపద, సంతోషాన్నిస్తుంది

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం)
 సింహ రాశివారికి  ఈ వారం అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు.  ఆర్థికంగా కలిసొచ్చే కాలం ఇది.మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. 

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
ఈ వారం కన్యారాశివారు అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలవైపు దృష్టి మళ్లుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చెప్పుడు మాటలు విని అయినవారిని విస్మరిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు లాభపడతారు. ఈ వారం అదృష్టం బాగానే ఉంది.మీ మనోబలమే మీకు రక్ష.

Also Read:  శని తిరోగమనం, ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget