Surya Rashi Parivartan 2022 : జూన్ 15 నుంచి రాశిమారనున్న సూర్యుడు, ఈ రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలే
Surya Rashi Parivartan 2022: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సూర్యుడు
నెలకో రాశిలో సంచరించే సూర్యుడు జూన్ 15 నుంచి మిథున రాశిలోకి మారనున్నాడు. జూన్ 15 బుధవారం ఉదయం 11:58కి సూర్యభగవానుడు వృషభ రాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. జూలై 16 వరకు ఇదే స్థానంలో ఉంటాడు. అయితే అన్ని గ్రహాల్లా సూర్యుడి సంచారం కూడా కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలనిస్తే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలనిస్తుంది, ఇంకొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలనిస్తుంది. అయితే అనుకూల, మిశ్రమ ఫలితాలు పొందే రాశులేంటో చూద్దాం
మేషం
మిథున రాశిలో సూర్య సంచారం వల్ల మేష రాశి వారిపై మిశ్రమ ప్రభావం పడుతుంది. ఈ సమయంలో భారీగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన విరమించుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో పెద్దగా మార్పులుండవు కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలుంటాయి. కోపం తగ్గించుకోకుంటే చాలా నష్టపోతారు.ఈ సమయంలో అప్పులు తీసుకోవడం, ఇవ్వడం రెండూ శ్రేయస్కరం కాదు.
వృషభం
సూర్యభగవానుడు మిథునరాశిలో ప్రవేశం మీకు కలిసొస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఇన్నాళ్లు వెంటాడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలొస్తాయి. విద్యార్థులకు శుభసమయం.
సింహం
సూర్యుని రాశి మార్పు సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో పెట్టుబడి ప్రయోజనాలను పొందుతారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అంతా మంచే జరుగుతుంది.
Also Read: శని తిరోగమనం ఈ రాశులవారికి సంపద, సంతోషాన్నిస్తుంది
Also Read: శని తిరోగమనం, ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి
కన్య
మిథునంలో సూర్య సంచారం కన్యా రాశి వారికి కూడా బావుంటుంది. కెరీర్ పరంగా సక్సెస్ అవుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు పై అధికారుల మద్దతు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది.
మీనం
మిథునంలో సూర్యుడి సంచారం మీనరాశివారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోపోవడమే మంచిది. తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం, ఉద్యోగం, చేసే పని ఏదైనా చిన్నపాటి అజాగ్రత్త వల్ల కూడా భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి.
Also Read: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది
Also Read: జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు