అన్వేషించండి

June 2022 Horoscope: జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు

June 2022 Horoscope: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

మేషరాశి ( Aries)
మేషరాశివారికి జూన్ నెల గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం కొంత పర్వాలేదు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. ఎంతో కష్టపడితే కానీ ఫలితం అందుకోలేరు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. వ్యాపారాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు అవసరమైన వ్యూహాలు అమలు చేయాల్సిందే. విదేశాలకు వెళ్లాలనుకునే యువతకు ఇది మంచిసమయం. మీ ఆలోచనలు,తీరు వల్ల కుటుంబంలో కొందరు బాధపడతారు. భయాందోళన చెందే సంఘటనలు జరగొచ్చు.

మిథున రాశి (GEMINI)
గడిచిన రెండు నెలలతో పోలిస్తే జూన్ నెల మిథునరాశివారికి బావుంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. జూన్ 17 తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు, స్టేషనరీ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో అనవసర వివాదాల జోలికి వెళ్లకండి. ఈ నెలలో మరింత శక్తి, సామర్థ్యాలతో పనిచేస్తారు. కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. భార్యభర్త మధ్య మాట పట్టింపులుంటాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

Also Read: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది

కన్య రాశి (Virgo)
ఈ రాశి వారికి  జూన్ నెలలో కూడా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కష్టపడితే మాత్రమే ఫలితాలు అందుకుంటారు. చేయు వృత్తి, వ్యాపారాలు అంత బాగా ఉండవు. అవమానకర సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.కుటుంబ సభ్యులతో అనవసర తగాదాలుంటాయి. అకాల భోజనం చేస్తారు.శరీర శ్రమ పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడొద్దు.  

తులా రాశి (Libra)
తులా రాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయానికి లోటుండదు. శారీరక శ్రమ తప్పదు. కొన్ని సమస్యల వలన మనోవేదనకు గురిఅవుతారు. స్త్రీ మూలక ఇబ్బందులు తప్పవు. కొన్ని పనులు చాలా సులభంగా పూర్తిచేయగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది. నెలారంభంలో కాస్త ఓపిక అవసరం. ఆ తర్వాత ప్లానింగ్‌ ప్రకారం ముందుకెళ్లాలి. ఆహారం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. అనారోగ్యంతో బాధపడిన వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. గర్భిణులు జాగ్రత్త. 

Also Read:   మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా

మకర రాశి (Capricorn) 
మకరరాశివారికి ఈ నెలలో కూడా మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారం బాగా సాగినా కుటుంబంలో సమస్యలు వెంటాడతాయి. ఆరోగ్యం బావుంటుంది. బంధువులతో వివాదాలుంటాయి. ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ కొత్త సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో చికాకులుంటాయి, అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. తోబుట్టువుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి.

మీన రాశి (Pisces) 
మీన రాశివారికి జూన్ నెలలో గ్రహ సంచారం మిశ్రమంగా ఉంది. చేసే వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. సృజనాత్మక పనులపై దృష్టి సారిస్తే లాభదాయకంగా ఉంటుంది. కార్యాలయంలో మీరిచ్చే సలహాలు, సూచనలకు ప్రాధాన్యత లభిస్తుంది. జూన్ నెలలో మొదటి 15 రోజులూ ఒడిదొడుకులు తప్పవ్. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఉంటుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. 

Also Read:   ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget