News
News
వీడియోలు ఆటలు
X

June 2022 Horoscope: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది

June 2022 Horoscope: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

FOLLOW US: 
Share:

జూన్ నెల రాశిఫలాలు (June 2022 Horoscope )

వృషభ రాశి (Taurus)
వృషభ రాశివారికి ఈనెల చాలా బావుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శుభసమయం. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తిచేసేందుకు ఈ నెల రోజులూ మంచి సమయం అనే చెప్పాలి. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయానికి లోటుండదు. మీ ప్రియమైనవారితో మనస్ఫర్థలు తలెత్తవచ్చు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. 

కర్కాటక రాశి (Cancer) 
ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని విధాలుగా బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ధనం చేతికందుతుంది. వ్యవహారాలు కలిసొస్తాయి.ఈ రాశికి చెందిన పలువురు ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో సీనియర్ల అనుభవాలను పరిగణలోకి తీసుకోండి.కష్టపడే తత్వం నుంచి వెనకడుగు వేయవద్దు. నెల ప్రారంభంలో అనవసరమైన ఆందోళనలు ఇబ్బంది పెడతాయి. పెద్దల ఆశీస్సువు మీపై ఉంటాయి. సంఘంలో ఉన్నత వ్యక్తులను కలుస్తారు. 

సింహ రాశి (LEO)
సింహ రాశి వారికి ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా ఉండడంతో చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలు, టెలికమ్యూనికేషన్, ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ప్రతివిషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

Also Read: ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!

వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశివారికి జూన్ నెల అనుకూలంగా ఉంటుంది. ఇంటా-బయటా సంతోషం ఉంటుంది. కార్యాలయంలో బాస్ ఆశీస్సులు లభిస్తాయి. సంతానం ద్వారా మంచి వార్తలు వింటారు. ఇనుము వ్యాపారులకు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. కోపం తగ్గించుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంట్లో సమస్యలు పెరిగితే కోర్టును ఆశ్రయించవద్దు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆరవ ఇంట శుక్రుడు ఉండడం వల్ల భార్యతో మాట పట్టింపులు వచ్చినా వెంటనే నివారణ అవుతాయి.

ధనుస్సు రాశి (Sagittarius)  
ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సరైన సమయానికి ధనం చేతికందుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి.చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ధనస్సు రాశివారికి కూడా ఆరవ ఇంట శుక్రుడు ఉండడం వల్ల భార్యతో వివాదాలున్నప్పటికీ సమసిపోతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం మనస్సుకి ప్రశాంతతను ఇస్తుంది. పిల్ల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. గర్భిణిలు ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారికి ఈ నెలలో గ్రహసంచారం బావుంది. వృత్తి వ్యాపారాల్లో అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. కొన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. తలపెట్టిన పనిని ఎలాగైనా పూర్తిచేయ సామర్థ్యం ఉంటుంది. ఇతరుల పనులు పూర్తిచేసేందుకు కూడా సహకారం ఇందిస్తారు. విద్యార్థులు చదువుపై ఫోకస్ పెంచాలి. కొన్ని పనుల్లో గందరగోళం అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. 

Also Read: ఈ వారం ఈ మూడు రాశులవారికి డబ్బే డబ్బు, ఆ రాశి డయాబెటిక్ రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Also Read: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Published at : 01 Jun 2022 08:37 AM (IST) Tags: Monthly Horoscope rasi phalalu June 2022 Astrology June 2022 Horoscope Horoscope Predictions June 2022

సంబంధిత కథనాలు

Saptamatrika: స‌ప్త‌ మాతృక‌లు ఎవరు? వారి లక్షణాలు ఏమిటి?

Saptamatrika: స‌ప్త‌ మాతృక‌లు ఎవరు? వారి లక్షణాలు ఏమిటి?

ఆఫీసు డెస్క్ మీద ఇవి పెట్టుకుంటే మీ కెరీర్ పీక్స్‌లో ఉంటుంది

ఆఫీసు డెస్క్ మీద ఇవి పెట్టుకుంటే మీ కెరీర్ పీక్స్‌లో ఉంటుంది

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

Ramayana: రామాయణం ఎలా చదవాలో తెలుసా? చదివేటప్పుడు ఈ తప్పులు చేయకండి!

Ramayana: రామాయణం ఎలా చదవాలో తెలుసా? చదివేటప్పుడు ఈ తప్పులు చేయకండి!

Bhagavad Gita Quotes: భగవద్గీతలోని ఈ వాక్యాలు ప్రేమకు, కర్మకు ప్రతిరూపం..!

Bhagavad Gita Quotes: భగవద్గీతలోని ఈ వాక్యాలు ప్రేమకు, కర్మకు ప్రతిరూపం..!

టాప్ స్టోరీస్

నాడు చెరువులు నిండుకున్నాయి- నేడు నిండు కుండల్లా ఉన్నాయి: తెలంగాణ మంత్రులు

నాడు చెరువులు నిండుకున్నాయి- నేడు నిండు కుండల్లా ఉన్నాయి: తెలంగాణ మంత్రులు

Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం

Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం

Mumbai Murder: మహిళ బాడీని ముక్కలుగా నరికాడు, కుక్కర్‌లో ఉడికించాడు - ఒళ్లు జలదరించే దారుణం

Mumbai Murder: మహిళ బాడీని ముక్కలుగా నరికాడు, కుక్కర్‌లో ఉడికించాడు - ఒళ్లు జలదరించే దారుణం

The Kerala Story: కేరళ స్టోరీ సినిమా చూపించినా మారని మనసు, ముస్లిం యువకుడితో వెళ్లిపోయిన యువతి

The Kerala Story: కేరళ స్టోరీ సినిమా చూపించినా మారని మనసు, ముస్లిం యువకుడితో వెళ్లిపోయిన యువతి