Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
వైష్ణవులకు పూజ్యనీయమైన శ్రీరంగక్షేత్రం, శైవులకు ఇష్టమైన తంజావూర్ కావేరీ నదీతీరంలో కొలువై ఉన్నాయి. వీటితో పాటూ పార్వతీదేవి అవతారం అయిన నిముషాంబదేవి ఆలయం కూడా నదీ తీరంలోనే ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే
చల్లని చూపులతో దర్శనమిచ్చే నిమిషాంబాదేవి భక్తుల కోరికల్ని నిమిషంలో తీరుస్తుందనీ అందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ముఖ్యంగా పెళ్లికి సంబంధించి వచ్చే ఎలాంటి ఆంటకాలనైనా ఈ అమ్మవారిని దర్శించుకుని మొక్కుకున్నాక తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కర్ణాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం సమీపంలో గంజాం అనే ఊళ్లో కావేరీ నది ఒడ్డున కొలువైంది నిముషాంబదేవి.
పురాణ గాథ
పూర్వం ముక్తకుడు అనే రుషి ఉండేవారు. సాక్షాత్తూ శివుడి అంశంతో జన్మించిన ఆ రుషి...లోకకళ్యానార్థం యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగాన్ని చెడగొట్టేందుకు అసురులు ప్రయత్నించగా వారిని అడ్డుకోడం ముక్తకుడి వల్లకాలేదు. చివరకు ఆ ముని అగ్నికి ఆహుతి అయ్యేందుకు సిద్ధమయ్యాడట. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై అసురుల్ని వధించిందనీ ఆ సమయంలోనే రుషి అమ్మవారిని నిమిషాంబగా స్తుతించాడనీ అంటారు. ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది. 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అమ్మవారి ఆలయం పక్కనే శివునికి ఉపాలయం కూడా ఉంది. ఇక్కడి ఈశ్వరుని మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు.
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం
నిమిషాంబ దేవికి గాజులు, నిమ్మకాయలు , వస్త్రాలు సమర్పిస్తుంటారు భక్తులు. అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయ తీసుకువెళ్లి పూజాగదిలో ఉంచితే ఇంట్లో ఉన్న దృష్టశక్తులు తొలగి సకల శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా వివాహం కానివారు ఈ ఆలయం చుట్టూ ప్రదిక్షిణ చేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శించుకుంటే వెంటనే పెళ్లి సంబంధం కుదురుతుందని కూడా చెబుతారు.
బలిభోజనం ప్రత్యేకం
ఇక్కడ కనిపించే మరో విశేషం బలిభోజనం. నిత్యం కాకులకు ఆహారం అందిస్తారిక్కడ. గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించినప్పుడు, మండప పైకప్పు నుంచి వేలాడుతున్న ఒక భారీ కాంస్య గంట కనిపిస్తుంది. ఈ గంటను భక్తులు మోగించకూడదు. కాకులకు నైవేద్యంగా బలి భోజనాన్ని బలి పీఠంపై ఉంచిన తర్వాత ప్రధాన అర్చకుడు ప్రతిరోజూ నిర్ణీత సమయాల్లో దీనిని మోగిస్తారు. ఇక్కడ కనిపించే మరో విశేషం బలిభోజనం.
Also Read: విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకుంటే ఈ అమ్మవారిని ప్రార్థిస్తే దొరుకుతాయట
నిమిషాంబ దేవి అవతరించింది గంజాం ప్రదేశంలోనే అయినా దేశవ్యాప్తంగా పలుచోట్ల అమ్మవారికి ఆలయానలున్నాయి.
హైదరాబాద్ సమీపం బోడుప్పల్‌లోని కూడా ఓ ఆలయం ఉంది. భక్తివిశ్వాసాలతో అమ్మవారిని ప్రార్థిస్తే కోర్కెలు వెంటనే ఫలిస్తాయని అందుకే నిముషాంబదేవిగా కీర్తిస్తారని అంటారు.
Also Read: ఈ గుడిలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతుంది, మీకు ధైర్యం ఉందా