Saturn Retrograde 2022: శని తిరోగమనం ఈ రాశులవారికి సంపద, సంతోషాన్నిస్తుంది
Saturn Retrograde 2022: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
![Saturn Retrograde 2022: శని తిరోగమనం ఈ రాశులవారికి సంపద, సంతోషాన్నిస్తుంది Saturn Retrograde 2022,Saturn's decline brings wealth and happiness to these constellations Saturn Retrograde 2022: శని తిరోగమనం ఈ రాశులవారికి సంపద, సంతోషాన్నిస్తుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/11/d0e53e2cb29ec3f070f064f1dee4be57_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలు ఉంటే..మరికొందరికి ప్రతికూల ఫలితాలుంటాయి. జూన్ 5 నుంచి శని రివర్స్ దిశలో కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అతినెమ్మదిగా కదిలేగ్రహం శని. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిగ్రహం జూన్ 5నుంచి నెమ్మదిగా వ్యతిరేకదిశలో కదులుతూ జూలై 12న మకరరాశికి వస్తుంది. అక్టోబరు 23 వరకూ శని వక్రంలోనే ఉంటాడు. అయితే శని అంటే చెడు మాత్రమే చేస్తాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే శని వక్రదిశలో ఉన్నప్పుడు కూడా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలుంటాయి. ఆ రాశులేంటంటే...
కుంభరాశిలో శని తిరోగమనం ఈ రాశులకు మంచి రోజులొచ్చినట్టే
మేషం (Aries)
కుంభరాశిలో శని వక్రదిశలో ఉండడం వల్ల మేష రాశివారు మంచి ఫలితాలు పొందుతారు. దాదాపు ఈ ఐదునెలల కాలంలో అంటే శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది. మొన్నటి వరకూ వెంటాడిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
కన్య (Virgo)
శని తిరోగమనం కన్యా రాశి వారికి కలిసొస్తుంది. ఈ సమయంలో కుటుంబ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభసమయం. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది.
Also Read: శని తిరోగమనం, ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి
తుల (Libra)
ఈ రాశి వారికి శని తిరోగమనం వల్ల మిశ్రమ ఫలితాలున్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కలతలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు మాత్రం చదువుకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు (Sagittarius)
ఈ రాశి వారని వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి, వ్యాపారం విస్తరించాలి అనుకునేవారికి అక్టోబరు 23 వరకూ మంచి సమయం. ఈ సమయంలో నిర్వహించే ఆర్థిక లావాదేవీలు కూడా కలిసొస్తాయి.
కుంభం (Aquarius)
కుంభరాశిలో శనితిరోగమనం వల్ల ఈ రాశివారికి ధైర్యం పెరుగుతుంది. ఎంతటి కష్టాన్ని, సమస్యను అయినా అవలీలగా ఎదుర్కొంటారు. మీ కెరీర్ మునుపటి కన్నా జోరందుకుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. మీరు తలపెట్టిన పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
Also Read: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది
Also Read: జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)