అన్వేషించండి
Team India Meets PM Modi: ప్రధానితో భారత క్రికెటర్లు, పేరు పేరునా పలుకరించి ఫోటోలు దిగిన మోదీ
Team India Meets PM Modi: టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి విజయంతో సగర్వంగా దేశానికి భారత క్రికెటర్లు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ ప్రతీ క్రికెటర్‌ను ఆప్యాయంగా పలకరించారు.

ప్రధానితో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ (Photo Source: Twitter/@BCCI )
1/11

అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద స్టన్నింగ్ క్యాచ్ పట్టి అదరగొట్టాడు.
2/11

ఈ పొట్టి ప్రపంచ కప్ లో కుల్‌దీప్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. వరుసగా రెండు సూపర్-8 మ్యాచ్‌లలో అంచనాలకు అనుగుణంగా రాణించి వహ్వా అనిపించుకున్నాడు
3/11

మైదానంలో పాదరసంలా కదిలే చిరుత రవీంద్ర జడేజా... ఈ ప్రపంచ కప్ లో బాల్ తో విఫలమయినా బాట్ తో పర్వలేదనిపించాడు
4/11

ఫైనల్లో బాట్ తో దుమ్ముదులిపిన అక్షర్ పటేల్ కోహ్లీతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు
5/11

క్రికెట్ సారధితో... భారత రథ సారధి... టీ 20 ప్రపంచకప్ గెలిచి.. తన కెరీల్‌కో చివరి టీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌ను రోహిత్ శర్మ సార్థకం చేసుకున్నాడు. తన సారథ్యంలో భారత్‌కు ప్రపంచకప్ అందించాలన్న కలను సాకారం చేసుకున్నాడు. సారధిగా.. ఆటగాడిగా జట్టును సమర్థంగా ముందుకు నడిపించాడు.
6/11

టీ 20 ప్రపంచ కప్‌లో బంతితో, బ్యాట్‌తో అదరగొట్టాడు హార్దిక్ పాండ్య. పొట్టి కప్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. 8 మ్యాచ్‌ల్లో 7.64 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీసాడు
7/11

ప్రధానితో పంత్... ఈ ప్రపంచకప్‌లో రిషభ్ పంత్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ బాగానే రాణించాడు. మెరుపు కీపింగ్‌తో కొన్ని మంచి క్యాచ్‌లు అందుకుని భారత్ జగజ్జేతగా నిలవడానికి దోహదం చేశాడు.
8/11

ఆ క్యాచ్ అదిరిపోయిందయ్యా... టీ 20 ప్రపంచకప్ పైనల్లో చివరి ఓవర్లో అద్భుత క్యాచ్‌తో భారత్‌కు ప్రపంచకప్ అందించడంలో సూర్య కీలకపాత్ర పోషించాడు. క్యాచెస్ విన్నెస్ మ్యాచెస్ అని నిరూపించిన సూర్య భాయ్‌కు ఈ ప్రపంచకప్ చిరస్మరణీయం కానుంది.
9/11

నరేంద్రుడితో విరాట్... ఈ టీ 20 ప్రపంచకప్‌లో ఆది నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కింగ్ కోహ్లీ... అంతంలో మాత్రం పంతం చూపాడు. కీలక ఇన్నింగ్స్‌తో కింగ్ కోహ్లీ గర్జన చేసిన వేళ... టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది.
10/11

భారత ప్రధానితో అర్ష్‌దీప్ సింగ్.. అర్ష్‌దీప్ టీ 20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో అద్భుత బౌలింగ్‌తో టీమిండియా జగజ్జేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
11/11

సకుటుంబ సమతేంగా.. కుమారుడు అంగద్, సతీమణి సంజనతో కలిసి ప్రధాని మోదీతో బుమ్రా.. ఈ ప్రపంచకప్‌లో బుమ్రా పేస్‌కు ప్రత్యర్థి బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఫైనల్లో బుమ్రా బౌలింగ్ ప్రదర్శన చాలా ఏళ్ల వరకు గుర్తుండిపోతుంది.
Published at : 04 Jul 2024 04:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
వరంగల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion