Ludhiana Gas Leak: ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్, 9 మంది మృతి - మరికొందరు కోమాలో
Ludhiana Gas Leak: పంజాబ్‌లోని లుధియానాలో గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో 9 మంది మృతి చెందారు.
Ludhiana Gas Leak Incident:
పంజాబ్‌లోని లుధియానాలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 11 మంది కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వాళ్లను దగ్గర్లోని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. NDRF సహా స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతకు ముందు 6గురు చనిపోయారని ధ్రువీకరించిన పోలీసులు...ఆ తరవాత మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.
#WATCH | Punjab: Nine dead, 11 hospitalised in an incident of gas leak in Giaspura area of Ludhiana. Visuals from the spot as local administration and medical team reach the spot.
— ANI (@ANI) April 30, 2023
Local officials say that the area has been cordoned off. pic.twitter.com/moDPTVG8XS
#WATCH | Punjab: NDRF personnel reach the spot in Giaspura area of Ludhiana where a gas leak claimed 9 lives; 11 others are hospitalised.
— ANI (@ANI) April 30, 2023
Local officials say that the area has been cordoned off. pic.twitter.com/BuxUEb8SCq
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఇది చాలా బాధాకరమని ట్వీట్ చేశారు. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
"గియాస్పురలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యి అంత మంది చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులతో పాటు ప్రభుత్వ అధికారులు, NDRF సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్నారు. అవసరమైన సాయం అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను"
- భగవంత్ మాన్, పంజాబ్ సీఎం
ਲੁਧਿਆਣਾ ਦੇ ਗਿਆਸਪੁਰਾ ਇਲਾਕੇ ਵਿੱਚ ਫ਼ੈਕਟਰੀ ਦੀ ਗੈਸ ਲੀਕ ਦੀ ਘਟਨਾ ਬੇਹੱਦ ਦੁੱਖਦਾਇਕ ਹੈ..ਪੁਲਿਸ, ਪੑਸ਼ਾਸਨ ਅਤੇ NDRF ਟੀਮਾਂ ਮੌਕੇ ‘ਤੇ ਮੌਜੂਦ ਹਨ ..ਹਰ ਸੰਭਵ ਮਦਦ ਪਹੁੰਚਾਈ ਜਾ ਰਹੀ ਹੈ..ਬਾਕੀ ਵੇਰਵੇ ਜਲਦੀ..
— Bhagwant Mann (@BhagwantMann) April 30, 2023