(Source: ECI/ABP News/ABP Majha)
AIADMK General Council Meet: అన్నాడీంకే సమావేశంలో రచ్చరచ్చ- పన్నీర్ సెల్వంపై బాటిళ్లతో దాడి!
AIADMK General Council Meet: తమిళనాడులో అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీనియర్ నేత పన్నీర్ సెల్వంపై పళనిస్వామి వర్గీయులు బాటిళ్లు విసిరారు.
AIADMK General Council Meet: తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈసారి ఏకంగా పార్టీ సమన్వయకర్త పన్నీర్ సెల్వంపైకి వాటర్ బాటిళ్లు విసిరారు మాజీ సీఎం పళనిస్వామి వర్గీయులు. పార్టీలో ఏక నాయకత్వం కావాలన్న డిమాండ్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
#WATCH | Tamil Nadu: Bottles hurled at AIADMK coordinator and former Deputy CM O Panneerselvam at the party's General Council Meeting today. The meeting took place at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram in Chennai.
— ANI (@ANI) June 23, 2022
He walked out halfway through the meeting. pic.twitter.com/lVb1AdvAGt
రచ్చరచ్చ
చెన్నైలోని శ్రీవారు వెంకట చలపతి ప్యాలెస్‌లో గురువారం అన్నాడీఎంకే నేతల మధ్య కీలక సమవేశం జరిగింది. పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేశారు.
పళనిస్వామి, పన్నీర్ సెల్వంలలో ఒకరి నాయకత్వంలోనే పార్టీ నడవాలని నిర్ణయించడంతో ఎక్కువ మంది పళనిస్వామి వైపే మొగ్గు చూపారు. దీంతో సమావేశం మధ్యలోనే పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్ చేశారు.
#WATCH | Chennai, Tamil Nadu | Former Deputy Chief Minister O Panneerselvam walked out halfway through the AIADMK General Council meeting. Members of the General Assembly continued to raise slogans asking him to leave. pic.twitter.com/vTvOaCmSSd
— ANI (@ANI) June 23, 2022
అయితే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపునకు నీళ్ల సీసాలు విసిరారు. బయట పన్నీర్ సెల్వం కారు టైర్లో గాలి కూడా తీసేశారు. దీంతో మరోసారి జూలై 11న అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read: Maharashtra Political Crisis: మహా రాజకీయంలో మరో ట్విస్ట్- కూటమికి బైబై చెప్పేందుకు శివసేన రెడీ!