Moringa Leaves Benefits: రోజుకు 100 గ్రాముల మునగాకులు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Nutrition Warning: మునగ కాయలే కాదు మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు వంద గ్రాముల మునగాకులు తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుందట.
Nutrition Warning: మునగ ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. మునగను అన్ని వంటకాల్లో వినియోగిస్తుటారు. మునగ కాడలు, ఆకులు, కాయలు, పువ్వుల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి బి కాంప్లెక్స్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకు, కాయలు, పువ్వులతో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. అంతేకాదు మునగ టీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మునగ పోషకాల పవర్ హౌజ్.
మునగలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. మునగాకుల్లోనూ యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వాతావరణంలో ఉండే ఫ్రీ రాడికల్స్.. హానికరమైన ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. 100 గ్రాముల మునగ ఆకులను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
మునగలో ఉండే పోషకాలు :
కేలరీలు: 64 కిలో కేలరీలు
– కార్బోహైడ్రేట్లు: 8.28 గ్రాములు
– ఫైబర్: 2.0 గ్రాములు
– చక్కెరలు: 0.66 గ్రాములు
– ప్రోటీన్: 9.40 గ్రాములు
– కొవ్వు: 1.40 గ్రాములు
– విటమిన్ C
– విటమిన్ A
– విటమిన్ K
– విటమిన్ B-కాంప్లెక్స్ (B1, B2, B3, B5)
– కాల్షియం
– భాస్వరం
– ఐరన్
– పొటాషియం
– మెగ్నీషియం
– కాపర్
– మాంగనీస్
యాంటీ ఆక్సిడెంట్లు:
మునగాకులో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, బీటా కెరోటిన్ వంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మునగాకు ప్రయోజనాలు ఇవే:
రోగనిరోధక శక్తి :
మునగ ఆకులలో విటమిన్ సితోపాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక పనితీరును పెంపొందిస్తాయి. అంతేకాదు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.
జీర్ణ ఆరోగ్యం:
మునగ ఆకుల్లో ఫైబర్ కంటెంట్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కంటి ఆరోగ్యం :
మునగ ఆకులలో ఉండే విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
జ్ఞాపకశక్తి, మెదడు ఆరోగ్యం :
మునగ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు అభిజ్ఞా పనితీరుకు మేలు చేస్తాయి. న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉంటుంది.
కాలేయ ఆరోగ్యం :
కొన్ని అధ్యయనాలు మునగ ఆకులు మెరుగైన కాలేయ పనితీరుకు దోహదపడతాయని, కాలేయ వ్యాధుల నుంచి కాపాడుతుందని సూచిస్తున్నాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు మునగ ఆకులను తినవచ్చా?
మునగ ఆకులలో తక్కువ-గ్లైసెమిక్ స్వభావం ఉంటుంది. అంతేకాదు ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ కంటెంట్ షుగర్ పేషంట్లకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. మునగ ఆకుల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మునగ ఆకులను ఆహారంలో చేర్చుకోవచ్చు.
గర్బిణీ స్త్రీలకు మునగ మేలు చేస్తుందా?
మునగ ఆకులు గర్బిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ A, విటమిన్ C, ఐరన్ వంటి పోషకాలు గర్బిణీలకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే అధిక మోతాదులో కాకుండా మితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ విషయాలు గుర్తుంచుకోవాలి:
- అలెర్జీ సమస్యలు ఉన్నవారు మునగ తినకపోవడమే మంచిది.
- మునగ ఆకులలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి.
- మోతాదుకు మించి తింటే జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.
అపోహలు, వాస్తవాలు:
అపోహ: మునగ ఆకులు మధుమేహాన్ని నయం చేయగలవు.
వాస్తవం: డయాబెటిక్ డైట్‌కు మునగ ఆకులు ప్రయోజనకరమైన అదనంగా ఉంటాయి. అవి మధుమేహాన్ని నయం చేయలేవు.
అపోహ 2: మునగ ఆకులు క్యాన్సర్‌ను నివారించగలవు లేదా నయం చేయగలవు .
వాస్తవం: మునగ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి, అయితే అవి స్వయంగా క్యాన్సర్‌ను నిరోధించలేవు
Also Read : స్టామినాను పెంచుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.