Powerlifting Guide : సెలబ్రెటీలు పవర్‌లిఫ్టింగ్ చేసేది ఇందుకే.. బెనిఫిట్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Powerlifting Routine : పవర్ లిఫ్టింగ్‌తో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అయితే దీనిని ఎలా ప్రారంభించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెల్త్‌కి కలిగే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం.
Powerlifting Fitness : వ్యాయామం రెగ్యూలర్‌గా చేయడం ఆరోగ్యానికి మంచిదే. అయితే వ్యాయామం చేయడంలో వివిధ రకాలు ఉంటాయి. కార్డియో, హెచ్ఐఐటీ వంటివి మొదలైనవి ఎన్నో ఉంటాయి. వాటిలో పవర్‌లిఫ్టింగ్ కూడా ఒకటి. ఇది పూర్తి ఆరోగ్యానికి మంచిది. అందుకే సెలబ్రెటీలు ఎక్కువగా పవర్‌లిఫ్టింగ్ చేస్తారు. ఇది మిమ్మల్ని కూడా ఫిట్‌గా ఉంచి.. శారీరకంగా, మానసికంగా కూడా హెల్తీగా ఉండేలా చేస్తుంది. అయితే పవర్ లిఫ్టింగ్ ఎలా చేయాలి? ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి? వర్క్అవుట్ రోటీన్ ఎలా ఉండాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శారీరక ప్రయోజనాలు
స్ట్రెంత్ పెరుగుతుంది. కండరాలు స్ట్రాంగ్‌గా మారుతాయి. స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ చేసేవారికి బలం చాలా ఉంటుంది. వయసు పెరిగేకొద్ది కండరాలు తగ్గిపోతూ ఉంటాయి అంటారు కదా.. కానీ పవర్‌లిఫ్టింగ్ చేయడంవల్ల కండరాలకు బలం అందుతుంది. బోన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. కండరాలకు బలం అందుతుంది. కీళ్ల నొప్పులు దూరమవుతాయి. శరీరంలో కొవ్వు తగ్గి.. కండరాలకు మంచి శక్తి అందుతుంది. పూర్తి ఆరోగ్యాన్ని హెల్తీగా మార్చేస్తుంది.
మానసిక ప్రయోజనాలు..
వర్లిఫ్టింగ్ వల్ల మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. చేసే పనుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒత్తిడి, యాంగ్జైటీ దూరమవుతుంది. పరిస్థితులకు భయపడే స్వభావం ఉన్నవారిలో ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. పనిపై ఫోకస్ పెరుగుతుంది. మానసికంగా కృంగిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటారు.
ఆరోగ్య ప్రయోజనాలు
ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. షుగర్ సమస్యలు ఉన్నవారికి మంచి ఫలితాలుంటాయి. మెటబాలీజం పెరుగుతుంది. దీనివల్ల మీరు యాక్టివ్‌గా ఉంటారు. శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మంచి నిద్రను అందిస్తుంది. క్వాలిటీ స్లీప్ మీ సొంతమవుతుంది. కండరాలకు శక్తి అందుతుంది.
పవర్‌లిఫ్టింగ్ ప్రారంభించాలనుకుంటే..
పవర్‌లిఫ్టింగ్ మీరు ప్రాంభించాలనుకుంటే కచ్చితంగా కోచ్ లేదా ట్రైనర్ సమక్షంలోనే చేయాలి. పవర్‌లిఫ్టింగ్ అనేది ఇంట్లో ప్రారంభించేది కాదని గుర్తించుకోవాలి. సరైనవిధంగా చేయకుంటే పరిస్థితులు మారిపోయే ప్రమాదముంది. సరైన విధానంలో.. సరైన టెక్నిక్స్‌తో దీనిని ప్రారంభించాలి. బరువులు ఒకేసారి ఎత్తడం కాకుండా.. నిధానంగా బరువులు పెంచుకుంటూ వెళ్లాలి.
ఎలా చేయాలంటే..
ముందుగా వార్మ్అప్ చేయాలి. 5 నుంచి పది నిమిషాలు చేసిన తర్వాత స్క్వాట్స్ చేయాలి. మూడు సెట్లు 5 సార్లు రిపీట్ చేస్తే మంచిది. లెగ్ ప్రెస్, లౌంజేస్, లెగ్ ఎక్స్టెన్షన్స్ చేయాలి. తర్వాత స్ట్రెచ్చింగ్ చేయాలి. ప్రతి ఎక్స్ర్సైజ్కి మధ్యలో గ్యాప్, వార్మఅప్ కచ్చితంగా ఉండాలి. ఇవి కండరాలు రిలాక్స్ అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి. గ్యాప్ తీసుకుని బెంచ్ బ్రెస్ చేయాలి. దానికి ముందు వార్మ్ అప్ చేయాలి. ప్రతి వ్యాయామాన్ని మూడు సెట్లు 5సార్లు చేస్తే మంచిది. డంబుల్ ప్రెస్, ట్రైసెప్ పుష్డౌన్స్ చేయాలి. మరో 5 నిమిషాలు స్ట్రెచ్ చేసుకోవాలి.
డెడ్ లిఫ్ట్స్ ఎలా చేయాలంటే..
వార్మ్ అప్ చేసి.. డెడ్ లిఫ్ట్‌ని 3 సెట్లు 5 సార్లు చేయాలి. అనంతరం రోమానైన్ డెడ్‌లిఫ్ట్స్ 3 సెట్లు 8 నుంచి 12 సార్లు రిపీట్ చేయాలి. లెగ్ కర్ల్స్, క్లాఫ్ రైజెస్ చేయాలి. అనంతరం స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వాలి. బరువులు ఓకేసారి పెంచకూడదు. రెండూ వారాలకు ఓసారి బరువును పెంచుకుంటూ వెళ్తే మంచిది. మీరు బరువును పెంచినా పర్లేదు అనుకున్నప్పుడు చేస్తే మంచిది. బరువును పెంచడంపై కాకుండా.. ఎక్కువసార్లు రిపీట్ చేయడంపై దృష్టి పెట్టండి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రాత్రులు 7 నుంచి 9 గంటలు కచ్చితంగా నిద్ర ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఇది కండరాల పెరుగుదలకు, రికవరీకి మంచిది. వ్యాయామాల మధ్య రెస్ట్ ఉండాలి. మీ శరీరం చెప్పే మాట వినాలి. దానిని ఓవర్‌గా స్ట్రెస్ చేయకుండా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి.
Also Read : ఎంత ట్రై చేసిన పనిని త్వరగా కంప్లీట్ చేయలేకపోతున్నారా? ఆన్‌టైమ్‌లో వర్క్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే