అన్వేషించండి

Green Field Airport: భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి

New Airport: భద్రాచలం-కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు సుముఖంగా ఉంది. భూసేకరణ, ఇతరత్ర అంశాలపై తెలంగాణ నుంచే ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్రమంత్రి అన్నారు.

Kothagudem Airport: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తెలంగాణ(Telangana)కు ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా పెంచినట్లు  కేంద్రమంత్రులు వెల్లడించారు.తెలంగాణ ప్రభుత్వం కోరిన అన్ని ప్రతిపాదనలకు దాదాపు ఆమోదం తెలిపినట్లు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం(Airport)పై ఇప్పటికే ప్రీ ఫిజిబిలిటీ స్టడీ సైతం పూర్తయ్యిందన్న కేంద్రం..రైల్వే బడ్జెట్‌లోనూ భారీగా కేటాంపులు చేసినట్లు  వెల్లడించింది.

భద్రాచలంలో  కొత్త విమానాశ్రయం 
తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు  భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు  పౌరవిమానయానశాఖ  సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ తెలిపారు.ఈ మేరకు జనవరిలోనే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)  ప్రీ ఫీజిబిలిటీ స్టడీ సైతం నిర్వహించిందని ఆయన తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అయితే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పాలసీ ప్రకారం అటు తెలంగాణ(Telangana) ప్రభుత్వం గానీ, ఎయిర్‌పోర్టు డెవలపర్‌ నుంచి గానీ  భూసేకరణకు  సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి  ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు  రాలేదన్నారు.

గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టు(Greanfield Airport) నిబంధనల ప్రకారం భూసేకరణ, పునరావాసం,నిధుల సమీకరణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం గానీ,ఎయిర్‌పోర్టు డెవలపర్‌ గానీ వహించాల్సి ఉంటుంది. భూసేకరణ, అనుమతుల లభ్యత,ఆర్థిక అంశాలపై ఆధారపడే  విమానాశ్రయం నిర్మాణం ఉంటుందని  కేంద్రమంత్రి వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే భద్రాచలం-కొత్తగూడెంలో  కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నా...రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఎలాంటి కదలిక లేనట్లు ఆయన వెల్లడించారు. 

రైల్వే కేటాయింపులు
కేంద్ర బడ్జెట్‌లో  రైల్వేశాఖ(Railways)కు  సంబంధించి తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయింపులు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన దానికన్నా ఇది 6 రెట్లు అధికమని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Aswani vishnaw) వెల్లడించారు. యూపీఏ(UPA) హయాంలో ఏడాదికి రూ.886 కోట్లు మాత్రమే కేటాయించినట్లు ఆయన వివరించారు. తెలంగాణలో  ఈ దశాబ్ద కాలంలో వివిధ రైల్వే ప్రాజెక్ట్‌లకు  రూ.41,677కోట్లు ఖర్చు చేసినట్లు  వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు  తెలంగాణలో 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాకులను ఏర్పాటు చేశామన్నారు.  అలాగే విద్యుద్దీకరణ వందశాతం పూర్తయ్యిందన్నారు.

తెలంగాణ చిరకాల వాంఛ అయినటువంటి కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సైతం  ఎన్డీఏ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తుచేసిన కేంద్రమంత్రి...దీన్ని మల్టీపర్పస్‌ రైల్వే ప్రొడక్షన్ యూనిట్‌గా  అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌ను రూ. 327 కోట్లతో, సికింద్రాబాద్‌(Secunderabad) రైల్వే స్టేషన్‌ను రూ.715 కోట్లతో ఆధునీకస్తున్నట్లు  అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. అలాగే తెలంగాణలో ఇప్పటి వరకు 1,326 కిలోమీటర్ల మేర కవచ్‌ సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని...మరో వెయ్యి కిలోమీటర్లు ఏర్పాటు చేస్తే సరిపోతుందన్నారు. 

హైదరాబాద్‌- విజయవాడకు నమోభారత్‌
తెలంగాణకు తొలి దశలోనే  వందే భారత్‌ రైలు కేటాయించినట్లు గుర్తు చేసిన అశ్వనీ వైష్ణవ్‌...వాటిని 5కు పెంచామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రైళ్లు కేటాయిస్తామని తెలిపారు. అలాగే తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లను అమృత్‌భారత్‌(Amruth Bharath) పథకం కింద ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో హైదరాబాద్‌-విజయవాడ మధ్య నమో భారత్‌ (Namo Bharath)రైళ్లు నడపనున్నట్లు వివరించారు. 

ఏపీకి భారీగా  కేటాయింపులు
తెలంగాణతో పోల్చితే ఏపీకీ భారీగా కేటాయింపులు పెరిగాయి.రూ.9,417 కోట్లు రైల్వేకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. యూపీఏ ప్రభుత్వం  కేటాయింపులతో పోల్చితే ఇది  11 రెట్లు ఎక్కువ. 

 

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget