అన్వేషించండి

Indian Migrants: భారత్‌కు ట్రంప్ సెగ, వలసదారులతో ఢిల్లీకి బయలుదేరిన విమానం!

Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అక్కడ ఉంటున్న భారత వలసదారులను విమానంలో తరలిస్తోంది.

US Military Plane Departs With Indian Migrants | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేశారు. ఇదివరకే బైడెన్ ప్రభుత్వం జీవోలను రద్దు చేసిన ట్రంప్.. విదేశీ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల బహిష్కరణకు శ్రీకారం చుట్టారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వారి దేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌కు సైతం ట్రంప్ షాకిచ్చారు. మన దేశానికి చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం అమెరికా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. 

భారత్‌కు బయలుదేరిన విమానం

సీ17 ఎయిర్‌క్రాఫ్ట్‌లో అమెరికా నుంచి అక్రమవలసదారులను భారత్‌కు తిరిగి పంపిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. బయలుదేరిన 24 గంటల్లో ఈ విమానం భారత్‌కు చేరుకోనుంది. అయితే ఎంత మందిని అందులో తరలించారనేది తెలియాల్సి ఉంది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ నినదించారు. విదేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వారి కంటే అమెరికా పౌరులకే తన ప్రాధాన్యమని నడుచుకున్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అక్రమవలసదారులపై ఉక్కుపాదం మోపారు. 

జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
ఇదివరకే 538 మందిని అక్రమ వలసదారులను వారి దేశాలకు తరలించారు. తాజాగా టెక్సాస్‌, శాన్‌ డియాగో, ఎల్‌ పాసో, కాలిఫోర్నియాలో నివాసం  ఉంటున్న మరో 5,000 మంది అక్రమ వలసదారులను గుర్తించిన అమెరికా అధికారులు వారిని స్వదేశాలకు పంపేందుకు చర్యలు చేపట్టింది. ఇదివరకే 6 విమానాలలో అక్రమ వలసదారులను లాటిన్ అమెరికాకు  తరలించారు. సీ17 కార్గో విమానాలలో అక్రమ వలసదారులను వారి దేశాలను తిరిగి పంపిచేస్తున్నారు.  అమెరికా చరిత్రలో తొలిసారి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ తెలిపారు. విదేశాల నుంచి అక్రమంగా వచ్చి అమెరికాలో ఉండటంతో దేశ పౌరులపై ప్రభావం చూపుతుందన్నారు. అమెరికన్లకే ఉద్యోగాలు, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ ముందుకెళ్తున్నారు.

భారత్‌కు చెందిన 7,25,000 మంది వలసదారులు సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. వీరిలో 18 వేల మందిని భారత్‌కు తరలించేందుకు ట్రంప్ ప్రభుత్వం జాబితా రెడీ చేసింది. అక్రమ వలసదారులతో అమెరికాకు తీవ్ర నష్టమని, నేరాలకు అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. అధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. వీసా గడువు ముగిసిన వారైన, లేక సరైన డాక్యుమెంట్ పేపర్స్ లేనివారు, సంబంధిత వ్యక్తులను అక్రమ వలసదారులుగా అమెరికా గుర్తిస్తోంది. అమెరికా నుంచి తిరిగి రావడానికి ఇబ్బంది పడుతున్న వారికి, అమెరికాలో ఉంటున్న వారికి సైతం తాము అండగా ఉంటామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. 

కెనడా, మెక్సికోకు స్వల్ప ఊరట
మెక్సికో, కెనడాలపై విధించిన 25 శాతం సుంకాల అమలు నిర్ణయాన్ని నెలరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మెక్సికో, కెనడా దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని, అక్రమ వలసలు లేకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ట్రంప్‌ కాస్త తగ్గారు. మత్తు పదార్థాలు, మనుషులు గానీ అమెరికాలోకి అక్రమంగా వచ్చారని తెలిస్తే కఠిన ఆంక్షలు, టారిఫ్ లు విధిస్తామని కెనడా, మెక్సికోలను ట్రంప్ హెచ్చరించారు.

Also Read: Panama Canal: పనామా కెనాల్​ను స్వాధీనం చేసుకోనున్న అమెరికా!.. ట్రంప్​ కీలక వ్యాఖ్యలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget