BC Reservation: బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
బిసిలు కేంద్రంగా పొలిటిక్ హీట్ ఓ రేంజ్ లో నడుస్తోంది.తాజాగా కలగణన సర్వే ఆధారంగా బిసిలకు రిజర్వేషన్లు ఇవ్వడమేకాదు, అవసరమైతే ఇంకా ఎక్కువే ఇస్తామంటూ రేవంత్ వ్యాఖ్యల వెనుక పొలిటికల్ వ్వూహం ఏంటి..

నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉత్కంఠగా మారింది. కులగణన సర్వే నివేదిక, బిసి రిజర్వేషన్లపై సిఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై ఆశక్తి నెలకొంది. తెలంగాణలో జనాభా ప్రతిపధికన చూస్తే బిసి కులాలు ఎక్కవే. అయితే మిగతా కులాలకు ప్రధాన్యత ఇస్తూనే బిసి రిజర్వేన్లు అమలు చేయడం ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు. అవన్నీ ఎదుర్కొనేందుకు సిద్దమైనట్లు ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి , మంత్రుల సమావేశంలో మాట్లడుతున్న తీరు చూస్తుంటే స్పష్టంగా అర్దమవుతోంది. మరి ఈరోజు చేయబోతున్న ప్రకటనతో బిసిలను మొప్పిస్తారా, లేక నొప్పిస్తారా అనేది కీలకంగా మారింది. కులగణన సర్వే ఆధారంగా చూస్తే తెలంగాణ జనభాలో 42శాతం బిసి కులాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు అనే నినాదంతో దేశంలో రాహుల్ చేస్తున్న ప్రకటనలను రేవంత్ రెడ్డి తెలంగాణలో మొదటిసారి అమలు చేసే అవకాాశాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్ష బిఆర్ ఎస్ మాత్రం కులగణన సర్వే ఓ కాకిలెక్కలు అని కొట్టిపారేస్తోంది. బిసి సంఘాలు మాత్రం 50శాతం పైగా బిసిలు ఉంటే లెక్కల్లో తప్పులు చూపుతున్నారన్నట్లు విమర్శులు చేస్తున్నాయి.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం?
''ఇప్పటికే కులగణన నివేదిక పూర్తయింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా బీసీ రిజర్వేషన్లపై రిపోర్ట్ రెడీ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో మనం హామీ ఇచ్చాం. వార్డులు, పంచాయతీల వారీగా బీసీ రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్కమిషన్ సిఫార్సులు చేస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు అమలు చేద్దాం'' అని మంత్రులతో సీఎం రేవంత్రెడ్డి అన్నట్టు తెలిసింది. అయితే బీసీ రిజర్వేషన్లు 42 శాతం గానీ, బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినంత గానీ అమలు చేస్తే.. న్యాయపరంగా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? అని ఇప్పటికే చర్చించిన నేతలు, ''ఒకవేళ బీసీలకు ప్రభుత్వ పరంగా స్థానిక సంస్థల్లో గానీ, విద్య, ఉద్యోగాల పరంగా గానీ రిజర్వేషన్లు అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంది. ముందు అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేద్దాం. ఒకవేళ ఎలాంటి ఇబ్బంది లేకపోతే యథావిధిగా ముందుకు వెళ్దాం. ఏమైనా సమస్యలు వస్తే బీసీ డెడికేటెడ్కమిషన్ఎక్కడెక్కడా బీసీ రిజర్వేషన్లకు సిఫార్సులు చేస్తుందో.. ఆయా వార్డులు, పంచాయతీల వారీగా పార్టీ పరంగా బీసీ అభ్యర్థులను నిలబెడదాం. ఇదే పార్టీ నిర్ణయం అనే వ్యూహంతో స్దానిక సంస్దల ఎన్నికల్లో బిసి రిజర్వేన్లే ఆయుధంగా రేవంత్ సిద్దమైనట్లు సమాచారం.
ఈ రోజు అసెంబ్లీలో ప్రకటన
ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు,క్యాడర్ లోకి సందేశాన్ని బలంగా తీసుకెళ్లారు. అవసరమైతే దీనిపై ఈ రోజు అసెంబ్లీలో ప్రకటన కూడా చేద్దామని సీఎం పేర్కొన్నట్టు ఓ మంత్రి తెలిపారు. మనం ఇస్తే ఇతర పార్టీల.. వాళ్లూ ఇవ్వాల్సిందే.. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తే... మిగతా పార్టీలు కూడా కచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నట్టు తెలిసింది. ఇతర పార్టీలు కూడా బీసీ నినాదం ఎత్తుకుంటాయని, కాంగ్రెస్ఇచ్చినట్టే బీసీలకు సీట్లు కేటాయిస్తాయని ఆయన పేర్కొన్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే దేశంలోనే మొదటిసారి బీసీలకు తగిన స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుందని సీఎం వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చి, అమలు చేసిన ఘనత కాంగ్రెస్పార్టీకే దక్కాలని.. ఆ దిశగా ప్రచారం చేయాలని ఇప్పటికికే మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రభుత్వం తరపున రిజర్వేషన్లు అమలు చేస్తే వచ్చే న్యాయపరమైన చిక్కులకు సంబంధించి ప్రత్యేక లీగల్టీమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అమలు, రిజర్వేషన్లు 50 శాతం క్యాప్ దాటడంపై ఏజీ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఇలా రాజకీయంగా సరికొత్త వ్యూహంతో బిసి ఓట్లు టార్గెట్ గా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు.



















