Time Management : ఎంత ట్రై చేసిన పనిని త్వరగా కంప్లీట్ చేయలేకపోతున్నారా? ఆన్‌టైమ్‌లో వర్క్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Punctuality : కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా.. ఆ పనిని ఆన్ టైమ్ చేయలేరు. టైమ్ ఎంత ఉన్నా.. దానిని మేనేజ్ చేయడం రాకపోతే.. మీరు చేసే పని వృధానే అవుతుంది. మరి ఈ టైమ్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి?
Develop a punctuality mindset : సమయం పోతే మళ్లీ రాదు అంటారు. కానీ సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోతే.. ఎంత సమయం ఉన్నా దానిలో ప్రొడెక్టెవిటీ ఉండదు. చాలామంది ఫేస్ చేసే అత్యంత సాధారణ విషయాల్లో టైమ్ మేనేజ్మెంట్ ఒకటి. ముఖ్యంగా ఈ ఫోన్లు, సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యేకొద్ది.. చాలామందికి సమయం అస్సలు సరిపోవట్లేదు. అలా అని బిజీగా వర్క్ చేసి.. దాని వల్ల సమయం సరిపోవట్లేదా అంటే.. అది ఉండదు. మరి ఈ సమయం అంతా ఎటుపోతుంది? దానిని ఎలా మేనేజ్ చేసుకోవాలి?
సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మీరు ఎప్పుడూ ఆన్ టైమ్ ఉండలేరు. పైగా మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకునేందుకు కొన్ని రియాలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకోవాలి. మీరు చేసే పనికి.. ఎంత సమయం పడుతుందో గుర్తించుకోవాలి. దానికి తగ్గట్లు రెగ్యూలర్ పనులు షెడ్యూల్ చేసుకోవాలి. మీది రోటీన్ లైఫ్ అయితే.. వారానికి, నెలకి మీరు షెడ్యూల్ పెట్టుకోవచ్చు. అయితే ఇదే షెడ్యూల్‌కి టాస్క్‌లు కంప్లీట్ చేయలేకపోవచ్చు కాబట్టి.. టాస్క్‌కి మధ్యలో కాస్త సమయం ఉండేలా చూసుకోండి.
మార్నింగ్ రోటీన్ ఎలా ఉండాలంటే..
ఉదయాన్నే త్వరగా నిద్రలేస్తే కచ్చితంగా సమయం ఎక్కువ మిగులుతుంది. ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలంటే.. రాత్రుళ్లు త్వరగా పడుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే.. అలారం మోగగానే దానిని ఆపి.. మళ్లీ అలారమ్ సెట్ చేసుకుని పడుకుంటారు. ఇది అస్సలు మంచిదికాదు. అలారం మోగిన వెంటనే లేస్తే మంచిది. ఇలా ఉదయం లేచిన వెంటనే వర్క్ చేయమని కాదు.. మీ పర్సనల్ టైమ్ తీసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ముందురోజు రాత్రి.. మీరు నెక్స్ట్ డే వేసుకోవాల్సిన డ్రెస్‌లు, బ్యాగ్ సిద్ధం చేసుకుంటే.. మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుంది. అలాగే బ్రేక్‌ఫాస్ట్ ఏమి తీసుకోవాలో ముందే ఆలోచించుకుంటే.. ఉదయాన్నే దానిని ప్రిపేర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది.
టైమ్ మేనేజ్మెంట్..
మీరు రోజులో చేయాల్సిన అతిముఖ్యమైన టాస్క్ ఏంటో తెలుసుకోండి. దానిపై వర్క్ చేసేందుకు సమయాన్ని కేటాయించండి. అలాగే మీరు ఎప్పుడూ బ్రేక్ తీసుకోవాలి.. ఎప్పుడు టాస్క్ కంప్లీట్ చేయాలో తెలుసుకుని.. ఆ టైమింగ్స్‌కి స్టిక్ అవుతూ ఉంటే.. వర్క్ కంటిన్యూగా జరుగుతుంది. నో చెప్పడం తెలుసుకోండి. మీ పనులు మానేసి.. ఇతరుల పనులకు ఓకే చెప్పడం వల్ల మీ వర్క్ పెండింగ్‌లో పండుతుంది. మీ వర్క్ చేసిన తర్వాత సమయం ఉంటే.. ఇతరులకు హెల్ప్ చేయవచ్చు.
ప్రయాణం చేసేప్పుడు..
చాలామందికి సమయం వేస్ట్ అయ్యేది ఎప్పుడంటే ఆఫీస్‌కి వెళ్లేప్పుడు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి.. ఆ చిరాకుతో ఆఫీస్‌కి వెళ్లి.. టైమ్‌ని వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ట్రాఫిక్ ఎప్పుడూ ఉండదనే అంచనాకు వచ్చి.. మీరు వెళ్లాల్సిన రూట్‌ని ఫిక్స్ చేసుకోవాలి. ట్రాఫిక్‌లో చిక్కుకోకూడదనుకుంటే.. కాస్త ముందుగా వెళ్లాలి. మీరు వెళ్లే రూట్ ఎప్పుడూ బిజీగానే ఉంటుందనుకుంటే.. ముందుగానే ఆఫీస్‌కి బయలుదేరి వెళ్లాలి.
అలవాటు చేసుకోండి..
ఏదైనా టైమ్ అనుకుంటే దానికి punctualityగా ఉండేలా చూసుకోండి. ఇది మీకో అలవాటులా మారితే మంచిది. అపాయింట్మెంట్స్, డెడ్‌లైన్స్ వంటివి ఉంటే రిమైండర్స్ పెట్టుకోవాలి. మీ షెడ్యూల్‌ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. మీరు ఏ పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో టైమ్‌ని ట్రాక్ చేయండి.
సోషల్ మీడియాకు కూడా ఓ టైమ్‌ని సెట్ చేసుకోండి. ఆ పరిధి దాటకుండా ఉండేలా చూసుకోండి. బ్రేక్ ఎప్పుడూ చిన్నవిగానే ఉండాలి. కానీ రెగ్యూలర్ బ్రేక్స్ తీసుకోవాలి. మీ షెడ్యూల్‌ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని అడ్జెస్ట్ ఎలా చేసుకోవాలో ప్లాన్ బి పెట్టుకోవాలి. ఈ టిప్స్ రెగ్యూలర్‌గా ఫాలో అయితే.. మీరు అనుకున్న పనిని.. అనుకున్న సమయంలో చేయగలుగుతారు. ఒత్తిడి కూడా ఉండదు.
Also Read : రిలేషన్ షిప్లో 2-2-2 రూల్.. హ హ ఈ రూల్ ఫాలో అయితే బ్రేకప్స్ జరగవేమో