అన్వేషించండి

2-2-2 Relationship Rule : రిలేషన్ షిప్​లో 2-2-2 రూల్.. హ హ ఈ రూల్ ఫాలో అయితే బ్రేకప్స్ జరగవేమో

Relationship Rules : రిలేషన్​ షిప్ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా లవర్స్ మధ్య రిలేషన్​ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకే ఓ సింపుల్​ రూల్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. 

Healthy Relationship Tips : ఈ జనరేషన్​లో రిలేషన్​షిప్స్ అనేవి చాలా డెలికేటెడ్​గా మారిపోయాయి. టైమ్ ఇవ్వట్లేదని.. పర్సనల్ స్పేస్ లేదని.. అస్సలు పట్టించుకోవట్లదని.. ఇన్​స్టాలో పోస్ట్​కి లైక్​ చేయలేదని.. మరీ దారుణంగా సిల్లీ రీజన్స్​తో బ్రేకప్స్​ చెప్పుకుంటున్నారు. పైగా రిలేషన్​లోకి వెళ్లి.. కొన్ని రోజులు ఉన్న తర్వాత.. ఒకరికొకరు తొందరగా బోర్ ఫీల్ అవుతున్నారు. దీనివల్లే బ్రేకప్స్​ కోసం వింత వింత కారణాలు వెతుక్కుంటున్నారు. 

అంత సింపుల్ అయిపోంది..

అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఓ వ్యక్తికి ఎంత తొందరగా దగ్గరైపోతున్నారో.. దగ్గరైన తర్వాత అంతే ఫాస్ట్​గా దూరమైపోతున్నారు. ఎందుకంటే.. ప్రేమనంతా ఒకేసారి చూపించేసి.. సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ చేసి.. చివరికి.. మా ప్రైవసీని మీరు డిస్టర్బ్ చేయొద్దు.. మా ఇద్దరికీ వర్క్​ అవుట్ కావట్లేదు.. మ్యూచువల్ అండర్​స్టాండింగ్​తోనే విడిపోతున్నామంటూ పోస్ట్​లు పెట్టేస్తున్నారు. ఈ కాలంలో రిలేషన్స్ ఇంత సింపుల్​గా మారిపోతున్నాయి. 

అందుకే ఏది సీరియస్ రిలేషన్​ షిప్​.. ఎవరు నిజంగా ఉండాలనుకుంటున్నారో తెలుసుకోవడం కష్టంగా మారింది. నిజంగా మీరు మంచి రిలేషన్​షిప్​లో ఉంటే.. దానిని కాపాడుకోవాలనుకుంటే.. ఇద్దరి మధ్య అండర్​స్టాండింగ్ ఉండాలి. అలాగే ఇద్దరికీ ఇబ్బంది కలిగించని కొన్ని రూల్స్​ని కూడా ఫాలో అవ్వాలి. అలాంటి రూల్స్​లో 2-2-2 రిలేషన్ షిప్ రూల్ ఒకటి. అసలు 2-2-2 అంటే ఏమిటి? ఈ రూల్​లో ఉండే రూల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

2-2-2 రిలేషన్​షిప్ రూల్ (2-2-2 Relationship Rule)

2 గంటలు : మీ రిలేషన్​ని హెల్తీగా కొనసాగించండంలో 2-2-2 బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో ఒక్కో 2కి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. మొదటి 2కి అర్థం రెండు గంటలు. రోజంతా కలిసి ఉండాల్సిన పనిలేదు. వారంలో రెండు గంటలైనా ఇద్దరూ క్వాలిటీ టైమ్​ స్పెండ్ చేసేలా చూసుకోవాలి. ఇద్దరూ కలిసి.. రెండు గంటలు స్పెండ్ చేయడానికి టైమ్, ఎఫర్ట్ పెట్టి.. హ్యాపీగా ఉండేలా చూసుకోవడాన్ని మొదటి 2 సూచిస్తుంది. 

2 రోజులు : ఈ మధ్యకాలంలో రిలేషన్​షిప్స్ ఎలా మారిపోయాయంటే.. టైమ్ స్పెండ్ చేయట్లేదని ఎంతగా ఫీల్ అవుతున్నారో.. స్పేస్ ఇవ్వట్లేదు.. సఫకేటింగ్​ ఫీలింగ్​ ఉంటుందని కూడా అంతే ఫీల్ అవుతున్నారు. ఎక్కువగా కలిసి ఉన్నా.. ఎక్కువ సమయం స్పెండ్ చేసినా కూడా విడిపోతున్న జంటలు ఎన్నో. అందుకే ఈ 2-2-2 రూల్​లో సెకండ్ 2 స్పేస్​ని సూచిస్తుంది. రెండు రోజులు మీ పార్టనర్​ మీరు స్పేస్ తీసుకోవాలని తెలిపే నెంబర్ ఇది. అంతేకాకుండా ఇది పర్సనల్ స్పేస్, గ్రోత్​ని ఇండికేట్ చేస్తుంది. 

2 వారాలు లేదా 2 నెలలు : రెండు వారాలకోసారి లేదా రెండు నెలలకోసారి చిన్న వెకేషన్​కి వెళ్లడాన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. దగ్గర్లో ఉంటే.. రెండువారాలకు లోకల్​గా ఎక్కడికైనా వెళ్లొచ్చు. అదే దూరంగా ఉంటే 2 నెలలకోసారి వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్​గా, చిన్న వెకేషన్​కి వెళ్లి రావడం వల్ల ఇద్దరిలో ఒత్తిడి తగ్గుతుంది. ఇద్దరూ మంచి టైమ్ స్పెండ్ చేయడానికి వీలు ఉంటుంది. అందుకే లాస్ట్ 2 వెకేషన్​ని ఇండికేట్ చేస్తుంది. 

2-2-2 రూల్ బెనిఫిట్స్.. 

ఈ రూల్ ఫాలో అవ్వడం వల్ల క్వాలిటీ టైమ్ పెరుగుతుంది. మీనింగ్ ఫుల్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి. పర్సనల్ స్పేస్, పర్సనల్ గ్రోత్, కెరీర్​పై ఫోకస్ చేయడానికి వీలు ఉంటుంది. ఇండిపెండెంట్​గా ఉండాలనే కోరిక కూడా తీరుతుంది. అలాగే మీ రిలేషన్​లో ఎలాంటి ఇగోలు ఉండవు. ఈ రూల్ మీ రిలేషన్​ని ఫ్రెష్​గా, మీ పార్టనర్​ని కలిసేందుకు ఎగ్జైటింగ్​గా ఎదురుచూసేలా చేస్తుంది. 

అవసరాలకు తగ్గట్లు.. 

ఈ 2-2-2 రూల్​ని మీ లైఫ్ స్టైల్​, మీ పరిస్థితులకు తగ్గట్లు మార్చుకోవచ్చు. ఎలా అంటే 2 ప్లేస్​లో 1 ఉండొచ్చు.. 3 ఉండొచ్చు. కానీ రూల్స్ సేమ్ ఉంటాయి. రోజులు, వారాల్లో మార్పులు ఉంటాయి. ఈ రూల్ మీకు నచ్చితే మీరు ఫాలో అయిపోవచ్చు. అలాగే మీ రిలేషన్​ షిప్​ని హెల్తీగా కాపాడుకోవచ్చు. 

Also Read : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US New President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US New President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Embed widget