ఇతరుల తప్పులను మన్నిస్తూ బంధాలను కలుపుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ కొన్ని తప్పులను ఎక్కువకాలం భరిస్తే అది మీకే భారమవుతుంది. మీకు, మీ ఆలోచనలకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు వారిని ఎక్కువ కాలం భరించాల్సిన అవసరం లేదు. మీ పార్టనర్ వేరే వాళ్లతో సన్నిహితంగా ఉంటున్నప్పుడు మీరు దూరమైపోండి. ఏ బంధానికైనా నమ్మకం చాలా ముఖ్యం. అది లేనప్పుడు మీరు ఉన్నా వేస్టే. దూషించడం, కొట్టడం, శారీరకంగా ఇబ్బంది పెట్టడం వంటివి రెడ్ ఫ్లాగ్స్. ఫ్యూచర్ గురించి మీకు ఎలాంటి హోప్స్ ఇవ్వకపోతే జాగ్రత్త పడండి. తరచూ అబద్ధాలు చెప్తూ మిమ్మల్ని మోసం చేస్తుంటే బీ కేర్ ఫుల్. (Images Source : Unsplash)